Monday, July 13, 2026
29.3 C
Hyderabad

సాహిత్య జగత్తులో మొదలైన కొత్త చరిత! మహాకవుల పుణ్యభూమి సాహితీ యాత్ర!!

తెలుగు సాహిత్య చరిత్రను తిరగరాస్తూ ఓ కొత్త ఒరవడి తెలంగాణలో మొదలైంది. ఇప్పటి వరకు చారిత్రక, అధ్యాత్మిక, ఆహ్లాదక, పర్యాటక పర్యటనలను మాత్రమే చూస్తున్నాం. కానీ, కొత్తగా సాహిత్య, సాంస్కృతిక పర్యాటకం కూడా మొదలైంది. కొద్ది నెలల క్రితం కరీంనగర్ జిల్లా కవులు, రచయితలు కలిసి సుసంపన్న సాహిత్య చరిత్ర కలిగిన పాలకుర్తిని సందర్శించారు. ఆ ఒరవడిని కొనసాగిస్తూ, పాలమూరు జిల్లా తెలుగు పండిత సమూహం ఆధ్వర్యంలో, తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తక మండలి సభ్యుడు, కవి పండితుడు పల్లెర్ల రామమోహన రావు నాయకత్వంలో 23మంది ఉమ్మడి పాలమూరు జిల్లా కవి పండితులు, ఉపాధ్యాయులు కలిసి తెలుగు మహా కవుల కన్న పుణ్యభూమి పాలకుర్తి సాహితీ యాత్ర -2025ను రెండు రోజుల పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించి దిగ్విజయంగా ముగించారు.

పాలమూరు జిల్లాకు చెందిన 23 మంది తెలుగు పండితులు, కవులు, రచయితలు, రచయిత్రులు కలిసి ఒక ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసుకుని తెలంగాణలో మహాకవుల పుణ్యభూమి సాహితీ యాత్రను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురు, శుక్రవారాలు ఆ బృందం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు చారిత్రక, అధ్యాత్మిక, సాహిత్య కవులు పుట్టిన సందర్శించింది. అలాగే ఆయా ప్రాంతాల ప్రాముఖ్యాలను, ప్రాధాన్యతలను అధ్యయనం చేసింది. తెలుగు మహాకవుల పుణ్యభూమి యాత్రకు జనగామ వద్ద కవులు కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు జి.కృష్ణ‌,పెట్లోజు సోమేశ్వరాచారి, అయిలా సొమనర్సింహచారి, చిలుమోజు సాయికిరణ్, పాలకుర్తిలో సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు డా. రాపోలు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు, అడుగు చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీ నారాయణలు, బమ్మెరలో పోతన సాహిత్య కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు మాన్యపు భుజేందర్, దేవసాని ఉపేందర్, రామాచారిలు ఘనంగా స్వాగతం పలికారు. ఆయా చోట్ల ఆయా కవులు, రచయితలు యాత్రకు స్వాగతం పలికి ఆయా ప్రాంతాలను వెంట ఉండి మరీ చూపించారు.

ఈ సందర్భంగా తెలుగు పండితులు పల్లెర్ల రామ మోహన్ రావు మాట్లాడుతూ, యాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాతో ప్రారంభించామని, మహాకవుల పుణ్యభూమి సాహితీ యాత్ర హన్మకొండలోని కాళోజీ, మడికొండలోని వానమామలై వరదాచార్యులు, ధర్మసాగర్ మండలం దేవునూరు లోని బిరుదరాజు రామరాజు, చిన్నగూడూరులోని దాశరథి సోదరుల జన్మస్థలాలను సందర్శించి పుష్పాంజలి ఘటించింది. అలాగే హన్మకొండలోని చారిత్రాత్మక రాజరాజనరేంద్ర గ్రంథాలయం, రాయప్రోలు సుబ్బారావు ప్రిన్సిపాల్ గా పని చేసిన హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లను సందర్శించి, వారి చరిత్రను తెలుసుకుని, వారి రచనలను చదివి వినిపించారు. ప్రత్యేకంగా చిన్నగూడూరులో దాశరథి సోదరుల పద్యాలు, పాటలు పాడుతూ ఊరేగింపు నిర్వహించారు. ఆయా చోట్ల ఆయా కవులు నడయాడిన ప్రాంతాలను సందర్శించారు. వారి శిష్యప్రశిష్యులను కలిసి చర్చించి, వారి కవితాగానం చేశారు. తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన ల జన్మ స్థలాలకు వెళ్ళారు. పాలకుర్తిలో శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. సోమనాథుడి స్మారక కేంద్రం, శివైక్యం చెందిన ప్రాంతంలో సమావేశం నిర్వహించారు. సోమనాథుడి రచనలను స్మరించుకుంటూ, పద్యాలను పఠించారు. బమ్మెరలో పోతన దున్నిన పోలాలు, బావి, పోతన తల్లి లక్కమాంబ పేరుమీద ఏర్పడిన లక్క సముద్రం చెరువును, సమాధిని సందర్శించారు. పోతన పూజలు చేసిన శివాలయం, ఆరాధించిన రామాలయాలను సందర్శించారు. అక్కడే కొద్దిసేపు పోతన పద్యాలను చదివారు. అనంతరం గూడూరుకు చేరి, అక్కడే ఉన్న 900 ఏండ్ల కింది శాసనాన్ని సందర్శించారు. ఆతర్వాత పాలకుర్తి సమీపంలోని వాల్మీకి మహర్షి నడయాడిన నేల వాల్మీకి పురం (వల్మీడి) ని సందర్శించారు. అక్కడ శ్రీసీతారాముల గుడిని దర్శించారు. అనంతరం అక్కడి చారిత్రక ప్రాశస్త్యాన్ని తెలుసుకున్నారు.

ఆయా చోట్ల వేర్వేరుగా ఆయా కవి పండితులు మాట్లాడుతూ, మన మహాకవులు పుట్టిన పుణ్యభూమిని సందర్శించడం, వారిని స్మరించుకోవడం, వారి సాహిత్య విశిష్టతలను తెలుసుకున్నవారిగా వాటిని చదివి పరస్పరం తెలుసుకోవడం, ఆయా ప్రాంతాల వారికి వారిని, వారి చరిత్రను, వారి సాహిత్యాన్ని పరిచయడం చేయడం లక్ష్యంగా ఈ యాత్ర చేపట్టినట్లు ఈ యాత్రకు నాయకత్వం వహించిన పల్లెర్ల రామమోహన రావు, సమన్వయం చేసిన డా. శంకరమంచి శ్యామ్ ప్రసాద్ లు తెలిపారు. వాల్మీకీ, పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన, వానమామలై వరదా చారి, బిరుదరాజు రామరాజు, కాళోజీ, దాశరథి సోదరులు, ఇనుగుర్తి ఒద్దిరాజు సోదరులు లాంటి కవి పండితులు చేసిన సాహిత్య సేవ మరువలేనిదన్నారు. ఎవరికి వారే మహామహులన్నారు.

కాగా ఈ సందర్భంగా సోమనాథ కళాపీఠం పాలమూరు కవులను ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో కట్టా గిరిజారమణ శర్మ, కట్టా అనిత, సిద్ధాంతి రాజశేఖర శర్మ, తిరుపతమ్మ, నారజ, ఉమాదేవి, డా. మాడా పుష్పలత, కమలేకర్ శ్యాం ప్రసాద్ రావు, శ్వేత, నరేశ్, అనితా కుమారి, సువర్ణ, కె.సుజాత, తిరుపతయ్య, శ్రీదేవి, శ్రీలత, బలరాం గౌడ్, పుట్టి గిరిధర్, సభాపతి చంద్రమౌళి, పుష్పలత, దేవగిరి రామన్న శివాచార్య, సునిల్ శివాచార్య, ఇమ్మడి దామోదర్, మెరుగు మధు, కేవీజీకే క్రిష్ణమాచార్య, చిక్కమఠం వీర సోమమ్మ, గూడూరు లెనిన్, సాయి సందీప్ తేజ మార్గం, రమేశ్ రాజా తదితరులు పాల్గొన్నారు.

Latest News

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

జూలై 13, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 06.23 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 03.40 వరకు ఉపరి పునర్వసు యోగం ధ్రువ సాయంత్రం 04.58 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 07.40...

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

జూలై 10, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి రాత్రి 01.41 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం భరణి ఉదయం 10.01 వరకు ఉపరి కృత్తిక యోగం శూల రాత్రి 02.00 వరకు ఉపరి గండ కరణం బవ మధ్యాహ్నం 02.46 వరకు ఉపరి...

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు) లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు. 1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age). 2) చారిత్రక సంధియుగం (Proto-historic Age) 3) చారిత్రక యుగం (Historic Age) 1)...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News