రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంటు లో ప్రకటించిన రైల్వే బడ్జెట్ ప్రకారం, ఏపీకి రికార్డు స్థాయిలో రూ.9,417 కోట్లు కేటాయించగా, తెలంగాణకు రూ.5,337 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం ఏపీలో రూ.84,559 కోట్ల విలువైన రైల్వే పనులు కొనసాగుతున్నాయి. అదనంగా, రాష్ట్రంలో 74 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడంతో పాటు 1,560 కి.మీ. కొత్త రైల్వే లైన్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణలో కూడా రైల్వే అభివృద్ధికి నిధులు భారీగా కేటాయించామని మంత్రి తెలిపారు. కాజీపేటలో రైల్వే ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు తెలంగాణకు మొత్తం రూ.41,677 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలో రాష్ట్రానికి నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.

