Thursday, September 17, 2026
25.5 C
Hyderabad

కేసీఆర్|KCR ASSEMBLY|అసెంబ్లీకి వస్తారా!?  STRATAGIES|వ్యూహమా? వ్యూహాత్మక తప్పిదమా?

తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్‌ అసెంబ్లీకి రావడంపై కొనసాగుతున్న చర్చ కేవలం ఒక ఎమ్మెల్యే హాజరుకు సంబంధించింది మాత్రమే కాదు. అది ప్రతిపక్ష పాత్ర. ప్రజాస్వామ్య బాధ్యత. కేసీఆర్‌ వస్తే, రాకపోతే ఏమి జరుగుతుంది? ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య చర్చలు ఎలా సాగుతాయి? పాలమూరు–రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులపై చర్చ ఎలా ఉండనుంది?

హైదరాబాద్, డిసెంబర్ 26 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):

అధికారంలో ఉన్నన్నాళ్ళూ కేసీఆర్, సెక్రటేరియట్ కు వస్తారా? రారా? అన్న వాద వివాదాలు, ఇప్పుడు అసెంబ్లీకి వస్తారా? రారా? అన్న వైపు మళ్ళాయి. కేసీఆర్ మాట్లాడినా, మాట్లాడకపోయినా, అసెంబ్లీకి వచ్చినా, రాకున్నా చర్చల్లో ఉండటం ఆయనకు మాత్రమే చెల్లింది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్, ఆ పార్టీ ఎల్పీ నేతగా, ప్రతిపక్ష నాయకుడిగా.. అసెంబ్లీకి రెండంటే రెండే సార్లు వచ్చారు. ఒకటి 2024లో ఆయన తన ప్రమాణ స్వీకారానికి వచ్చినా, అసెంబ్లీ లోపలికి రాలేదు. అదీ స్పీకర్ చాంబర్ లో ముగించి వెళ్ళారు. ఆ తర్వాత 2024 బడ్జెట్ సమావేశానికి ఇలా వచ్చి, అలా వెళ్ళారు. రెండేళ్ళల్లో రెండు సార్లే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్, మూడో ఏట జరుగుతున్న ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు వస్తారా? దాదాపు రాకపోవచ్చు. వస్తే గిస్తే, అది సాంకేతికంగా తన ఎమ్మెల్యే పదవికి గండం లేకుండా చూసుకోవడానికేననే వాదన వినిపిస్తున్నది. అయినప్పటికీ, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తీరాలని, చర్చల్లో పాల్గొనాలని ప్రభుత్వం పట్టుపడుతున్నది. సీఎం రేవంత్ సహా మంత్రివర్గమంతా కేసీఆర్ ను రా రమ్మంటున్నారు.

కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి ఆయనకు కొన్ని రాజకీయ, వ్యక్తిగత కోణాలు, వ్యూహాలు ఉండొచ్చు. దీర్ఘకాలం అధికారంలో ఉన్న నేత ప్రతిపక్షంలో కూర్చోవడం అంత సులువు కాదు. పరిపాలనా శైలి నుంచి ప్రతిపక్ష పాత్రకు మారాల్సిన మానసిక, రాజకీయ సంసిద్ధతకు కొంత సమయం పడుతుంది. సభలో హాజరు కంటే బయట నుంచి రాజకీయ ఒత్తిడి పెంచడం, తమ పార్టీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టే వ్యూహాత్మకతను ఆయన ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రజాస్వామ్యంలో శాసనసభ సభ్యుడిగా సభకు రావడమనే బాధ్యతను కేసీఆర్ విస్మరిస్తున్నారనే విమర్శకు ఆయన గైర్హాజరీ బలం చేకూరుస్తోంది.

ఈసారి ఆయన వస్తారా? వస్తే సాంకేతికంగా సమస్యలు తలెత్తకుండా సంతకం పెట్టి వెళ్ళిపోతారా? చర్చల్లో పాల్గొంటారా? కేసీఆర్ సభకు హాజరైతే అధికార-విపక్షాల మధ్య చర్చలు రసవత్తరంగా సాగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి, రేవంత్-కేసీఆర్ మధ్య కాదంటే, సీఎం-ప్రతిపక్ష నేతల మధ్య ప్రత్యక్ష మాటల యుద్ధం జరగొచ్చు. వాద ప్రతివాదనల మధ్య అసలు నిజాలు వెలుగుచూసే అవకాశమూ ఉంది.

అలాగే కేటీఆర్, హరీశ్ రావులకే పరిమితమైన ప్రతిపక్ష పాత్ర కేసీఆర్ రాకతో ద్విగుణీక్రుతం అవుతుంది. అనుభవజ్ఞుడైన మాజీ సీఎం, సభలో అధికార పార్టీని అదుపు చేయనూ వచ్చు. ఆర్థిక నిర్వహణ, హామీల అమలు, పరిపాలన వంటి అంశాలపై లోతైన చర్చ జరగవచ్చు. ఇది ప్రభుత్వానికి అసౌకర్యంగా ఉన్నా, ప్రజలకు స్పష్టతనిస్తుంది. అదే సమయంలో, ప్రతిపక్షానికి నాయకత్వ నైతిక బలం, కేసీఆర్ మాటలకు మీడియా ప్రాధాన్యం పెరుగుతుంది. సభలో చర్చలు అర్థవంతంగా, ఆచరణ యోగ్యంగా జరుగుతాయి.

ఒకవేళ కేసీఆర్ సభకు రాకపోతే అసెంబ్లీలో చర్చలు ఏకపక్షమవుతాయి. యథావిధిగా ప్రతిపక్ష విమర్శలు బయటి వేదికలకే పరిమితం అవుతాయి. దీర్ఘకాలంలో ఇది ప్రతిపక్షానికే నష్టం చేసే ప్రమాదం ఉంది. ప్రభుత్వ నిర్ణయాలపై అధికారిక రికార్డులో ప్రతిపక్ష స్వరం బలహీనపడుతుంది. ఇది ప్రభుత్వానికి అనుకూలంగా మారవచ్చు. కేసీఆర్ సభకు రాకపోవడం రాజకీయ వ్యూహమే అయినా, వ్యూహాత్మక తప్పిదమవుతుంది? ప్రజాభిప్రాయ పరంగా ప్రమాదకరమే.

కేసీఆర్ అసెంబ్లీకి రావడం, రాకపోవడం ఆయన వ్యక్తిగతం. కానీ ఆయన మాజీ సీఎం. కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్యే. అన్నింటికీ మించి ప్రతిపక్ష నేత. రాజ్యాంగ బద్ధంగా సభో సీఎం తర్వాత స్థానం ప్రపతిపక్ష నేతదే. ఆయన గైర్హాజరీ ప్రభావం వ్యవస్థపై పడుతుంది. కేసీఆర్ సభకు వస్తే, తెలంగాణ రాజకీయాలు చురుగ్గా మారి, మరింత వేడెక్కుతాయి. ఇదంతా కేసీఆర్ కు తెలియంది కాదు. ఎవరో చెప్పాల్సిన అగత్యం ఆయనకు లేదు. కాకపోతే ఆయన ఎవరు చెప్పినా వినరు? ఆచరించరు. తనదైన శైలిలోనే వ్యవహరిస్తారు.

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News