ప్రజల్లో ఆశల రేకెత్తించే రాష్ట్ర బడ్జెట్
సంక్షేమానికి పెద్దపీట, అభివృద్ధి లక్ష్యంగా కేటాయింపులు
రూ. 3.22 లక్షల కోట్ల బడ్జెట్
రాష్ట్ర బడ్జెట్ “స్వర్ణాంధ్ర ప్రదేశ్” దిశగా బలమైన అడుగులు పడుతున్నట్లు ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ శాసన సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా నిరూపించారు. గత వైకాపా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక విధ్వంసాలు, అప్పులు మరియు అనవసర ఖర్చుల పరిస్థితిని అధిగమిస్తూ, అభివృద్ధి లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపుదిద్దబడింది.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితి:
- స్థూల విలువ: రూ. 3.22 లక్షల కోట్లు
- రెవెన్యూ వ్యయం: రూ. 2,51,162 కోట్లు
- మూలధన వ్యయం: రూ. 40,635 కోట్లు
- రెవెన్యూ లోటు: రూ. 33,185 కోట్లు
- ద్రవ్య లోటు: రూ. 79,926 కోట్లు
ఈ అంకెలతో బడ్జెట్, రాష్ట్రాన్ని గాడిలో పెట్టే, భవిష్యత్తులో సుస్థిర అభివృద్ధి పథంలో నడిపించాలన్న సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది.రాష్ట్రంలో వ్యవసాయం ప్రాధాన్యతను క్రమంగా పెంచుతూ, రైతుల సంక్షేమం కోసం రూ. 48 వేల కోట్లు కేటాయించడం, ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి రూ. 6300 కోట్లు కేటాయించడం ద్వారా మద్దతు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు కోసం రూ. 6705 కోట్లు కేటాయించి భవిష్యత్తులో విస్తృత ఆదాయానికి మార్గం వేసింది.
“తెలంగాణకు హైదారాబాద్, మహారాష్ట్రకు ముంబై ఎంత ముఖ్యమో, మనకు అమరావతి అంతే ముఖ్యం. రాజధాని అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం” అంటూ ఆర్థిక మంత్రి ఘన సంకల్పాన్ని వెల్లడించారు. గతంలో మూడు రాజధానుల ప్రసంగంతో చోటు చేసుకున్న గందరగోళాన్ని సరిదిద్దడానికి ఆర్థిక మంత్రి చర్యలు తీసుకుంటున్నారు.
కేటాయింపుల్లో కీలక రంగాలు:
- విద్యారంగం: పాఠశాల విద్యకి రూ. 31,805 కోట్లు, ఉన్నత విద్యా రంగానికి రూ. 2506 కోట్లు
- సామాజిక సంక్షేమం: ఎస్సీల సంక్షేమం కోసం రూ. 20,281 కోట్లు, బీసీల సంక్షేమం కోసం రూ. 47,456 కోట్లు
- వైద్య ఆరోగ్య సేవలు: రూ. 19,264 కోట్లు
- పర్యాటక శాఖ: యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకు రూ. 469 కోట్లు
- గ్రామీణాభివృద్ధి: పంచాయతీ రాజ్ శాఖకు రూ. 18,847 కోట్లు
- ప్రాంతీయ అభివృద్ధి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ. 13,862 కోట్లు
- పరిపాలన: గృహనిర్మాణ శాఖకు రూ. 6,318 కోట్లు, జలవనరుల శాఖకు రూ. 18,019 కోట్లు
- మహిళా, వృద్ధ సంక్షేమం: మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగుల కోసం రూ. 4,332 కోట్లు
- ప్రభుత్వ సంక్షేమ పథకాలు:
- ఎన్టీఆర్ భరోసా పింఛన్లు: రూ. 27,518 కోట్లు
- తల్లికి వందనం: రూ. 9,407 కోట్లు
- దీపం పథకం: రూ. 2,601 కోట్లు
- మత్స్యకార భరోసా: రూ. 450 కోట్లు
ఈ బడ్జెట్ యొక్క ముఖ్య లక్ష్యాలు అభివృద్ధి, సంక్షేమం, రైతుల సంక్షేమం, విద్య, ఆరోగ్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి పై దృష్టి పెట్టడం. వీటి ద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రగతికి మార్గం సుగమవుతుంది.”ప్రతిఏడు ఆశలు, ప్రతిఏడు అభివృద్ధి” అనే దృష్టితో, పథకాలు, బడ్జెట్ కేటాయింపుల ద్వారా తెలంగాణ, మహారాష్ట్ర లాంటివి అవ్వాలని ఆర్థిక మంత్రి తెలిపారు.

