Tuesday, September 15, 2026
32.2 C
Hyderabad

సారొస్తారా?|KCR|REVANTH REDDY|CM|POLITICS|TELANGANA

SAVAL|సవాల్ కి నిలుస్తారా?

సీఎం, మాజీ సీఎంల సవాళ్ళతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. “ప్రజల్లోకి వస్తాం, ప్రభుత్వం తోలు తీస్తాం” అని కేసీఆర్, “నేను రాజకీయాల్లో ఉన్నంతవరకు కేసీఆర్, ఆయన కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను. ఇదే నా శపథం” అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. ఈ నేపధ్యంలో సహజంగా తలెత్తుతున్న ప్రశ్న: కేసీఆర్ నిజంగానే ప్రజల్లోకి వచ్చి రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తారా? లేక వ్యూహాత్మక మౌనం కొనసాగిస్తారా?

హైదరాబాద్, డిసెంబర్ 25 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చిన మాజీ కేసీఆర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క’ అంటూ కాంగ్రెస్ సర్కార్‌కి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. డైరెక్ట్ వార్ ప్రకటించారు. రెండేళ్లు ఆగాం. ఇకపై ప్రభుత్వాన్ని అడుగడునా నిలదీస్తా.. తోలు తీస్తామన్నారు. జనంలోకి తానే నేరుగా వస్తానని ప్రకటించారు. కళ్ల ముందు ఇదంతా జరుగుతుంటే మౌనంగా ఉండాలి, ఇష్టానుసారం మాట్లాడుతామంటే కుదరదని కేసీఆర్ రాజకీయ యుద్ధం ప్రకటించారు.ఇది జరిగిన రెండు మూడు రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కుటుంబం కాలకూట విషం. కేసీఆర్, బీఆర్ఎస్ చరిత్ర ఖతమే. ఇక గతమే. బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెసే. 2029లో రెండింట్ల మూడొంతల మెజార్టీతోని కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ ఇదే నా సవాల్ అంటూ విసిరారు. నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను అధికారంలోకి రానివ్వనంటూ శపథం పూనారు.

మారిన రాజకీయ సమీకరణలు
బీఆర్ఎస్ పదేళ్ళ పాలన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో సమీకరణలు మారాయి. రేవంత్ రెడ్డి తన సహజ రాజకీయ శైలిలో బీఆర్ఎస్, కేసీఆర్ పై దూకుడు, వాగ్దాడిని ప్రధానాస్త్రాలుగా సంధిస్తున్నారు. కేసీఆర్ పై కుటుంబం పాలన, అవినీతి, అధికార దుర్వినియోగం వంటి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కానీ, కేసీఆర్.. అధికారాన్ని కోల్పోయిన తర్వాత దాదాపు మౌనంగా ఉంటున్నారు. అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదు. ఎంపిక చేసుకున్న అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే బయటకు వస్తున్నారు. మాట్లాడుతున్నారు. అయితే ఈ మౌనం బలహీనతా? రాజకీయ వ్యూహమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

వ్యూహాత్మక వాగ్దాడి రేవంత్ ఎజెండా
రేవంత్ రెడ్డి సవాళ్ల వెనుక మాత్రం స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది. గత పాలనను నిరంతరం ప్రశ్నించడం ద్వారా ప్రజా అజెండాను నియంత్రిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి, శ్రేణులకు, ప్రభుత్వానికి నైతిక బలం కల్పిస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్‌ను ఆత్మ రక్షణలోకి నెడుతున్నారు. కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ, బీఆర్ఎస్ రాజకీయ వర్తమానాన్ని, భవిష్యత్తును నియంత్రిస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకత్వం స్పందించకపోతే ‘భయపడుతున్నట్లు’, స్పందిస్తే కాంగ్రెస్ చెప్పే ఆరోపణల చర్చ మరింత విస్తరించే వ్యూహాన్ని సెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. అపర రాజకీయ నిపుణడిగా పేరున్న కేసీఆర్, ఈ రెండింటి మధ్య చిక్కుకున్నారా?

కేసీఆర్ ముందున్న మూడు మార్గాలు
కేసీఆర్‌ ముందు ప్రస్తుతం మూడు ప్రధాన మార్గాలు కనిపిస్తున్నాయి.

ఒకటి నేరుగా ప్రజల్లోకి వెళ్ళడం: కేసీఆర్ రేవంత్ సవాల్‌ను స్వీకరించి నేరుగా ప్రజల్లోకి వెళ్ళాలి. బహిరంగ సభలు, పర్యటనల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలి. అయితే, దర్యాప్తులో ఉన్న ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసు, కాళేశ్వరం అవినీతి వంటి కేసులు, రాజకీయ, న్యాయపరమైన ఒత్తిళ్లు కేసీఆర్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

రెండు వ్యూహాత్మక ప్రతిస్పందన: రేవంత్ వ్యాఖ్యలకు అదేపనిగా స్పందించకుండా, వ్యూహాత్మక సందర్భాల్లో మాత్రమే కేసీఆర్ మాట్లాడటం అనేది వ్యూహాత్మక స్పందన. ఇది కేసీఆర్ రాజకీయ పరిపక్వతను ప్రదర్శించినప్పటికీ, రేవంత్ రెడ్డి దూకుడైన, పదునైన వ్యాఖ్యల వాతావరణంలో కేసీఆర్ ప్రభావాన్ని తగ్గించే ప్రమాదం కనిపిస్తోంది.

మూడు ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ముందుకుతేవడం: కేసీఆర్ తెరవెనుకే ఉంటూ, కేటీఆర్, హరీశ్ రావు వంటి బీఆర్ఎస్ ఇతర నాయకత్వాన్ని రంగంలోకి దింపి పోరాటాలు చేసే పని ఇప్పుడు చేస్తున్నారు. అయితే వారిద్దరి చుట్టూనే మొత్తం బీఆర్ఎస్ నడవడం ప్లస్ కంటే మైనసే ఎక్కువ. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఇద్దరూ రేవంత్ దూకుడు ముందు నిలువలేకపోతున్నారని ఆ పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నారు. ఈ వ్యూహం పార్టీ పునర్నిర్మాణానికి తోడ్పడవచ్చు. కానీ, ఎన్నికల్లో వరుస పరాజయాల నేపథ్యంలో, దీర్ఘాకాలిక విజయాలకి కేసీఆర్ స్థాయికి సరిపోతారా? అన్న చర్చా గులాబీల్లో గుబులు రేపుతోంది.

ప్రజాభిప్రాయమే కీలకం
ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే అంతిమం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఆర్థిక పథకాలు, పాలనలో పారదర్శకత, అభివృద్ధి ప్రజలను ఏ మేరకు సంతృప్తిపరుస్తుందన్నదే రేవంత్ దూకుడుకు బలం, బలహీనత. అదే సమయంలో, బీఆర్ఎస్ పాలనలో సాధించిన సంక్షేమం, మౌలిక వసతులు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలను కేసీఆర్, ఎంత సమర్థంగా నిర్వహిస్తారన్నదే కీలకం.

సారొస్తారా?
కేసీఆర్ పూర్తిగా ప్రజల్లోకి రాకుండా ఉండటం దీర్ఘకాలంలో బీఆర్ఎస్‌కు తీవ్ర నష్టం చేసే అవకాశం ఉంది. రాజకీయాల్లో మౌనం కూడా ఒక వ్యూహమే అయినా, అజెండాను నిరంతరం ప్రత్యర్థి నియంత్రిస్తున్నప్పుడు ఆ మౌనం ప్రభావాన్ని చూపదు. ఇదే సమయంలో కేసీఆర్, దూకుడుగా రంగంలోకి దిగే బదులు, అంశాల వారీగా, ప్రభుత్వ వైఫల్యాలపై స్పష్టమైన ప్రత్యామ్నాయంతో ప్రజల్లోకి వెళ్ళడం కేసీఆర్ ముందున్న దారి.

నిజానికి రేవంత్ రెడ్డి సవాళ్ళ లక్ష్యం కేసీఆర్ ను రాజకీయ బరిలోకి లాగడమే. కేసీఆర్ దాన్ని ఏ రూపంలో స్వీకరిస్తారు? ఏ విధంగా స్పందిస్తారన్నదే తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రజల్లోకి రావడం అనివార్యమే అయినా, అది భావోద్వేగాలతో కాకుండా వ్యూహాత్మక స్పష్టతతో జరిగితేనే బీఆర్ఎస్‌కు ప్రయోజనం. ఈ రాజకీయ యుద్ధంలో గెలుపు ఎవరిది అనేది కాదు. ప్రజలకు ఎవరు విశ్వసనీయంగా కనిపిస్తున్నారన్నదే అసలైన ప్రశ్న.

Latest News

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News