2024లో వరదలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫాను కారణంగా ప్రభావితమైన ఐదు రాష్ట్రాలకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) (NDRF) కింద రూ.1554.99 కోట్ల అదనపు సహాయం అందించేందుకు కేంద్రం ఒకే చెప్పింది. ఈ మేరకు ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని జరిగిన ఉన్నత స్థాయి కమిటీ ఈ నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.1554.99 కోట్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.608.08 కోట్లు, నాగాలాండ్‌కు రూ.170.99 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, తెలంగాణకు రూ.231.75 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు మంజూరయ్యాయి.

