కేరళ కొట్టాయం నర్సింగ్ కాలేజీలో దారుణ ర్యాగింగ్ ఘటన వెలుగుచూసింది. తిరువనంతపురం నుంచి వచ్చిన ముగ్గురు ఫస్టియర్ విద్యార్థులను ఐదుగురు థర్డ్ ఇయర్ సీనియర్లు తీవ్రంగా ర్యాగింగ్ చేశారు. బాధితుల బట్టలను చించివేసి, వారి మర్మాంగాలకు డంబెల్స్ వేలాడదీసి గాయాలు చేశారు. ఆపై, గాయాలకు కెమికల్స్ పూశి, నొప్పి భరించలేని విద్యార్థులు అరిచినప్పుడు నోట్లో స్ప్రే చేసారు. అంతేకాక, వారు డబ్బులు దోచుకుని, చంపేస్తామని బెదిరించారు. ఈ ఘటనకు తట్టుకోలేని విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

