Wednesday, October 7, 2026
26.6 C
Hyderabad

ప్రియాంక-బెటర్ ఛాయిసేనా!?|EDITORIAL

కాంగ్రెస్ కు ‘ప్రియాంక బెటర్ ఛాయిసా?” అన్నదానికంటే ‘కాంగ్రెస్ మెరుగైన ప్రతిపక్షంగా ఎలా సాగాలి?’ అన్నదే ముఖ్యం. సభను సజీవంగా మార్చడం ద్వారా ప్రతిపక్షం బలపడుతుంది. ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటు ప్రత్యామ్నాయ విధానాన్ని చూపాలి. రాహుల్‌కు ఉన్న జాతీయ రాజకీయ పోరాట సామర్థ్యాన్ని, ప్రియాంకలోని చర్చల నైపుణ్యాన్ని కలిపి ఉపయోగించగలిగితేనే కాంగ్రెస్‌కు ఎక్కువ ప్రయోజనం. బలమైన ప్రతిపక్షం అంటే బలమైన ఎక్కువ విషయ పరిజ్ఞానం, మెరుగైన వాదన, విశ్వసనీయ ప్రత్యామ్నాయం. కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు వేయాల్సిన సమయం ఇదే.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్ 

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అధికార, ప్రతిపక్షాల పనితీరుకు మరోసారి అద్దం పట్టాయి. జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరిగిన 19 సమావేశాల్లో లోక్‌సభ నిర్ణీత సమయానికి కేవలం 15% మాత్రమే పనిచేయగా, రాజ్యసభ 33% సమయమే పనిచేసింది. ప్రశ్నోత్తరాల సమయం లోక్‌సభలో కేవలం ఒక శాతం, రాజ్యసభలో 12 శాతం మాత్రమే సాగింది. రెండు సభలు కలిపి 12 బిల్లులు ఆమోదించినప్పటికీ, లోక్‌సభలో ఆమోదమైన 11 బిల్లుల్లో తొమ్మిదింటిపై ఒక్క ఎంపీ కూడా చర్చలో పాల్గొనలేదు.

ఇదే పార్లమెంటులో సభ్యురాలైన ప్రియాంక గాంధీ వాద్రా పాత్ర ఇందుకు భిన్నంగా కనబడుతోంది. ఆమె తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమె పదవీ కాలం కూడా చిన్నదే. 2024 నవంబర్‌లో లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక ఇప్పటివరకు 84 శాతం హాజరు నమోదు చేసుకున్నారు. వర్షాకాల సమావేశాల్లో ఆమె హాజరు 95 శాతం. ఇప్పటివరకు 11 చర్చల్లో పాల్గొని, 47 ప్రశ్నలు అడిగారు.

ప్రియాంక పాల్గొన్న చర్చల్లో రాజ్యాంగం, డీలిమిటేషన్, ఎన్నికల వ్యవస్థ, వందేమాతరం, ఆపరేషన్ సిందూర్, మైనారిటీలపై దాడులు, వయనాడ్ వరదలు వంటి అంశాలను ఆమె సభలో ప్రస్తావించారు. 2026 జూలై 28న పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లుపై కూడా చర్చలో పాల్గొన్నారు. అంటే ఒకే రాజకీయ నినాదానికో, వాదానికో పరిమితం కాకుండా వివిధ అంశాలను పార్లమెంటరీ చర్చలోకి తీసుకురావడానికి ఆమె ప్రయత్నించారు.

ఇక్కడే రాహుల్ గాంధీతో పోలిక మొదలవుతుంది. రాహుల్ 18వ లోక్‌సభలో ఇప్పటివరకు 17 చర్చల్లో పాల్గొన్నారు, 64 ప్రశ్నలు అడిగారు. నిరుద్యోగం, వ్యవసాయం, ఎరువుల కొరత, గిగ్ కార్మికులు, విద్యార్థుల ఆత్మహత్యలు, ఆహార భద్రత, రైల్వేలు వంటి అంశాలపై ఆయన ప్రశ్నలు సంధించారు. ఎన్నికల సంస్కరణలపై కూడా ఆయన చర్చలో పాల్గొన్నారు. రాజకీయ నాయకత్వంలో సమస్యల సంఖ్య కంటే వాటిని ప్రజలకు ఎలా వివరించగలుగుతున్నారన్నది ముఖ్యం. రాహుల్ గాంధీ రాజకీయ ప్రచారంలో ఓటు చోరీ, నిరుద్యోగం, కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేయడం ప్రతిపక్ష నాయకుడి హక్కే. కానీ ఆరోపణతో పాటు ఆధారాలు, ప్రత్యామ్నాయ విధానాలు, సంస్థాగత సంస్కరణల ప్రతిపాదనలు కూడా చూపాలి.

ఎన్నికల వ్యవస్థ విషయంలో ఇదే ప్రధాన సవాల్. ఎన్నికల వ్యవస్థనే పూర్తిగా అనుమానాస్పదంగా చిత్రీకరించడం ప్రతిపక్షానికే ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన పార్టీ. అందువల్ల ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకత, నియామక విధానం, ఓటర్ల జాబితాల నిర్వహణ వంటి అంశాలపై స్పష్టమైన సంస్కరణల ప్రతిపాదనలు చేయడం మరింత ప్రభావవంతమైన రాజకీయ వ్యూహం.

ప్రియాంకలో కనిపిస్తున్న ప్రత్యేకత ఇక్కడే. ఆమె ప్రసంగాల్లో వ్యక్తిగత దూషణల కంటే అంశాల ఆధారంగా సమాధానం చెప్పే ప్రయత్నం ఎక్కువగా కనిపిస్తోంది. వందేమాతరం చర్చ సందర్భంగా నెహ్రూపై విమర్శలను రాజకీయ చరిత్ర చర్చకు మళ్లించడం, అవసరమైతే నెహ్రూపై రోజంతా చర్చిద్దామని చెప్పడం వంటి వ్యూహాత్మక ప్రతిస్పందనలు సభలో ప్రత్యర్థి ఎజెండాను ఎదుర్కొనే సామర్థ్యాన్ని సూచిస్తున్నాయి. ఇది కేవలం వాక్చాతుర్యం కాదు. రాజకీయ చర్చను తనకు అనుకూలంగా మళ్లించే ప్రయత్నం.

అయితే, ప్రియాంకను వెంటనే రాహుల్‌కు ప్రత్యామ్నాయంగా ప్రకటించడం కూడా తొందరపాటు. ఆమెకు 11 పార్లమెంటరీ చర్చల అనుభవమే ఉంది. రాహుల్‌కు 17 చర్చల అనుభవం ఉంది. పైగా ప్రతిపక్ష నేతగా రాహుల్‌కు ఉన్న జాతీయ స్థాయి రాజకీయ బాధ్యత, సంస్థాగత అనుభవం, ఎన్నికల పోరాటాల పరిచయం ప్రియాంకకు ఇంకా అంతగా లేదు. కాబట్టి అన్నాచెల్లెళ్ళ మధ్య పోటీగా కాకుండా నాయకత్వ సామర్థ్యాల పోలికగా చూడాలి.

కాంగ్రెస్‌కు ఇప్పుడు రాజకీయాన్ని వికేంద్రీకరించడం అవసరం. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు, ఎన్నికల సంస్కరణలు, యువత ఉపాధి, రైతుల ఆదాయం, విద్య, ఆరోగ్యం, ధరల పెరుగుదల వంటి అంశాలపై నిరంతర పార్లమెంటరీ వ్యూహం అవసరం. ప్రియాంకను డీలిమిటేషన్, మహిళా ప్రాతినిధ్యం వంటి అంశాల్లో ముందుకు తెస్తే ఆమె సామర్థ్యం మరింత రాటుదేలే అవకాశం ఉంది.

అయితే, కాంగ్రెస్ కు ‘ప్రియాంక బెటర్ ఛాయిసా?” అన్నదానికంటే ‘కాంగ్రెస్ మెరుగైన ప్రతిపక్షంగా ఎలా సాగాలి?’ అన్నదే ముఖ్యం. సభను సజీవంగా మార్చడం ద్వారా ప్రతిపక్షం బలపడుతుంది. ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటు ప్రత్యామ్నాయ విధానాన్ని చూపాలి. రాహుల్‌కు ఉన్న జాతీయ రాజకీయ పోరాట సామర్థ్యాన్ని, ప్రియాంకలోని చర్చల నైపుణ్యాన్ని కలిపి ఉపయోగించగలిగితేనే కాంగ్రెస్‌కు ఎక్కువ ప్రయోజనం. బలమైన ప్రతిపక్షం అంటే బలమైన ఎక్కువ విషయ పరిజ్ఞానం, మెరుగైన వాదన, విశ్వసనీయ ప్రత్యామ్నాయం. కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు వేయాల్సిన సమయం ఇదే.

Latest News

‘అన్న’మో రామచంద్రా!?|RICE|FARMER|RICE MILL|STATE|CENTRAL|GOVERNMENT

బియ్యమా? ధరలు పెరుగుతున్న దయ్యమా? ధాన్యం ఉత్పత్తిలో టాప్..ధరల నియంత్రణలో ఫ్లాప్ రైతుకు గిట్టుబాటు-సామాన్యుడికి అందుబాటేది? మిల్లర్ల మాయా? పరిపాలనా వైఫల్యమా? రాష్ట్రమే కాదు, దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి! ధరల పెరుగుదలకు దరిద్రపు కారణాలెన్నో? అన్నపూర్ణ రాష్ట్రంలో ప్రజలు ‘అన్న’మో...

తాటిశెట్టుకు ఇనుప మెట్లు!?|ADUGU TRENDS

తాటి కల్లు మత్తుగున్నది.. నీ బాంచెన్ తాగుతుంటే ఎక్కుతున్నది. అనుకుంటనే గీ కల్లును మస్తుగ తాగుతుంటరు. తెలంగాణలనైతే ఊర్లల్ల ఆడోల్లు కూడా గీ కల్లు తాగుతరు. కనీ, గీ కల్లు గీసుడే మస్తు...

‘సర్’ సర్వేపై సర్వత్రా నిరసనలు.. భరోసా ఏది!|EDITORIAL

‘సర్’పై నెలకొన్న వివాదాన్ని విస్తృత ప్రజాస్వామ్య విశ్వాస సంక్షోభంలో భాగంగా చూడాలి. ఎన్నికల సంఘం నిష్పక్షపాతత్వంపై సందేహాలు రాకుండా ప్రతి అభ్యంతరానికీ పారదర్శకంగా సమాధానం చెప్పాలి. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా...

అక్టోబర్ 07, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.02 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం మఖ రాత్రి 10.32 వరకు ఉపరి పుబ్బ యోగం సాధ్య ఉదయం 07.05 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 11.55 వరకు ఉపరి...

గాడ దుర్గమ్మకు శేపల కూరే నైవేద్యం!?|ADUGU TRENDS

దేవీ శరన్నవరాత్రోత్సవాలు గదేనుల్లా.. దుర్గా నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ. తొమ్మిది రోజులు జగన్మాత అయిన గా దుర్గాదేవిని రకరకాల రూపాలల్ల అర్చిస్తూ, పదో రోజున అంటే విజయదశమి దసరా...

భయపడటం కాదు, అప్రమత్తంగా ఉండాలి!?|EDITORIAL

సైబీరియా ఘటన మనకు నేర్పే పాఠం భయపడటం కాదు. అప్రమత్తంగా ఉండటం. అధికారిక నిర్ధారణకు ముందే రూమర్లను ప్లేగ్ మహమ్మారి వార్తలుగా మార్చడం ప్రజల్లో అనవసర భయాన్ని పెంచుతుంది. అదే సమయంలో ల్యాబొరేటరీ...

అక్టోబర్ 06, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి ఏకాదశి రాత్రి 12.45 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.36 వరకు ఉపరి మఖ యోగం సిద్ద ఉదయం 09.47 వరకు ఉపరి సాధ్య కరణం బవ పగలు 01.47 వరకు ఉపరి...

అక్టోబర్ 05, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి దశమి రాత్రి 02.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి రాత్రి 12.51 వరకు ఉపరి ఆశ్లేష యోగం శివ పగలు 12.50 వరకు ఉపరి సిద్ద కరణం వణజి పగలు 03.55 వరకు ఉపరి...

పట్టుకుంటే ఊతం.. కూసుంటే ఆసనం!?|ADUGU TRENDS

వయసు మీద పడిందనుకోండ్రి. నడక కట్టమే. కూసునుడు కూడా ఇంకా కట్టం. మూడో కాలనే శేతి కర్రో.. ఇంకేదో ఒకటి ఊతంగా ఉండాల్సిందే. గట్లనే శేతకాకపోతే కూసోనికి ఏదో ఒక ఉచితాసనం ఉండాల్సిందే....

కరెంట్ అఫైర్స్|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|CURRENT AFFAIRS

1) లడఖ్‌లోని అన్ని జిల్లాల్లో అటానమస్ కౌన్సిళ్లు: లడఖ్‌లోని మొత్తం 7 జిల్లాలలో స్వయంప్రతిపత్తి కలిగిన హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిళ్లను (AHDCs) ఏర్పాటు చేయాలని మరియు ఆర్టికల్ 371 కింద రాజ్యాంగ రక్షణలు కల్పించాలని...

వంటింట్లో ధరల మంటలు!?|EDITORIAL

వానలు ముఖం చాటేస్తే పంటలు ఎండిపోతాయి.. పంటలు తగ్గితే ధరలు మండిపోతాయి.. ధరలు పెరిగితే సామాన్యుడి వంటింటిలో మంటలు చెలరేగుతాయి. నిర్ణీత బడ్జెట్‌ బుగ్గిపాలవుతుంది! వాతావరణ అస్థిరతకు అంతర్జాతీయ సంక్షోభాలు తోడవుతున్న వేళ...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

అక్టోబర్ 04 నుండి 10 వరకు రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా ఆదాయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News