తెలంగాణ రాష్ట్రంలో పాత బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కింగ్‌ఫిషర్, హీనెకెన్ బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రేవరేస్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఈ బ్రాండ్లకు సంబంధించిన బీర్ల విక్రయాలు తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉంది. సరఫరాకు సంబంధించి సక్రమ చెల్లింపులు జరగకపోవడం వల్లే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. గతంలో కూడా పలు కంపెనీలు ఇలాంటి సమస్యల కారణంగా తమ ఉత్పత్తుల సరఫరాను నిలిపివేసిన సందర్భాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశం రాష్ట్ర బీర్ల మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి
.

