Wednesday, June 10, 2026
25.4 C
Hyderabad

ఘనంగా ‘TELANGANA|తెలంగాణ తల్లి’ IDOL|విగ్రహ ఆవిష్కరణ|INAGURATION

ఆవిష్కరించిన MINISTER|మంత్రి PONGULETI|పొంగులేటి, MLA|ఎమ్మెల్యే YASHASWINIయశస్విని, JHANSI REDDY|ఝాన్సీ రెడ్డి

STATE FORMATION DAY|రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున చరిత్రాత్మక ఘట్టం

CONGRESS|కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్ళతో భారీ ర్యాలీ

జనగామ(పాలకుర్తి), జూన్ 2 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలనకు గుర్తుగా పాలకుర్తి పట్టణం మరో చారిత్రక ఘట్టానికి వేదికైంది. దేశముఖ్ లను ఎదిరించిన గడ్డ, ఉద్యమాల ఖిల్లా, ఎందరికో ఉద్యమ స్ఫూర్తిని అందించిన పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజీవ్ చౌరస్తాలో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రంలో రెండవ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ అనంతరం, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన తొలి విగ్రహానంతరం, జిల్లాల్లో మొదటిసారిగా పాలకుర్తిలో ఏర్పాటు చేసి ఆవిష్కరింపచేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిలను అభినందిస్తున్నానన్నారు. అలాగే గత ఏడాదిన్నరగా ఆర్థిక పరిస్థితి గడ్డుకాలంగా నిలిచినప్పటికీ, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు చేస్తోందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ధరణి’ వ్యవస్థలో కనిపించిన గందరగోళానికి విరుద్ధంగా, సంపూర్ణ నియమ నిబంధనలతో రూపొందించిన ‘భూబారతి’ పోర్టల్‌ ఆగస్టు 15 నాటికి ప్రతి రైతులకు అందుబాటులోకి వస్తుందన్నారు. రాబోయే 2 నెలల్లో పది వేల సర్వేయర్లకు శిక్షణ, ఆరు వేల మందికి నియామకం, అన్ని మండలాల్లో ట్రైనింగ్‌ బృందాలు
పనిచేయడం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఐదు లక్షల ఇందిరమ్మ ఇల్లు తక్షణం మంజూరు, మెటీరియల్ బిల్‌ను స్థాయికి తగ్గట్టు చెల్లింపు చేస్తున్నామన్నారు. దశలవారీగా మొత్తం 20 లక్షల ఇళ్ల నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, వైద్యం, సన్న బియ్యం, 17 లక్షల రేషన్ కార్డులు, 56 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలు పూర్తి చేశామన్నారు. ఇటీవల ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఊహించని దరఖాస్తులు రావడం ప్రజా ప్రభుత్వంపై యువతకు ఎంత నమ్మకం ఉందో తెలుస్తుందని గర్వంగా తెలిపారు. అలాగే మాజీ మంత్రి ఎర్రబెల్లిని ఉద్దేశిస్తూ, చచ్చిన పామును చంపాలన్న ఉద్దేశ్యం లేదు, అయితే తోక జాడిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ చరిత్రను సగర్వంగా గుర్తు చేస్తూ మన ప్రాంతంలో రెండవ విగ్రహం పెట్టడం తమకు ఎంతో గర్వకారణంగా వుందన్నారు. ఈ విగ్రహం మహిళల అస్తిత్వానికి, ఉద్యమ స్ఫూర్తికి నిలువెత్తు రూపమని చెప్పారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ విగ్రహ ఏర్పాటు మన ప్రాంతానికి ఒక మైలు రాయి మాత్రమే కాదని, పాలకుర్తిలో ఆత్మగౌరవాన్ని నిలబెట్టే చిరస్థాయి గుర్తు అని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆరు మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు తదితరులు పాల్గొనగా, కళాబృందాల జానపద నృత్యాలు, ఆటపాటలతో, భారీ ర్యాలీ నిర్వహించారు.

దళిత కుటుంబం ఇంట్లో భోజనం

కార్యక్రమం అనంతరం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, అడిషనల్ కలెక్టర్లు రోహిత్ సింగ్, పింకేశ్ కుమార్ పాటిల్, డీసీపీ రాజా మహేంద్ర నాయక్, ఏసిపి నర్సయ్య తదితరులు పాలకుర్తిలో దళిత వర్గానికి చెందిన గాదేపాక ఎల్లయ్య ఇంటికి వెళ్ళి, వారి ఇంట్లో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సన్న బియ్యంతో వండిన అన్నంతో భోజనం చేశారు.

పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే|MLA

పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, ఆరు మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత పాలకుర్తి మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి లు ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొని ప్రత్యేక నృత్య కార్యక్రమాలను తిలకించారు.

Latest News

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

ఏపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు|AP|RAJYASABHA|TDP|JANASENA|BJP

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను అధికార కూటమిలో అభ్యర్థుల ఎంపిక...

గడ్డి కావాలా, బాబూ..!|ADUGU TRENDS

పసువులకే కాదు, కాస బుద్ధి తక్కువున్నోల్లకు గడ్డి పెడతం.! గడ్డంటే గడ్డి కాదు కనీ, తిట్లన్నట్లు.!! గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలుతాగి మినిసి విషమవుతాడు అంటాడు ఆత్రేయ. మరి ఆవు మేసే...

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత!|EDITORIAL

పర్యావరణ దినోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. ప్రకృతిని కాపాడుకోవాలనే సామూహిక సంకల్పానికి ప్రతీక. పర్యావరణాన్ని రక్షించడం అంటే మానవజాతి భవిష్యత్తును రక్షించడమే. నేటి నిర్లక్ష్యం రేపటి విపత్తుకు దారితీయవచ్చు. అందుకే ప్రకృతి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News