కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరింత నిఘా పెట్టింది
డ్రగ్స్ ఫ్రీ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
పిలుపునిచ్చిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 21( అడుగు న్యూస్): హైదరాబాద్ నెక్లెస్ రోడ్ జలవిహార్ లో తెలంగాణ విద్య సమితి ఆద్వర్యంలో డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ 2K రన్ నిర్వహించగా, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NRI, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మాదకద్రవ్యాలు మనిషి జీవితాన్ని నాశనం చేస్తుందన్నారు. యువత డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలని. డ్రగ్స్ అనేవి వ్యక్తిగత జీవితానికే కాకుండా సమాజానికి కూడా పెనుముప్పుగా మారుతాయని అన్నారు. అలాగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా పెట్టాలని, డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలు, అక్రమ వ్యాపారాలకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ సహా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఝాన్సీ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, విద్యార్థులు, యువత, నిర్వాహకులు, తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

