Friday, September 4, 2026
26.2 C
Hyderabad

అధిష్ఠానం నిర్ణయంపై చిన్నారెడ్డి సంచలనం|CHINNA REDDY|CONGRESS

ఒక్క పోటుతో కూల్చేశారు..
పదవులపై నాకు సోకు లేదు

తనకు పదవులపై ఎలాంటి ఆసక్తి, వ్యామోహం లేదని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయంగా ఈ స్థాయికి వచ్చానని, అయితే ఒక్క పోటుతో తనను పదవి నుంచి తొలగించారని తెలంగాణ ప్లానింగ్‌ కమిషన్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ జి. చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను పదవీ నుండి తొలగించిన తరువాత మాట్లాడుతూ, ఇందిరాగాంధీ కాంగ్రెస్‌ పార్టీని ప్రారంభించినప్పటి నుంచి తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నానని తెలిపారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేశానని, పదవులు ఉన్నా లేకున్నా తన గౌరవం తనకు ఉంటుందని అన్నారు.

ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌గా తనకు ఇచ్చిన నియామక ఉత్తర్వుల్లో కూడా టిల్‌ ఫర్థర్‌ ఆర్డర్‌ అని పేర్కొన్నారని చిన్నారెడ్డి గుర్తుచేశారు. అయినప్పటికీ ఇప్పుడు తనను పదవి నుంచి తొలగించారని తెలిపారు. పదవి కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసే ప్రయత్నం తాను ఎప్పుడూ చేయలేదని స్పష్టం చేశారు. తన రాజకీయ విలువలు, గౌరవమే తనకు ముఖ్యమని పేర్కొన్నారు.

ఇదే సమయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డితో తనకు ఎదురైన అనుభవాలను కూడా చిన్నారెడ్డి ప్రస్తావించారు. తన మనుషులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్తే “మెడ పట్టి బయటకు దొబ్బుతా” అని మేఘారెడ్డి అన్నారని ఆరోపించారు. అయినప్పటికీ తాను అన్నింటినీ భరిస్తూ వచ్చానని తెలిపారు. పదవులు వస్తుంటాయి.. పోతుంటాయని, కానీ ఇన్నేళ్లుగా సంపాదించుకున్న గౌరవం, పార్టీతో తన అనుబంధమే తనకు ముఖ్యమని చిన్నారెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Latest News

తలుసుకుంటే కాందేంది? నదే శుభ్రమైంది!?|ADUGU TRENDS

గీ డిగ్రీలు సదివే పిల్లలు ఏం ఆలోశిస్తరు? ఆటా, పాటా, అల్లరి, సదువు, కెరీర్ గివే కదా? కనీ గీ పిల్లగాడు గివేవీ ఆలోసించలే.. తమ ఊరి పక్కనుండే పోతున్న నది గురించి...

కొండా కుటుంబం దారెటు!?|EDITORIAL

అనూహ్యం కాకపోయినా, అనివార్యంగా జరిగిపోయింది. పరిణామాల ఫలితాలేమైనా, కొండంత ఆశయం, తన కూతురు, తమ భవిష్యత్తు కోసం కొంత పట్టువిడుపు ప్రదర్శించి ఉంటే, కొండా సురేఖ మంత్రి పదవి నిలిచేదేమో! అయినా కొండా...

సెప్టెంబర్ 04, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం శ్రీ కృష్ణాష్టమి తిధి అష్టమి రాత్రి 11.20 వరకు ఉపరి నవమి నక్షత్రం రోహిణీ రాత్రి 11.20 వరకు ఉపరి మృగశిర యోగం హర్షణ సాయంత్రం 05.00 వరకు ఉపరి వజ్ర కరణం బాలవ పగలు 12.30 వరకు ఉపరి...

నా బర్తరఫ్‌ చెల్లదు|KONDA SUREKHA|SENSATIONAL COMMENTS

ఈరోజు నాకు జరిగింది.. రేపు మీకూ జరుగుతుంది ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడండి రేవంత్‌ సర్కార్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు....

BREAKING: కొండా సురేఖపై వేటు..చిన్నారెడ్డి ఔట్

సీఎం రేవంత్‌ నిర్ణయం! తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు అధికారిక నోట్‌ వెల్లడించింది. ఈ మేరకు...

కొండా సురేఖకు కేఏ పాల్ ఆహ్వానం..|KONDA SUREKHA|KA PAUL

కాంగ్రెస్‌ను వీడి ప్రజాశాంతి పార్టీలోకి రండి మంత్రి కొండా సురేఖకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బహిరంగ ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సురేఖ పార్టీ...

రాజీనామా చేయాల్సిందే.. లేదంటే బర్తరఫ్‌!|KONDA SUREKHA|RESIGN|BURTRAF

కొండా సురేఖకు అధిష్ఠానం అల్టిమేటం.. ఇంటి వద్ద నిర్మానుష్యం పార్టీ లైన్‌ దాటని అనుచరులు  తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌...

ఉద్వాసనమే!|KONDA SUREKHA|CM|REVANTH REDDY|DELHI

సురేఖను పట్టించుకోని అధిష్ఠానం ముక్తసరిగా మూడు ముక్కల్లో ఖర్గేతో మచ్చట అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ కార్యాలయంలోనే రోజంతా పడిగాపులు నిరాశతో వెనుతిరిగిన మంత్రి కొండా సురేఖ ఖర్గే, కేసీలతో రేవంత్ రెడ్డి వేర్వేరుగా భేటీలు సురేఖ వ్యవహారాన్ని...

గీ కర్ణాటక ట్రాఫిక్ కట్టాలకు గింత కథ ఉందా!?|ADUGU TRENDS

ట్రాఫిక్ కట్టాలు లేందెక్కడ? కిరాణా దుకాన్ల, రేషన్ షాపుల్ల, బ్యాంకుల్ల, బస్సుల్ల, రోడ్ల మీద, శివరాకరికి సులభ్ కాంప్లెక్సుల్ల కూడా రద్దేనాయె!? కానీ, గీ కర్ణాటకల రద్దీకి కర్ణునికి ఏదో లింకుందట సూద్దాం...

ఉగ్రమూలాలపై పాక్ కు భారత్ మరో హెచ్చరిక!?|EDITORIAL

పాకిస్తాన్ నిజంగా శాంతి కోరుకుంటే మాటలకంటే చర్యలు ముఖ్యం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకునే చర్యలు పారదర్శకంగా, నిరంతరంగా ఉండాలి. ఉగ్రవాదాన్ని ఒకప్పుడు వ్యూహాత్మక సాధనంగా చూసిన విధానాలకు స్వస్తి చెప్పి, పొరుగుదేశాలతో విశ్వాసాన్ని...

సెప్టెంబర్ 03, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి షష్ఠి రాత్రి 01.39 వరకు ఉపరి సప్తమి నక్షత్రం కృత్తిక రాత్రి 12.50 వరకు ఉపరి రోహిణి యోగం వ్యాఘాత రాత్రి 07.56 వరకు ఉపరి హర్షణ కరణం భద్ర పగలు 02.43 వరకు ఉపరి బవ రాహుకాలం...

హైకమాండ్‌ ముందు కొండా సురేఖ బాంబ్‌..|KONDA SUREKHA|CONGRESS

రేవంత్‌పై చర్యలకు డిమాండ్‌..|CM|REVANTH REDDY ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలంటూ డిమాండ్‌ రాష్ట్రంలో రాజగోపాల్‌రెడ్డి వార్నింగ్‌!|KOMATIREDDY RAJAGOPAL REDDY|WARNING ఢిల్లీలోని ఇందిరా భవన్‌ వేదికగా తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. పార్టీ అంతర్గత విభేదాలు,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News