ఇప్పటిదాకా వస్తువులమ్మడం సూసినం. ఆస్తులనమ్మడం సూసినం. కానీ, ఊరినే అమ్మకానికి పెట్టడం ఎక్కడైనా సూసినమా? కానీ, గా ఊరును నిజంగనే గా ఊరోల్లు అమ్మకానికి పెట్టిండ్రు. గది కూడా వట్టి నీల్లకే!?

గది మహారాష్ట్ర. షోలాపూర్ జిల్లల ఉన్న గా ఊరు పేరు తులసీ. గా ఊరును గా ఊరోల్లే అమ్మకానికి పెట్టిండ్రు. గా ఊరికి తలాపునే రెండు నదులు కూడా ఉన్నయి. కనీ, యిచిత్రంగా గా ఊరికి మాత్రం నీల్లు లేవు. నీల్లు కావాల్నని సర్కారోల్లకు నెత్తీ నోరు మొత్తుకున్నా పని కాలే, నీల్లు రాలే. ఇగ గిదంతా పని కాదని, గా ఊరోల్లంతా కలిసి, గా ఊరినే అమ్మకానికి పెట్టిండ్రు. గా ఊరికి నీల్లిచ్చినోల్లకే గా ఊరిని రాసిత్తమని గవాల్లు ఏకంగా ఓ బోర్డే రాసి పెట్టిండ్రు. గిట్లనన్నా, గా సర్కారోల్లకు సిగ్గు వచ్చి, తమ ఊరికి నీల్లిత్తరని గట్ల రాసిపెట్టి యెరైటీగా నిరసన తెలిపిండ్రన్నట్లు. ఏడు యేల జనం ఉన్న ఈ ఊరు, సగం పనులైనా కాని గా నీటిపారుదల ప్రాజెక్టు కారణంగా అనేక ఏండ్లుగా నీటి ట్యాంకర్లపైన ఆధారపడింది. గీదీంతోటి గా ఊరికి పిల్లను కూడా ఎవలిత్తలేరట. ఇగ సేసేది లేక గిట్ల సేసినమని గా తులసి ఊరోల్లు సెప్తున్నరు. మరి గీ నిరసన గా సర్కార్ కు సేరి, గా ఊరికి నీల్లొత్తయా!?

