Wednesday, September 9, 2026
31.8 C
Hyderabad

పునర్విభజన పార్టీలకు పండగే!|EDITORIAL

జనాభా ఆధారంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలను పునర్విభజించడం అనే ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్యపు వ్యవస్థకు అవసరమైన సంస్కరణ కాగా, రాజకీయ ప్రయోజనాల పరంగానూ ఎంతో లాభదాయకం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలను 543 నుండి 816కి పెంచే ప్రతిపాదన ఉంది. ఇదే విధంగా దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలు 4,123 నుండి 6,185కు పెరగవచ్చని అంచనా. అంటే 50 శాతం సీట్ల పెంపు జరగనున్నదన్న మాట.

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 25 లోక్‌సభ స్థానాలు 37 లేదా 38కి పెరగవచ్చు. అసెంబ్లీ స్థానాలు 175 నుండి 262–263 వరకు పెరుగుతాయి. తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 17 నుండి 25 లేదా 26కు, అసెంబ్లీ స్థానాలు 119 నుండి 178–179 వరకు పెరిగే సూచనలున్నాయి. ఈ మార్పులు 2029 సాధారణ ఎన్నికల నాటికి అమలులోకి వచ్చే అవకాశముందని చర్చ జరుగుతోంది.

ఈ పరిణామాలు రాజకీయ పార్టీలకు నిజంగా పండగే. మరిన్ని ఎంపీలు, ఎమ్మెల్యేల స్థానాలు పెరుగుతుండటంతో, ఆ మేరకు అన్ని పార్టీల నాయకులకు ఆ అవకాశాలు దక్కుతాయి. పార్టీల విస్తరణకు మార్గం సుగమమవుతుంది. ఎన్నికల రాజకీయాల్లో ఓట్లు, సీట్ల లెక్కలే కీలకం. గనక అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రక్రియ పట్ల సానుకూల దృక్పథంతోనే ఉన్నాయి.

అయితే, ఈ సీట్ల పెంపు ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తుంది? నియోజకవర్గాల భౌగోళిక పరిమాణం తగ్గడం వల్ల ప్రజలకు ప్రతినిధులు మరింత చేరువవుతారు. స్థానిక సమస్యలను నేతలు మరింతగా పట్టించుకునే అవకాశముంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తే, లోక్‌సభలో 816 స్థానాల్లో 273 స్థానాలు మహిళలకు కేటాయించబడతాయి. ఇది భారత రాజకీయ వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయిగా మిగిలిపోతుంది.

నియోజకవర్గాల పెంపు ప్రభుత్వంపై పెను ఆర్థిక భారంగా పరిణమించనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేల జీతభత్యాలు, సిబ్బంది ఖర్చులు, పెన్షన్లు వంటి పెరిగే అన్ని వ్యయాలను ప్రజలే పన్నుల ద్వారా భరించాల్సి ఉంటుంది. పరిపాలన నాణ్యత పెరుగుతుందనే హామీ లేకపోగా, ఖర్చులు పెరగడం ప్రజలలో అసంతృప్తికి గురయ్యే ప్రమాదం ఉంది.

ఇక రాజకీయాల్లో, నేతల్లో పదవులపై ఆసక్తి అధికం. ఒకసారి ప్రజాప్రాతినిధ్యంలోకి వచ్చిన నాయకులు పదేపదే అవే స్థానాలకు పోటీ చేయడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో “రెండు టర్మ్ లు మాత్రమే అనే పరిమితి” వంటి సంస్కరణలు అవసరమనే అభిప్రాయం బలపడుతోంది. అదే విధంగా పదవీ విరమణ తర్వాత భారీ పెన్షన్లు పొందే విధానాన్ని కూడా పునస్సమీక్షించాలి. ఈ అంశాలు చట్టసభల్లో చర్చకు రావాల్సినవే అయినప్పటికీ, వాటిని అమలు చేసే బాధ్యత ఉన్నవారే రాజకీయ నాయకులు కావడంతో ఆచరణలోకి రావడం కష్టసాధ్యంగా మారుతోంది.

డిలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళన అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు, జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరిగితే అన్యాయం జరుగుతుందనే భావన వ్యక్తం చేస్తున్నాయి. దీనిని సమతౌల్యం చేయడానికి అన్ని రాష్ట్రాల్లో సమానంగా ప్రస్తుతం ఉన్న సీట్లకు 50 శాతం సీట్లు పెంచే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది కొంతవరకు సమస్యను తగ్గించగలిగినా, పూర్తి పరిష్కారం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల్లో పార్లమెంట్, అసెంబ్లీల స్థానాల సంఖ్య దక్షిణాది కంటే ఎక్కువగానే ఉన్నాయి. అదే నిష్పత్తిలో మళ్ళీ దేశంలో ఉత్తరాది రాష్ట్రాల ఆధిక్యం కొనసాగనున్నది.

సీట్ల పెంపు అవసరమైనే మార్పే అయినప్పటికీ, ప్రజాస్వామ్యంలో నాణ్యమైన మార్పులు రావాలంటే కేవలం స్థానాల సంఖ్య పెరగడం సాధ్యం కాదు. రాజకీయ పార్టీలు, నాయకులకు పారదర్శకత, బాధ్యతాయుత పాలన, ప్రజా సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి అవసరం. మహిళా రిజర్వేషన్ వంటి మార్పులు సమాజంలో మహిళల ప్రాధాన్యాన్ని, ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచగలవు. అయితే అదే సమయంలో ఖర్చుల నియంత్రణ, పదవుల పరిమితి వంటి సంస్కరణలు కూడా సమానంగా అవసరం.
డిలిమిటేషన్ వల్ల రాజకీయ పార్టీలకు అవకాశాలు విస్తరించడం అనివార్యం. కానీ ప్రజలకు నిజమైన లాభం అందాలంటే, ఈ మార్పులు వ్యవస్థలో గుణాత్మక సంస్కరణలతో కలిసివచ్చినప్పుడే సార్థకత. లేదంటే సీట్లు పెరిగినా ప్రజాస్వామ్యం బలపడిందని చెప్పడం కష్టమే.

Latest News

గాలిమోటర్ కాదు ఎర్ర బస్సే!?|ADUGU TRENDS

సుతిమెత్తగా తోలు సీట్లు, సీటుసీటుకు బుల్లి తెరలు, శార్జింగ్ పాయింట్లు, ఉచితంగా వైఫై, కావాలంటే టిపిని, తాగాలంటే చాయ్, పోవాలంటే ఒకటి, రెండుకు టాయిలెట్లు... సల్లగా పయాణం.. ఇంకేం కావాలె శెప్పుండ్రి? అయితే...

సెప్టెంబర్ 09, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి త్రయోదశి ఉదయం 11.45 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ఆశ్లేష పగలు 03.40 వరకు ఉపరి మఖ యోగం శివ రాత్రి 11.15 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం 11.47 వరకు ఉపరి...

రక్షణ వ్యవస్థలే సైబర్ దోపిడీకి ఆయుధాలు!?|EDITORIAL

అసలైన కాపీరైట్ హక్కుదారులు లేదా వారి అధికారిక ప్రతినిధులకే ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసే హక్కు ఉండాలి. అందువల్ల కాపీరైట్ పేరుతో ఎవరైనా వ్యక్తిగతంగా డబ్బులు అడిగితే చెల్లించడం పరిష్కారం కాదు. పోలీసులు, సైబర్...

రూపాయెకే వైద్గ సేవలు!?|ADUGU TRENDS

సంకల్పం ఉండాలె గనీ, యేదైనా సాధించొచ్చు. గట్లనే కొందరు ఉచిత సేవలందిత్తరు. గదానికి సరైన యిలువ ఉండదనుకున్నడో ఏమో గనీ, గీ డాస్కర్ శంకర్ దాస్ రాంచందానీ, ఒక్క రూపాయెకే వైద్గం అందిత్తాండు. గీ...

కొండా కుటుంబానికి కొత్త పరీక్ష!?|EDITORIAL

ఇప్పుడు కొండా కుటుంబం ముందున్న అసలు ప్రశ్న ‘ఎవరి మీద పోరాడాలి?’ అన్నది కాదు.. ‘ఎలా తిరిగి రాజకీయంగా బలపడాలి?’ అనేదే. మౌనం, సమన్వయం, సంస్థాగత పునర్నిర్మాణం ఈ మూడు మార్గాల్లో దేన్ని...

సెప్టెంబర్ 08, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి పగలు 01.49 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.55 వరకు ఉపరి ఆశ్లేష యోగం పరిఘ రాత్రి 01.59 వరకు ఉపరి శివ కరణం తైతుల పగలు 01.49 వరకు ఉపరి గరజి రాహుకాలం...

సెప్టెంబర్ 07, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి సాయంత్రం 04.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం పునర్వసు సాయంత్రం 06.23 వరకు ఉపరి పుష్యమి యోగం వ్యతీపాత ఉదయం 07.46 వరకు ఉపరి వరీయాన్ కరణం బాలవ సాయంత్రం 04.03 వరకు ఉపరి కౌలవ రాహుకాలం...

బర్త్ డే టు బర్తరఫ్!|KONDA FAMILY|CONGRESS|

తారుమారైన కొండా సు‘రేఖ’! 17 రోజుల్లోనే తలకిందులు? ‘చే’జేతులా...చెడిన రాజకీయం ఆగస్టు 19 నుంచి సెప్టెంబరం 3 వరకు మరి తర్వాత వారి దారెటు? కోరి కోరి పదవికి ఎసరు తెచ్చుకోవడమంటే ఇదే! అదీ లండన్ లో ఉన్న...

గుప్త సామ్రాజ్యం – ప్రారంభం మరియు అభివృద్ధి (క్రీ.శ.275-550)|ADUGU DIGITAL MEDIA|HISTORY|COMPITITIVE EXAMS|SPECIAL

గుప్తుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు తెలుసుకోవడానికి సాహిత్యం, శాసనాలు మరియు నాణాలు ఉపయోగపడుతున్నాయి. గుప్త సామ్రాజ్యంలోని తొలి రాజులు *మహారాజ* అనే బిరుదును తీసుకోవడం వల్ల వీరు సామంతులుగా పాలించారని తెలుస్తుంది. కొంతమంది...

డాక్టర్ నెట్ ఇండియా-వైద్గం ఫ్రీ!?|ADUGU TRENDS

ఏదన్నా రోగమొత్తే అయిపాయె, ఆగమాగమైతం. యాడికిపోవాల్నో తెల్వదు. ఎంత కర్సైతదో తెల్వదు. ఇగ గిదే సందని, పైసలు గుంజుడు, పానం తీసుడు గా ప్రైవేట్ దవాఖాన్లల్ల పనైపాయె. పానం పోతదో, నిలుత్తదో కనీ,...

అధ్యాపకా! అభివందనం!!|EDITORIAL

నాణ్యమైన విద్య, సమర్థవంతమైన ఉపాధ్యాయ శిక్షణ, పరిశోధనకు ప్రోత్సాహం, పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించడమే రాధాకృష్ణన్‌కు నిజమైన నివాళి. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 06 నుండి సెప్టెంబర్ 12 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త ఆలోచనలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ప్రారంభించిన పనులను మధ్యలో వదిలిపెట్టకుండా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో మీ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News