Friday, September 25, 2026
27.1 C
Hyderabad

ఆరోగ్యకరమైన భవిష్యత్తుల కోసం ఫార్మసిస్ట్ ల సశక్తీకరణ!|PHARMACIST|HEALTH

(ప్రపంచ ఫార్మసిస్ట్ ల దినోత్సవం : 25 సెప్టెంబర్ 2026)

ప్రపంచంలో ఔషధం అవసరం లేని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. ఔషధ ప్రయోక్తలైన ఫార్మసిస్ట్ లు ప్రతి నిత్యం ప్రపంచవ్యాప్తంగా ఔషధాలతో పాటు క్లిష్టమైన ఆరోగ్య అవసరాలను తీర్చుతున్నారు. ఫార్మసిస్ట్ లు కీలకమైన ఔషధాల ఉత్పత్తి, సరఫరా, వితరణ, చికిత్స, నవీన శాస్త్రీయ ఆవిష్కరణలు వంటి రోగి సంరక్షణ క్షేత్రంలో ప్రత్యేక స్థానమందు ఉన్నారు. ఫార్మసిస్ట్ లు తమ నిపుణతను పూర్తి స్థాయిలో ప్రదర్శించి ప్రాక్టీస్ చేయకలిగే పరిస్థితులు కల్పిస్తే, ఆరోగ్య వ్యవస్థలు ప్రజలకు మరింత చేరువ, మరింత బాధ్యత, మరింత సుస్థిరతగ ఉంటాయి. మరింత మంచి ఆరోగ్య ఫలితాల కోసం ఫార్మసిస్ట్ లు చేస్తున్న ప్రదానాలను దృశ్యీకరించటానికి, వేడుక చేసుకోవటానికి సెప్టెంబర్ 25 వరల్డ్ ఫార్మసిస్ట్స్ డే మనకు ఒక అవకాశం. కనుక, 2026 వరల్డ్ ఫార్మసిస్ట్స్ డే కోసం “ఎంపవరింగ్ ఫార్మసిస్ట్స్ ఫర్ హెల్దియర్ ఫ్యూచర్స్” అనే నినాదాన్ని ఎంపిక చేసింది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మసిస్ట్స్ (ఎఫ్ ఐ పి). ఫార్మసిస్ట్ లను సశక్తీకరించటం అంటే మారుతున్న ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా వారిని నైపుణ్యాలతో సిద్ధం చేయటం, గుర్తింపు, అనువైన పని వాతావరణం కల్పించటం అంటారు ఎఫ్ ఐ పి అధ్యక్షుడు పాల్ సింక్లెయిర్. ఈ సశక్తీకరణ ఐచ్ఛికం కాదు, బలమైన భవిష్యత్ సంసిద్ధ వ్యవస్థల నిర్మాణం కోసం ఆవశ్యకం అని నొక్కి చెబుతుంది ఎఫ్ ఐ పి.

ఇంక మన భారతదేశం విషయానికి వస్తే, దేశంలో 12 లక్షల రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లు ఉన్నారు. 8 లక్షల 50 వేల మంది ఫార్మసిస్ట్ లు కమ్యూనిటీ, హాస్పిటల్, ఇండస్ట్రీ, ఆకాడమియ మరియు రెగ్యులేటరీ రంగాలలో చురుకుగా పని చేస్తున్నారు. వీరిలో 58 శాతం మహిళలు. 35 సంవత్సరాల లోపు వయసున్న యువత 40 శాతం. దేశంలో ఫార్మసిస్ట్ ల సాంద్రత 10 వేల జనాభాకు 9.1. ఇది ప్రపంచ సగటు 9.55 కు చాలా దగ్గర. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ మరియు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫార్మసిస్ట్ ల హెల్త్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ చేస్తున్నాయి. ఇన్ని సానుకూల అంశాలు ఉన్నందున ప్రభుత్వం, ఆరోగ్య వ్యవస్థలు, ప్రజలు ఫార్మసిస్ట్ ల సేవలను పూర్తి స్థాయిలో సమర్థవంతంగా వినియోగించు కొన్నట్లయితే “స్వస్థ్ భారత్” సాకారం సుసాధ్యమే!

ప్రభుత్వ బాధ్యత: మన దేశంలో ఫార్మసిస్ట్ లకు సరియైన గుర్తింపు ఈయక, వారి విజ్ఞానాన్ని సరిగా వినియోగించుకోక చాలా నష్టపోతున్నాం. ప్రభుత్వ సంకల్పంతో ఫార్మసిస్ట్ లకు సరియైన గుర్తింపు కల్పించి, వారి సేవలను సద్వినియోగం చేసుకొని, సత్ఫలితాలు సాధించవచ్చు. అన్ని వైద్యశాలలలో హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ డిపార్ట్మెంట్స్ నెలకొల్పాలి. సహేతుక ఔషధ వినియోగం, విచక్షణాయుత ఆంటీ మైక్రోబియల్ వాడకం అమలు పరచాలి. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలో ఫార్మసిస్ట్ లకు సముచిత స్థానం కల్పించాలి. ప్రాథమిక వైద్యం, దీర్ఘ వ్యాధుల నిర్వహణ, వ్యాక్సినేషన్, వైద్య శిబిరాలు, మహామారులు, ప్రకృతి విపత్తులు వంటి సందర్భాలలో ఔషధ చికిత్స కోసం ప్రిస్క్రిప్షన్ అధికారాలు ఇచ్చి పరిధి పెంచాలి. ఔషధ నియంత్రణ శాఖను పటిష్ట పరచాలి.

ఇతర హెల్త్ ప్రొఫెషనల్స్ పాత్ర: ఔషధం లేని చికిత్స ఊహించ లేము. ఔషధ నిపుణులైన ఫార్మసిస్ట్ లు చికిత్సా బృందంలో కీలకమైన సభ్యులు. మెడికల్ ప్రాక్టీషనర్ లు, నర్స్ లు ఈ విషయం గ్రహించి ఔషధ చికిత్సలో ఫార్మసిస్ట్ లను కలుపుకొని పని చేయాలి. సమిష్టి పనితీరు మరియు పరస్పర రెఫరల్ ఉండాలి. ఫార్మసిస్ట్ ల ఔషధ పరిజ్ఞానం వారికీ, క్లయెంట్ లకు ఉభయతారకం కాగలదు.

ప్రజల పాత్ర: ఫార్మసిస్ట్ ను ఏదో ఒక ఆరోగ్య అవసరానికి కలువని వ్యక్తి ఉండరు. ప్రాథమిక చికిత్స, స్వీయ చికిత్స, దీర్ఘ కాలిక వ్యాధుల చికిత్స, సీజనల్ వ్యాధులు, ఎపిడెమిక్స్, వ్యాధి నివారణ, వాక్సినేషన్ వంటి అవసరాలు తీర్చడానికి తక్షణం అందుబాటులో ఉండే హెల్త్ ప్రొఫెషనల్ ఫార్మసిస్ట్ మాత్రమే!

ఫార్మసిస్ట్ ల సేవలకు కృతజ్ఞత తెలుపటానికి, వారిని మరింత సశక్తీకృతులను చేయటానికి వరల్డ్ ఫార్మసిస్ట్స్ డే ఒక మంచి సందర్భం!

-డాక్టర్ రాపోలు సత్యనారాయణ
ఫోన్: 9440163211

(వ్యాసకర్త ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడు)

Latest News

అడుగుకు అభినందనలు!|ADUGU DIGITAL MEDIA

మట్టి వినాయకుల ప్రచారానికి పలువురి ప్రశంసలు ఈ ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగించాలని సూచనలు అడుగు కార్యాలయానికి మంత్రి జూపల్లి, కలెక్టర్ పలువురి ఫోన్లు! పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజలు నిర్వహించాలని ప్రజలకు అవగాహన...

మూడో బిడ్డకు బంపర్ ఆఫర్!?|ADUGU TRENDS

ఎనకటికి ఎంత ఎక్కువ మందిని కంటే గంత ఇలువ. అంత గౌరవం. ఒక్కొకల్లు డజను మందిని కనేది. గంపెడు మందితో ఇల్లు కళకళలాడేది. ఎంత ఎక్కువ మంది ఉంటే, గా ఇంటికి అంత...

శాశ్వత సభ్యత్వంలో భారత్ ముందడుగు!?|EDITORIAL

భారత్‌కు శాశ్వత సభ్యత్వం సాధించాలంటే దౌత్య మద్దతుతోపాటు ఐ రా స చార్టర్‌ సవరణకు అవసరమైన ప్రక్రియలు పూర్తికావాలి. తాజా యూరప్‌ మద్దతు ఆశలను పెంచినా, తుది ఫలితానికి మరింత అంతర్జాతీయ సమ్మతి...

సెప్టెంబర్ 25, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 09.53 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం శతభిషం ఉదయం 11.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శూల పగలు 03.50 వరకు ఉపరి గండ కరణం గరజి ఉదయం 09.43...

SIRపై CJP సమరం..|SIR|CJP

సీఈసీకి 48 గంటల డెడ్‌లైన్! న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ **(SIR)**పై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో...

తెలంగాణ వార్‌రూమ్‌ టు ఢిల్లీ వార్‌రూమ్‌|TELANGANA|WAR ROOM|DELHI|WAR ROOM

రుద్ర సంతోష్‌ కుమార్‌కు ఏఐసీసీలో కీలక బాధ్యతలు హైదరాబాద్‌: తెలంగాణలో కులగణన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకు సమన్వయం చేసిన కాంగ్రెస్‌ నాయకుడు రుద్ర సంతోష్‌ కుమార్‌కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. జాతీయ...

జింబాబ్వేలో ఘనంగా గణేష్ శోభాయాత్ర|ZIMBABWE|GANESH|SHOBHA YATRA

రూ.8 లక్షలకు లడ్డూ సొంతం చేసుకున్న బద్దం నరేష్ రెడ్డి జింబాబ్వే రాజధాని హరారేలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హరారే గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించిన వేడుకలు...

యికటి0చిన ముద్దు కటకాలు సూపింది!?|ADUGU TRENDS

ము ము ముద్దంటే చేదా?! ఆ ఉద్దేశ్యం లేదా? అన్నరు. ముద్దంటే ఎవరికి చేదు చెప్పండి. ఆ ఉద్దేశ్యం ఉందో? లేదో తెలుసుకోకపోతే, ముద్దూ, ముచ్చటా యికటిత్తయి. కటకాలు కూడా సూపిత్తయి. ముద్దుకైన, ముచ్చటకైన...

ఊగిసలాటకు ఊతం భద్రతే!|EDITORIAL

చమురు ధరల ఊగిసలాటకు తాత్కాలిక దౌత్య పరిణామాలు మాత్రమే కాకుండా యుద్ధం, రవాణా అంతరాయాలు, ఉత్పత్తి సామర్థ్యం, భద్రతా ముప్పులు కారణమవుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొని, అంతర్జాతీయ నౌకా రవాణా సాధారణ స్థితికి...

సెప్టెంబర్ 24, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 09.33 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ధనిష్ఠ ఉదయం 09.58 వరకు ఉపరి శతభిషం యోగం ధృతి సాయంత్రం 04.34 వరకు ఉపరి శూల కరణం కౌలవ ఉదయం 09.08...

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News