శాకిలేట్లంటే ఎవ్వలికైనా ఇట్టమే.! శిన్న పిల్లలైతే నాక్కుంట, శీక్కుంట మరీ ఇట్టంగ తింటరు. గా శాకిలేట్ శేతికిత్తిమా శెప్పినట్టింటరు. అన్నం తింటరు. ఏడుపాపుతరు. శెప్పింది చేత్తరు. గందుకే పిల్లలకు బాజర్ల శాకిలేట్లు కొనిపిచ్చుడు బాగనే అలవాటైంది గనీ, గా శాకిలేట్లు ఎట్లుంటున్నాయో సూత్తాండ్రా? ఇగో గిదీన్ని సూత్తే సాలు. ఇగ మల్ల గవాటిని అడిగితే ఒట్టనుకొండ్రి.! మల్ల గవాటి తెరువు కూడ పోరనుకోండ్రి.!!

ఒకాయినె బజార్ల దుకుణంల ఓ శాక్లెట్ కొన్నడు. గదాన్ని తినడానికి ఇప్పి సూత్తే, దిమ్మ తిరిగింది. గదాంట్ల జిబజిబాని పురుగులు కదులుతానయి. గండ్ల గా శాక్లెట్ ను తినుకుంట రకరకాల పురుగులు తిరుగుతానయి. ఎన్నాల్లదో ఏం పాడో గనీ, గదాంట్ల అన్నీ పురుగులే ఉన్నయి. గా శాక్లెట్లను తయారు శేసే కాడ కూడా గిట్లనే తీరొక్క పురుగులు ఉంటయట. గవాటిని తీసేసి, ప్యాక్ చేత్తరట. ఏ కంపెనైనా శాక్లెట్లు గిట్లనే ఉంటయన్నట్లు! పిల్లలకు గివీటిని కొనిచ్చి మనకు మనమై మన పిల్లగాండ్ల ఆరోగ్యాన్ని శెడగొడ్తానమన్నట్లు. ఇంటాండ్రా? జెర ఆలోసించుండ్రి.!

