ఇగిప్పుడు ఇండ్లు కట్టుడంటే గోడలే కాదుల్లా…! గోడల్లెక్కనే అద్దాలు పెట్టుడు, ఇనుప సువ్వలతోటి గ్రిల్స్ పెట్టుడు, రకరకాల డిజైన్లతోటి శేత్తాండ్రు. గోడలు మాత్రం పెడ్తలేరు. గవాటితోటి ఎల్తురుకు ఎల్తురు, గాలికి గాలి వత్తాంది. గసొంటి ఇకమతే గది సూడుండ్రి మరి.

నాల్గు మూలలు సమానంగా లోపల డిజైన్లతోటి గీ ఇటికెలసొంటి డిజైన్లు దుకాన్లల్ల దొరుకుతానయి. గవాటిని తెచ్చి, నానబెట్టి, ఇటికెలు పేర్సినట్లే ఒక్కదాని మీదొక్కటి గోడ కడ్తాండ్రు. ఇగ గవి సూపుకు మంచిగుంటానయి. గాలి, ఎల్తురు వత్తానయి. గట్లనే ఇటికెల కర్సు తగ్గుతానయి. గీ ఇకమతును గిప్పుడు శానా మంది అనుసరత్తాండ్రు. మీరూ ఆలోసించుండ్రి.!

