Saturday, September 19, 2026
27.3 C
Hyderabad

అసలైన బతుకమ్మ పాట!|ORIGINAL BATHUKAMMA SONG

  • బతుకమ్మ అంటే ఎవరు?

  • ఆమె ఏమి బోధించింది?

  • బతుకమ్మను ఎలా చేసి ఆడి పాడాలి?

-ప్రముఖ చరిత్ర పరిశోధకులు, రచయిత డా. ద్యావనపల్లి సత్యనారాయణ వ్యాఖ్యా సహితం

బతుకమ్మ అంటే ఎవరు? ఆమె ఏమి బోధించింది? బతుకమ్మను ఎలా చేసి ఆడి పాడాలి? అనే అంశాలన్నీ వ్యక్తం చేసే పాట ఏదైనా ఒకటి ఉంటే బాగుండేది. అలా ఉంటే ఆ ఒక్క పాటనైనా పదిలపర్చుకొని ప్రస్తుత సమాజానికి, భావి తరాలకు అందించుకుంటే బాగుంటుంది అని పరిపరి విధాల వెతుకగా, వెతుకగా సరిగ్గా అలాంటి పాట ఒకటి కోరుట్లలో వినిపించింది… 46 సంవత్సరాల కిందట… పాడింది శ్రీమతి కటుకం రాజగంగు, శ్రీమతి సిరుమల్లె లక్ష్మమ్మ. వీటిని గోపు లింగారెడ్డి సేకరించగా త్యాగరాజ లలితకళా పరిషత్ వారు “కరీంనగర్ జిల్లా జానపద గేయాలు” అనే పుస్తకంలో 1979 లో ప్రచురించారు. దానినిప్పుడు మరోసారి మననం చేసుకొని పదిలపర్చుకోవాల్సిన అవసరముంది కాబట్టి వ్యాఖ్యా సహితంగా పాఠకులకు అందిస్తున్నాం.

బతుకమ్మ అంటే…
ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నప్పుడు కనిపించే కాంతి. ఆ శక్తికి మనం పెట్టుకున్న పేరు గౌరమ్మ. గౌరమ్మ భర్త గౌరీశ్వరుడు. వారు మన స్త్రీలకు సదాలోచన, సదాచరణ గురించి బోధించారు.

సదాలోచన అంటే…
స్త్రీలు తన భర్త, అత్తమామలు, చుట్టాలు, కులం, దేశంను ప్రేమించాలి.

సదాచరణ అంటే…
తాను స్నానం చేసి పరిశుభ్రంగా ఉండడంతోపాటు తన ఇల్లు వాకిలిని ఇంపుగా ఉంచుకోవటం, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడం, కుటుంబ పోషణ, సంపాదన విషయమై భక్తితో పని చేస్తే భాగ్యవంతులవుతారు.

బతుకమ్మను ఎలా చేసి ఆడి పాడాలి?
ఇలా చెప్పి మాయమైన గౌరమ్మకు పువ్వులన్ని ఏరి బతుకమ్మగా పేరిచ్చి, బయలులో పెట్టి, బతుకమ్మల చుట్టూ శూద్ర స్త్రీలు నిలుచుంది ఆడి పాడారు. అందుకు సంతోషించి గౌరమ్మ వారికి వరాలు ఇచ్చింది. గౌరమ్మకు జయము. అనేక అష్టకాలు, స్తోత్రాలు, శ్లోకాలు రాసిన ఆది శంకరాచార్య సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా ఏక శ్లోకిని కూడా రాశాడు.

అట్లనే పలు పాటలను నేర్చుకోవడానికి బద్దకించేవారికై ఉద్దేశించినది ఈ బతుకమ్మ పాట. కింద ఇస్తున్నాము. తెలంగాణ అమ్మాయిలు, అమ్మలు నేర్చుకొని పాడుకోవాలని కోరుతూ…

అసలైన బతుకమ్మ పాట:

ఆకాశ మందునా ఉయ్యాలో
అల్లెనూ మేఘములు ఉయ్యాలో

మేఘాల నడుమనా ఉయ్యాలో
మేలైన కాంతిలో ఉయ్యాలో

అందునా గౌరమ్మ ఉయ్యాలో
ఆనంద మొప్పుగా ఉయ్యాలో

కంటికీ యింపుగా ఉయ్యాలో
కనిపించుచుండెనూ ఉయ్యాలో

గౌరమ్మ వెనుకనూ ఉయ్యాలో
గౌరీశ్వరుండు ఉయ్యాలో

పులితోలును గట్టి ఉయ్యాలో
పూనికతొ సేపట్టి ఉయ్యాలో

కొండ జంగమయ్య ఉయ్యాలో
కండేందు మౌళి ఉయ్యాలో

భక్తులూ పాలించ ఉయ్యాలో
వచ్చీరి సతి గూడి ఉయ్యాలో

పూరాన దంపతులు ఉయ్యాలో
బోదించిరిట్లు ఉయ్యాలో

సాతులార మీరు ఉయ్యాలో
సద్బోదలినరండి ఉయ్యాలో

పతి భక్తియూ మీకు ఉయ్యాలో
పచ్చలా పతుకమ్ము ఉయ్యాలో

భర్త సేవలు మీకు ఉయ్యాలో
బంగారి గొలుసులు ఉయ్యాలో

నాదునీపై ప్రేమ ఉయ్యాలో
నడుము వొడ్యాలమూ ఉయ్యాలో

సుట్టాల ప్రీతియే ఉయ్యాలో
పట్టాగొలుసులు ఉయ్యాలో

అత్తమామల సేవ ఉయ్యాలో
అందెలూ గాజులూ ఉయ్యాలో

కష్టమూలోర్చుడే ఉయ్యాలో
కనకంపు సాకట్లు ఉయ్యాలో

కులం అభిమానంబు ఉయ్యాలో
అజ్రాల కమ్మలు ఉయ్యాలో

దేశాభిమానంబు ఉయ్యాలో
కాసులా దండలూ ఉయ్యాలో

ఈ సొమ్ములూ మీరు ఉయ్యాలో
ఇంపుగా తలువండి ఉయ్యాలో

ఈ సొమ్ములూ వంటి ఉయ్యాలో
ఏ సొమ్ములూ గలవు ఉయ్యాలో

ఇల్లు వాకిలి మీరు ఉయ్యాలో
ఇంపుగా ఉంచండి ఉయ్యాలో

పరిసుబ్బురము కొరకు ఉయ్యాలో
తానమూ సేయండి ఉయ్యాలో

పిల్లలాకేమొ మీరుయ్యాలో
విజ్జనే నేర్పండి ఉయ్యాలో

విజ్జలాచె మీరు ఉయ్యాలో

వుర్దినే సెందేరు ఉయ్యాలో
పనిపాటలను మీరు ఉయ్యాలో

స్వామినే తలువండి ఉయ్యాలో
ఫలిములర్పించండి ఉయ్యాలో

ఈ వీదులన్నిటి ఉయ్యాలో
ముక్తియును గలుగునూ ఉయ్యాలో

భక్తితోడా జేయా ఉయ్యాలో
భాగ్యమ్ము గలుగునూ ఉయ్యాలో

మోదంబుతో సేయ ఉయ్యాలో
పుత్రులూ కలిగేరు ఉయ్యాలో

భక్తితోడా సేయ ఉయ్యాలో
అన్ని ఇట్ల తెలిపి ఉయ్యాలో

అటుమాయమైరి ఉయ్యాలో
మాయమైనా దిక్కు ఉయ్యాలో

మల్లెలూ మొల్లెలూ ఉయ్యాలో
మంకెనా పువ్వులూ ఉయ్యాలో

పువ్వులన్నీ ఏరి ఉయ్యాలో
పిడికిట్లా నింపి ఉయ్యాలో

బతుకమ్మ పేరిచ్చి ఉయ్యాలో
బయలులో పెట్టిరీ ఉయ్యాలో

సుద్దరా కాంతలూ ఉయ్యాలో
సుట్టుగా నిలుసుండి ఉయ్యాలో

పాటలూ పాడిరీ ఉయ్యాలో
ఆటలూ ఆడిరీ ఉయ్యాలో

ఆ పాటలను జూసి ఉయ్యాలో
ఆనందమొందిరీ ఉయ్యాలో

గౌరమ్మ వరమిచ్చె ఉయ్యాలో
కాంతాలందరికి ఉయ్యాలో

మెప్పులా నొందిరి ఉయ్యాలో
ఒప్పులా కుప్పలు ఉయ్యాలో

ఆ వరం కొండబోయి ఉయ్యాలో
అల్లంబునకు జూపి ఉయ్యాలో

జయ జయా గౌరమ్మ ఉయ్యాలో
జయము నీకు తల్లి ఉయ్యాలో

– డా. ద్యావనపల్లి సత్యనారాయణ

Latest News

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News