యినాకుని పండుగ దేశమంతటా జరుగుతది. ఇగ యినాకడునంగనే గా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తోటి శేసే రంగురంగుల పతిమలే గుర్తుకు వత్తయి. నిమజ్జనమప్పుడు గవాటిని శెరువుల్ల, కుంటల్ల యేసుట్ల పర్యావరణానికి ఆని జర్గుతాందని, మట్టి పతిమలే శేయాలని పచారం శేత్తం. ఇగ కొన్ని సోట్ల నిమజ్జనాన్ని పతిమను పెట్టిన సోటే శేత్తాంటే, కొన్నిసోట్ల నిమజ్జనమే శేత్తలేరు. ఇగిప్పుడు పతిమను పెట్టుడు, తీసుడు, నిమజ్జనం శేసుడసొంటివేయీ లేకుండనే, గీయినె మస్తు ఇకమతు శేసిండు. గా మొక్కలతోనే 9 అడుగుల వన గణపతిని శేసి, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులకెక్కిండు.

గీయినెది ఆంధ్ర ప్రదేశ్ రాస్ట్రం, తూర్పుగోదావరి జిల్ల, కడియం మండలం పొట్టిలంక ఊరు. పేరు ధనరాజు, గీయినె మురుగన్ పేరుతోటి నర్సరీని నడుపుతాండు. గాయినె రెండేండ్లు శమ పడ్డడు. కేవలం నాలుగు మాల్ఫీజియా తీగజాతి మొక్కలతోటి గా గణపతి ఆకృతిని తయారు శేసిండు. ఇగది నెట్టింట వైరలైంది. గా సొషల్ మీడియతోటి దేశమంతా తెలిసింది. గా పంజాబ్‌ల ఆపీసున్న ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ గీ మొక్క యివరాలను సేకరించింది. ఇగ గీ అవార్డునిచ్చింది. ఇగీ గుర్తింపు వచ్చుడుతోటి గా రైతు ధనరాజు మస్తు ఆనందపడ్తాండు.

