Thursday, July 30, 2026
23.7 C
Hyderabad

భౌ భౌ…! భౌ భౌ…భౌ!!|DOGS|INDIA|SUPREME COURT

కుక్క కాటుకు చెప్పు..! దెబ్బేనా?
కుక్కలకు ‘పిచ్చి’ నిజమేనా?
కుక్క కరిస్తే మనుషులకు పిచ్చే
కుక్కలంటే మనుషులకు ఎందుకంత పిచ్చి?
రెచ్చిపోతున్న పిచ్చి కుక్కలు…
విచ్చలవిడిగా విస్తరిస్తోన్న వీధి కుక్కలు
కరచి, రక్కి, కొరికి పారేస్తున్న శునకాలు

జీవ కారుణ్యమా? జీవ దారుణ్యమా?

నియంత్రణకు ‘సుప్రీం’ ఆదేశాలు
కుక్కలను సాదుకునే రోజుల నుంచి…
కుక్కలంటే భయపడే రోజులొచ్చాయ్!

-డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ

కుక్కకు కూడా ఓ రోజొస్తుందంటే ఏమో అనుకున్నాం! నిజంగానే కుక్కల రోజులు వస్తాయని ఎవరు అనుకున్నారు? అనుకొని ఉండరు!! ప్రస్తుతం కుక్కల రోజులే నడుస్తున్నాయి. లేకపోతే ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పదే పదే జోక్యం చేసుకుంటూ, కుక్కల నియంత్రణకు కఠినమైన ఆదేశాలివ్వడం ఎక్కడైనా చూశారా? ఎప్పుడైనా విన్నారా? కుక్కల అదుపునకు మార్గదర్శకాలనివ్వడం మామూలుగా జరిగే పనేనా? అత్యంత నమ్మకమైన పెంపుడు జంతువుగా, కొలిచి మొక్కే కుక్కే, కాటేస్తే దిక్కు లేకుండా పోతుందని ఎవరనుకున్నారు? అంతా కాలం ‘మహి’మ. కాల భైరవుడి వాహనుడే కాల యముడై కాటేస్తున్న కలికాలం ‘మహి’లో ‘మహి’మ.

కాల భైరవుడి వాహనం, గ్రామ సింహం, శునకం.. అత్యంత విశ్వాసమైన పెంపుడు జంతువు. పేరేదైనా అది కుక్క. కుక్క కుక్కే. అందుకే ‘కనకపు సింహాసనం మీద శునకమును కూర్చుండ బెట్టిన, వెనుకటి గుణమేల పోవు?’ అన్నది అందుకేనేమో. అది అనుభవసారం.

మనిషి మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు కుక్కే. కుక్కలు చాలా నమ్మకమైనవి. అందుకే మానవ స్నే‘హితులు’గా ప్రసిద్ధి చెందాయి. కుక్కలు క్షీరదాలు, అవి తమ పిల్లలకు పాలు ఇచ్చి పెంచుతాయి. ఇవి ‘కానిడే’ కుటుంబానికి చెందిన మాంసాహారులు. కుక్కల సగటు జీవితకాలం 10 నుండి 13 ఏళ్ళు. 14వేల ఏళ్ళ కిందటే కుక్కలు మనుషులతో కలిసి జీవించడం ప్రారంభించాయని ఆధారాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 340 కి పైగా కుక్క జాతులు ఉన్నాయి. కుక్కల శరీరంలో తోక పొడవును బట్టి 320 ఎముకలు, 700 కండరాలు ఉంటాయి. కొన్ని సంస్కృతులలో కుక్కను దైవంగా భావిస్తారు. భారతదేశంలో కాలభైరవుని వాహనంగా కొలుస్తారు.

ప్రపంచ వ్యాప్తంగా
ప్రపంచ వ్యాప్తంగా 90 కోట్లకు పైగా కుక్కలు ఉన్నాయట. వీటిలో 47 కోట్లు పెంపుడు కుక్కలు కాగా, మిగిలినవి వీధి కుక్కలు. ప్రపంచంలోని మొత్తం కుక్కల్లో 75% వీధి కుక్కలేనట. ప్రపంచంలోనే అత్యధిక కుక్కలున్న దేశం అమెరికా. అమెరికాలో వాటి సంఖ్య 7.58 కోట్లుగా అంచనా. బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది.

దేశంలో…
భారతదేశంలో ఉన్న 5.25 కోట్ల కుక్కల్లో 1.53 కోట్ల వీధి కుక్కలు ఉన్నాయని అంచనా. అయితే కుక్కల మొత్తం జనాభాకు సంబంధించిన నిర్దిష్ట సంఖ్య అందుబాటులో లేదు. ఉత్తర ప్రదేశ్ లో అత్యధికంగా కుక్కలున్నాయట.

తెలంగాణలో…
ఇక తెలంగాణ వ్యాప్తంగా కుక్కల ఖచ్చితమైన సంఖ్య తెలియదు, కానీ, అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం ఒక్క హైదరాబాద్‌లోనే 15 లక్షల కుక్కలు ఉన్నాయట. అందులో 3.8 లక్షలకు పైగా వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేయబడింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కుక్కలు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో 3.8 లక్షలకు పైగా వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ జరిగిందని ఒక నివేదిక లెక్క.

ఏపీలో…
2019 లైవ్‌స్టాక్ సెన్సెస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 8.64 లక్షల కుక్కలు ఉన్నాయి, అందులో 4.72 లక్షలు వీధికుక్కలు. వీధికుక్కల నియంత్రణ సమర్థవంతంగా లేని కారణంగా ఈ సంఖ్య పెరుగుతూనే ఉందనడానికి కుక్కకాటు సంఘటనలే తార్కాణం.

పెరుగుతున్న కుక్కకాట్లు
రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 300 కంటే ఎక్కువ కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి, హైదరాబాద్‌లో రోజుకు వందకు పైగా కేసులు ఉన్నాయి.2022-24 మధ్య గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 35%, రాష్ట్రవ్యాప్తంగా 31% కుక్కకాటు కేసులు పెరిగాయి.

తాజా ఘటనలు:
ఇటీవల నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో వీధి కుక్కలు 30 మందిని గాయపరిచిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. తాజాగా హయత్‌నగర్‌లోని శివగంగా కాలనీలో ఏడేళ్ల చిన్నారిపై 20 వీధి కుక్కలు దాడి చేసిన సంఘటన ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నది.

మానవహక్కుల కోర్టు విచారణ
నల్గొండ మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో వీధి కుక్కలు 30 మందిని గాయపరిచిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది.

సుప్రీం కోర్టు విచారణ, ఆదేశాలు
వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రహదారులపైకి కుక్కలు, పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని పేర్కొంది. డ్రైవ్ అమలుపై 8 వారాల్లో స్టేటస్ రిపోర్టు అందజేయాలని ఆదేశించింది. స్కూల్స్‌, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, దవాఖానాల్లోకి.. కుక్కలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వీధి కుక్కల నిర్వహణపై అమికస్ క్యూరీ నివేదికను అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. నివేదిక అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు చేయకుంటే చర్యలు తప్పవని సుప్రీంకోర్టు హెచ్చరించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి.అంజారియా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఈ విచారణలో పశువుల సంక్షేమ బోర్డు(ఎడబ్ల్యుబీఐ)ను ఇంప్లీడ్ చేయడంతో పాటు, కుక్కల దాడులకు గురైన బాధితుల దరఖాస్తులకు అనుమతి ఇచ్చింది. రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు పునరుద్ఘాటించింది. ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే సంబంధిత అధికారులపై వ్యక్తిగత చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. 8 వారాల్లోగా అమలు విధానం, చర్యలపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.

జంతు ప్రేమికుల వాదనలేంటి?
జంతువులను చంపడం లేదా హింసించడం కాకుండా, స్టెరిలైజేషన్ వంటి శాశ్వత పరిష్కారాలతో జనాభాను అదుపులో ఉంచాలి. ఇది జంతువుల పునరుత్పత్తిని నిరోధిస్తుంది. వీధి కుక్కలకు సురక్షితమైన ఆశ్రయాలు నిర్మించి, వాటికి ఆహారం, వైద్య సంరక్షణ అందించాలి. కుక్కల ప్రవర్తనను, వాటి జనాభాను, ప్రజారోగ్య ప్రమాదాలను అంచనా వేయడానికి శాస్త్రీయ ఆధారాలు, డేటాను ఉపయోగించాలి. కుక్కలు కూడా జీవులే, వాటికి కూడా కరుణ, సంరక్షణ అవసరం. వాటిని వీధుల్లో వదిలివేయడం లేదా చంపడం వంటివి చేయకూడదు. ప్రజారోగ్య సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు, స్థానిక అధికారులు చురుగ్గా వ్యవహరించాలి.

మరణాల్లో 36శాతం కుక్క కాటువే
ఇదిలావుంటే, ప్రపంచవ్యాప్తంగా రేబిస్ మరణాలలో 36% భారతదేశంలోనే ఉన్నాయని ఒక అంచనా. ఇది వీధి కుక్కల విస్తరణ, విజృంభణ, విశృంఖలానికి నిదర్శనం. వీధి కుక్కలు ప్రత్యేకించి పిల్లలే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి.

కుక్కలు అలా ఎందుకు ప్రవర్తిస్తాయి?
రేబిస్ వ్యాధితో సంబంధం లేదు. వ్యాధి సోకినప్పుడు దాని మానసిక స్థితి ఎలా ఉంటుందో, ఆకలి, దాహంగా ఉన్నప్పుడు కూడా అవి అలాగే ప్రవర్తిస్తాయి. కుక్కల్లో చెమట గ్రంథులు ఉండవు. నోటిద్వారానే ఒగరుస్తూ వాటి శరీర వేడిని బయటికి వదులుతుంటాయి. ఆ స్థితిలో కూడా అవి చాలా అసహనంగా ఉంటాయి. అయితే కుక్క పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయలేం.

పిల్లల మీద ఎందుకు విరుచుకుపడతాయి?
కుక్కలకు పిల్లలూ, పెద్దలు తేడా ఏమీ లేదు. రోజుల తరబడి ఆహారం తినకుండా ఉండడం వల్లే అవి ఎగబడతాయి. కొంతమంది పిల్లలు వాటి తోక తొక్కుతూ, రాళ్లు విసురుతూ చికాకు తెప్పిస్తుంటారు. అలాంటప్పుడు కూడా అవి విరుచుకుపడతాయి. కాబట్టి కుక్క జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది.

చికిత్స విధానం
కుక్క కరిచిన ప్రదేశాన్ని 10-15 నిమిషాలు సబ్బు, నీటితో బాగా కడగాలి. ఆ తర్వాత 70% ఆల్కహాల్ లేదా అయోడిన్ వంటి క్రిమిసంహారక మందుతో శుభ్రం చేయాలి. వెంటనే సమీపంలోని హాస్పిటల్ కి వెళ్లి వైద్య సహాయం తీసుకోవాలి.

వ్యాక్సిన్
రేబిస్ వ్యాక్సిన్ సాధారణంగా 14 రోజుల వ్యవధిలో 4 మోతాదులలో ఇస్తారు. వ్యాక్సిన్‌తో పాటు, రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్ అనే ఇంజెక్షన్‌ను కూడా ఇవ్వవచ్చు, ఇది జంతువు కరిచిన ప్రాంతానికి సమీపంలో ఇవ్వబడుతుంది.

కుక్కల నియంత్రణ ఎలా?
కుక్కలను పట్టుకోవడం, వాటికి స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేసి, రేబిస్ వ్యాధికి టీకాలు వేస్తారు. నులిపురుగుల నివారణ మందులు కూడా అందిస్తారు.ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత, కుక్కలను వాటి ప్రదేశంలోనే తిరిగి వదిలివేస్తారు.

ప్రజల బాధ్యతలు, అవగాహన
కుక్కల ప్రవర్తన, వాటితో ఎలా వ్యవహరించాలి అనే విషయాలపై ప్రజలకు, కాలనీ సంఘాలకు అవగాహన కల్పిస్తారు. పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా నమోదు చేయించాలి, తద్వారా కుక్కకాటు ఘటనలు తగ్గించవచ్చు. కుక్కలకు ఆహారం, నీరు వంటివి ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఇవ్వడం, అలాగే ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడం కూడా ముఖ్యం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఒకవేళ దూకుడుగా ఉన్న కుక్క ఎదురైతే, దాని నుండి పరిగెత్తి పారిపోవద్దు. అలా చేస్తే అది మిమ్మల్ని వెంబడించవచ్చు. కుక్కకు వెన్ను చూపకుండా, నెమ్మదిగా, జాగ్రత్తగా దూరంగా నడవాలి. కుక్క దృష్టిని మళ్లించడానికి బిస్కెట్లు వంటి ఆహారం విసిరివేయవచ్చు. కుక్కలు ఆహారంపై దృష్టి పెట్టినప్పుడు, మీరు సురక్షితంగా వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా చేతిలో కర్ర ఉండటం బెటర్. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్రను చేతి నుండి జారవిడవటం కానీ, విసరడం కానీ చేయొద్దు. చేతి కర్రతో కుక్కలను భయపెట్టాలి. చేతిలో కర్రలేకపోతే, నిల్చున్న చోటే చేతిలోకి రాయి తీసుకోవడం కానీ, తీసుకున్నట్లుగా నటించడం కానీ చేస్తే కుక్కలు పారిపోతాయి. కుక్కలకు భయపడితే అవి మనల్ని భయపెడతాయి. వాటిని మనం భయపెడితే, అవి భయపడతాయి.

సామాజిక సమస్య

– డాక్టర్ రాపోలు సత్యనారాయణ

కుక్కలు, కోతులు సామాజిక సమస్యగా పరిణమించాయి. ఇప్పటికీ సాదక సహజీవన చరులుగా ఉన్న కుక్కలు సాదుకున్న వారిని కూడా రక్కడం, గీరడం వంటివి చేస్తున్నాయి. ఇక వీధి కుక్కలు, పిచ్చికుక్కలు మనుషులపై దాడులు చేస్తున్నాయి. కుక్కలు గీరినా, రక్కినా, కాటేసినా, చికిత్స తప్పనిసరి. టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీధి కుక్కలను చంపడమే పరిష్కారం కాదు. శాస్త్రీయంగా అదుపు చేయవచ్చు. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News