తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ అధికారుల బృందం సింగపూర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ (SSIA)తో సమావేశమైంది. SSIA చైర్మన్ బ్రెయిన్ టాన్, SSIA వైస్ చైర్మన్ టాన్ యేవ్ కాంగ్, SSIA కార్యదర్శి సీ ఎస్ చువా లు పాల్గొని సెమీకండక్టర్ రంగంలోని అవకాశాలపై చర్చించారు. సింగపూర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పనులను వివరించారు. తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను మంత్రి శ్రీధర్ బాబు వివరించి సింగపూర్ పరిశ్రమను తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానించారు. SSIA తెలంగాణ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించగా, వారి బృందం త్వరలో హైదరాబాద్‌ను సందర్శించనుంది.

