Thursday, July 30, 2026
23.7 C
Hyderabad

ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి

షెడ్యూల్డు కులాల రిజర్వేషన్లను 15 నుంచి 18 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రిజర్వేషన్లను పెంచడానికి సహేతుకమైన విధానం పాటించాల్సి ఉన్నందున 2026 జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత ఆ జనాభా నిష్పత్తి మేరకు ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 18 శాతానికి పెంచడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు.

మంత్రి దామోదర రాజనర్సింహ శాసనసభలో ప్రవేశపెట్టిన ‘షెడ్యూల్డు కులాల రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్’ బిల్లుపై ముఖ్యమంత్రి మాట్లాడారు. రిజర్వేషన్లను పెంచడంతో పాటు దామాషా ప్రకారం గ్రూపు 1, 2, 3 కేటగిరీల వర్గీకరణ బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

“ప్రస్తుత రిజర్వేషన్లను పెంచాలంటే సహేతుకమైన విధానం పాటించాల్సి ఉంటుంది. 2011 జనాభా లెక్కలు మాత్రమే అధికారికంగా అందుబాటులో ఉన్నాయి. చట్టపరంగా ఎలాంటి చిక్కులు ఎదురుకాకుండా రిజర్వేషన్లు పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం కనుక 2026 జనాభా లెక్కలు చేపడితే ఆ జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడానికి వీలవుతుంది” అని వివరించారు.

షెడ్యూల్డు కులాలకు మరింత ప్రయోజనం చేకూర్చే విషయంలో ప్రభుత్వం పారదర్శకమైన కార్యాచరణ చేపడుతుందని, ఇలాంటి విషయాల్లో భేషజాలు లేకుండా అందరినీ సంప్రదించి వారి అభిప్రాయాల మేరకు ముందుకు వెళుతామని వివరించారు.

షెడ్యూల్డు ఉప కులాల వర్గీకరణ బిల్లు కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియకు శాసనసభ పార్టీలు రాజకీయాలకు అతీతంగా పూర్తి స్థాయిలో మద్దతు పలికినందుకు సభ్యులందరికీ ముఖ్యమంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వర్గీకరణ సమస్యకు శాసనసభ శాశ్వతమైన పరిష్కారం చూపించడం ఒక చారిత్రాత్మకమైన సందర్భంగా అభివర్ణించారు.

వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. కృష్ణమాదిగతో పాటు చాలా మంది 30, 35 ఏండ్లపాటు జరిగిన వర్గీకరణ పోరాటంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లలో ప్రాధాన్యత ఇవ్వడం, ఆ కుటుంబాల్లో విద్యావంతులుంటే రాజీవ్ యువ వికాసం పథకం కింద చేయూతనందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ఎస్సీల్లో రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ జరగాలని 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కాలంలో శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించడం, ఆ తర్వాత జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ నియామకం, ఆ కమిషన్ నివేదిక, తదుపరి అంశం సుప్రీంకోర్టుకు చేరడం వంటి ఎస్సీ వర్గీకరణ అంశంలో చోటుచేసుకున్న సంఘటనల పరిణామ క్రమాన్ని ముఖ్యమంత్రి వివరించారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ఎస్సీ శాసనసభ్యులందరూ ఒక కమిటీగా ఢిల్లీ వెళ్లి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తమ వాదనను బలంగా వినిపించడం, సుప్రీంకోర్టు తీర్పు వెలువడటం, ఆ వెంటనే వంద శాతం అమలు చేస్తామంటూ శాసనసభలో ప్రకటన చేసిన పరిణామాలను వివరించారు.

సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ సీతక్క, లోక్ సభ సభ్యుడు డాక్టర్ మల్లు రవి తో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి, ఆ ఉపసంఘం సూచన మేరకు జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ నియమాకం, కమిషన్ పనిచేసిన విధానం, నివేదిక వంటి అంశాలన్నీ ముఖ్యమంత్రి సభలో వివరించారు.

కమిషన్ 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించడం, సామాజిక, విద్య, ఆర్థిక పరంగా పూర్తిగా వెనుకబడిన వర్గాలను గ్రూప్ 1 కింద 15 ఉపకులాలను పరిగణలోకి తీసుకుని వారికి 1 శాతం రిజర్వేషన్, మధ్యస్థంగా లబ్దిపొందిన కులాలను గ్రూపు 2 కింద 18 ఉపకులాలను పరిగణలోకి తీసుకుని వారికి 9 శాతం రిజర్వేషన్, గణనీయంగా ప్రయోజనం పొందిన కులాలను గ్రూపు 3 కింద పరిగణిస్తూ వారికి 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని సిఫారసు చేసిన అంశాలను తెలియజేశారు. ఈ అంశంపై శాసనసభ చర్చలో పాల్గొన్న సభ్యులకు, పార్టీలకు ముఖ్యమంత్రి గారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News