మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం మీద…’ అన్నరు. గట్లనే ఎలుక కూడా. ‘ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా.. నలుపు నలుపేగాని తెలుపు కాదు.’ అన్నరు. గీ ఎలుక మాత్రం గదాని లెక్కకు మించి ఏం శేసిందో సూడుండ్రి.

కర్ణాటకల తుముకూరుల ఓ బంగారం దుకాణముంది. గండ్ల 10 లచ్చల యిలువైన వజ్రాలు పొదిగిన 5 తులాల బంగారం మాయమైంది. దుకాణంల చూస్తే తలుపులు గట్టిగనే ఉన్నయి. మరే బంగారం పోలే, దొంగలు పడ్డ ఆనవాల్లు దొరకలే. మరి గా నగలెట్ల మాయమయ్యాయి? గా దుకాణపాయనెకు అంతుచిక్కలే. అన్ని పరీచ్చల తర్వాత, గిదంత పని కాదని, గా సీసీ కెమెరాల తెరిసిండు. ఒక్కొక్కటి సూసిండు. ఒక ఈడియల ఓ ఎలుక గా నగల్ని నోట పట్టుకుని పోతాంది. ఇగ గా ఎలుక ఏడిదాక పోయిందో.. సూసిండ్రు. గా ఆనవాల్లతోటి నగలేడుంటయో పసిగట్టిండ్రు. ఓ కలుగు కాడ తొవ్విండ్రు. గండ్ల గా పోయిన నగలు దొరికినయి. ఓసినీ ఎలుకా! ఎంత పని శేసినవే?

