Monday, November 2, 2026
25.7 C
Hyderabad

‘ఆపరేషన్ సిందూర్’ అర్థం పరమార్థం ఇదే!

న్యూ ఢిల్లీ, మే 8 (అడుగు న్యూస్):
పహల్గాం ఉగ్రదాడిపై ప్రతీకారంతో రగిలిపోయిన భారత్ తానేంటో పాకిస్తాన్ కు రుచి చూపిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరిట విరుచుకుపడింది. అయితే భారత్ ఈ మెరుపు దాడులకు ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరును ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

అధికారిక వర్గాల సమాచారం మేరకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరును సూచించింది ప్రధాని మోడీ. “మన మహిళలు భర్తలను కోల్పోయారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని భారత్‌ ఎక్కడున్నా వదిలిపెట్టదు అనేలా మన ప్రతిస్పందన కచ్చితంగా కనిపించాలి” అని మోడీ అధికారులకు స్పష్టం చేసినారు. ఏప్రిల్‌ 22వ తేదీన పహల్గాంలోని బైసరన్‌ లోయలో ఉన్న పర్యటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. అక్కడ ఉన్న జంటల్లో పురుషులను వేరు చేశారు. ఆ తర్వాత వారిని మతం అడిగి మరీ కాల్చి చంపారు. అయితే ఉగ్రవాదులు చేసిన జంటల్లో అప్పటికి ఆరు రోజుల క్రితమే పెళ్లైన నవవధూవరులు వినయ్‌ నర్వాల్‌, హిమాన్షి కూడా ఉన్నారు. భారత నేవీ అధికారి అయిన వినయ్ నర్వాల్ను ముష్కరులు కాల్చి చంపేశారు. తన కాళ్ల పారాణి ఆరకముందే హిమాన్షి జీవితంలో చీకటి అలుముకుంది. దీంతో వినయ్ మృతదేహం వద్ద కూర్చుని గుండెలవిసేలా ఆమె రోదించింది. అందుకు సంబంధించిన ఫొటో దేశాన్ని కుదిపేసింది.

అయితే హిందూ మహిళలు తమ వివాహ స్థితిని సూచించడానికి నుదిటిన సిందూరం పెట్టుకుంటారు. పెళ్లి మండపంపై వరుడు, వధువుకు తొలిసారి సిందూరం పెడతాడు. కానీ హిమాన్షి అలా జరిగిన ఆరు రోజులకే భర్తను, తన ఐదో తనాన్ని కోల్పోయింది. అలా 26 మంది మహిళల సిందూరాన్ని దూరం చేసిన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకే భారత సైన్యం చేపట్టిన దాడికి ప్రధాని మోదీ ‘ఆపరేషన్ సిందూర్’ అని పెట్టినట్లు తెలుస్తోంది.

అందరినీ ఆకర్షించిన ఫోటో!
ఆపరేషన్ సిందూర్ పేరుతో మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్‌‌పై భారత్ క్షిపణి దాడులు జరిపిన కొద్ది సేపటికే రక్షణ మంత్రిత్వ శాఖ ఆపరేషన్‌ సిందూర్‌ అని ఓ ఫొటోను పోస్ట్‌ చేసింది. తర్వాత.. అది క్షణాల్లోనే వైరల్‌ అయిపోయింది.

ఇంగ్లిష్‌లో రాసిన అక్షరాల్లో ”SINDOOR”లో ఒక ‘O’లో కుంకుమతో నిండిన గిన్నె ఉంది. మరో ‘O’ చుట్టూ చెల్లాచెదురుగా కుంకుమ పడి ఉంది. ఆ పోస్టునే భారతీయులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకున్నారు.

Latest News

నవంబర్ 02, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి అష్టమి సాయంత్రం 04.40 వరకు ఉపరి నవమి నక్షత్రం పుస్యమి ఉదయం 08.53 వరకు ఉపరి ఆశ్లేష యోగం శుభ సాయంత్రం 04.54 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ సాయంత్రం 04.40 వరకు ఉపరి...

పట్టా శాశ్వతం.. ఓటు మాత్రం తాత్కాలికమా!?|ESSAY|GRADUATES

ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు. అర్హులైన ప్రతి పౌరుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన ఓటును వినియోగించుకునేలా ఎన్నికల వ్యవస్థ ఉండాలి. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు విధానం మాత్రం...

కరెంట్ అఫైర్స్|CURRENT AFFAIRS|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|EDUCATION

1) లడఖ్‌లోని పుగా వ్యాలీలో భారతదేశపు మొట్టమొదటి జియోథర్మల్ బావులు తూర్పు లడఖ్‌లోని పుగా వ్యాలీలో 1,000 మీటర్ల లోతు కలిగిన భారతదేశపు మొట్టమొదటి మరియు అత్యంత లోతైన జంట జియోథర్మల్ (భూగర్భ ఉష్ణ)...

గీ బూరు మిఠాయి గింత పని శేసిందా!?|ADUGU TRENDS

యెనకటికి ఓ సైకోలు మీదనో, మూడు గిర్రల బండి మీదనో.. ఓ గంట మోగేది. గది మెల్లెగా మన వాడల్లోకి వచ్చేది. ఇగ గది సూద్దుం గదా? గావాటి మీద ఎర్రగనో, గులాబీలోనో...

పేదరికంపై భారత్ విజయం|EDITORIAL

ఒకప్పుడు పేదరికం భారత్‌ను వెంటాడింది.. ఇప్పుడు అదే పేదరికంపై దేశం గణనీయమైన విజయం సాధిస్తోంది! 12 ఏళ్లలో 49.6 కోట్ల మందికి ఊరట. ఇది అభివృద్ధికి సంకేతమేనా? అసమానతల అంతానికి ఇంకా ఎంత...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

నవంబర్ 01 నుండి నవంబర్ 07 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకు తగిన...

ఉపవాసం లేదని యిడుపు కాయితం!?|ADUGU TRENDS

ఆలుమొగల బంధం పాలునీల్ల లెక్క కలిసిపోయేది. ఎంతో యిలువైంది. వందేండ్ల పానాలకు నూరేండ్ల అనుబంధం. కానీ గా పెనిమిటి, పెండ్లాంల జీవితాలు కుక్కలు శింపి, ఇసిరేసిన ఇస్తరిలెక్కైతానయి. శీటికి మాటికి శిల్లర పంచాయితీలు,...

ప్రతి నీటి చుక్కా విలువైనదే!|EDITORIAL

ఎల్‌నినో హెచ్చరికలు.. అడుగంటుతున్న జలాశయాలు.. పెరుగుతున్న ట్యాంకర్ల డిమాండ్‌! భాగ్యనగరానికి జలగండం ముంచుకొస్తోందా? రేపటి దాహాన్ని తీర్చేందుకు నేడే మేల్కోవాలి. ప్రభుత్వ ముందుచూపుతో పాటు ప్రజల నీటి పొదుపే మహానగరానికి శ్రీరామరక్ష! మార్గం -...

అక్టోబర్ 31, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి షష్ఠి రాత్రి 09.13 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఆరుద్ర పగలు 12.05 వరకు ఉపరి పునర్వసు యోగం సిద్ద రాత్రి 10.57 వరకు ఉపరి సాధ్య కరణం గరజి ఉదయం 10.24 వరకు ఉపరి...

గీ కుక్క-కోతిని సూసి నేర్సుకోవాలె!?|ADUGU TRENDS

కుక్క-కోతిలది పుట్టుకతోనే వైరం. వాటి స్వభావికం కూడా. కోతులను తరిమికొట్టడానికి కుక్కలను సాదుతరు. గాడాడ గా కుక్కలు, కోతులు కలిసి మెలిసి కూడా ఉంటయి. గట్లనే గా ఒడిశా రాష్ట్రం కలహండి జిల్ల కేంద్రం...

గ్రహణం వీడేనా? గూడూరు కు హాస్టల్ తిరిగి వచ్చేనా?|PALAKURTHI|EDUCATION

-అడుగు కథనంతో కదిలిన అధికార యంత్రాంగం -ప్రజా ప్రతినిధుల్లోనూ కదలిక దాతలు కీ.శే బొబ్బల రంగారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు బొబ్బల రమణారెడ్డి, బొబ్బల అశోక్ రెడ్డి లు స్వచ్ఛందంగా, ఉచితంగా పేద విద్యార్థుల భవిష్యత్తు...

అన్నం అందనంత ఎత్తులో…|EDITORIAL

అన్నం పెట్టే బియ్యమే ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారింది! బస్తా ధర రూ.2 వేలు దాటుతుంటే, పప్పులు, పంచదార ధరలూ మండిపోతున్నాయి. వర్షాభావం ప్రభావమా? వ్యాపారుల ధరల మాయాజాలమా? మార్కెట్‌పై నిఘా ఏదీ? మార్గం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News