Wednesday, July 29, 2026
22.6 C
Hyderabad

నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత

నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం అనారోగ్యంతో శనివారం మరణించారు. ఇటీవల కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. 1951 మే 22న పాలమూరు జిల్లా ఇటిక్యాలలో జన్మించిన జగన్నాథం, మెడిసిన్‌ చదివి కొంతకాలం డాక్టర్‌గా సేవలందించారు. 1996, 1999, 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (TDP) తరపున విజయం సాధించి, 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో బీఆర్‌ఎస్ (BRS) తరపున పోటీ చేసి ఓడిన ఆయన, 2024లో బీఎస్పీలో చేరి, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

మందా జగన్నాథం పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన తండ్రి మంద పుల్లయ్య నాగార్జున సాగర్‌లోని పైలాన్ కాలనీలో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించారు. తల్లి మంద సవరమ్మ కూడా నాగార్జున సాగర్‌లోని హిల్‌కాలనీలో ఆఫీస్ అటెండెంట్‌గా పనిచేసారు. పాఠశాల రోజుల్లో, తమ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను తట్టుకునేందుకు జగన్నాథం సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు టెన్నిస్ బాల్ పికప్ బాయ్‌గా పనిచేశారు. వేసవి సెలవుల్లో నాగార్జున సాగర్ డ్యామ్‌లో వాటర్ బాయ్‌గా, మరికొన్ని సార్లు కూలీగా పనిచేసి చదువును కొనసాగించారు.

విద్యాభ్యాసం కూడా చాలా కష్టం మధ్య సాగింది. ఆయన నాగార్జున సాగర్ హిల్‌కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకుని, హైస్కూల్‌ వరకు అక్కడే చదివారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో MBBS కోర్సు పూర్తిచేసి, సర్జన్‌గా సేవలు అందించారు. ఆయన సూర్యాపేట సివిల్ హాస్పిటల్‌లో అసిస్టెంట్ సర్జన్‌గా, గాంధీ ఆస్పత్రి, ఈఎన్‌టీ ఆస్పత్రిలో ఈఎన్‌టీ సర్జన్‌గా పనిచేశారు.

ప్రజాసేవకు మక్కువ చూపించిన మందా జగన్నాథం, రాజకీయాల్లో భాగమై ప్రజలకు సేవలు అందించారు. ఆయన మరణంతో రెండు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఎంతో గౌరవనీయమైన వ్యక్తి కోల్పోయింది.

Latest News

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News