Tuesday, September 8, 2026
32.2 C
Hyderabad

ప్రజా చైతన్యం, భాగస్వామ్యంతోనే.. ప్రగతిపథంలో చైనా|ESSAY

‘పనిచేయి, సంపాదించు, అనుభవించు’ అనే సూత్రాన్నే పాటిస్తుంటారు. ఎవరి పని వారిదే, ఎవరి జీవితం, ఎవరి సౌఖ్యం వారిదే. ప్రజలందరికీ చేతినిండా పని ఉంటుంది. ప్రభుత్వం తమకేదో చేస్తుందని ప్రజలెవరూ ఎదురు చూడరు. ఉచిత పథకాలేవీ ఉండవు. విద్య, వైద్యం, నీటి సరఫరా వంటివేవీ కూడా ఉచితం కాదు. మతం, దేవుళ్లు, గుళ్లు, గోపురాలు, విగ్రహాలు లేవు. ప్రజలంతా ఒకే భాష, ఒకే జాతి సూత్రాన్ని అనుసరిస్తుంటారు. ప్రజలు స్వేచ్ఛా ప్రియులు. వాళ్ళకి రాజకీయాలతో సంబంధమే ఉండదు. బయట ప్రచారంమే తప్ప ఎక్కడా నిరంకుశత్వం కనిపించదు. భూములు, ఆస్తులన్నీ ప్రభుత్వానివే. కూడబెట్టి, దాచుకునే అవకాశమే లేదు. సువిశాలమైన భూభాగం, అపారమైన ఖనిజ సంపద, కష్టించి పనిచేసే ప్రజానీకం, అంతులేని దేశభక్తి, సుస్థిర ప్రభుత్వం ఉంటే, అనతికాలంలోనే అనూహ్యమైన అభివృద్ధి సాధించి, ప్రపంచంలో అగ్రపథానికి దూసుకుపోవచ్చనడానికి చైనాయే నిదర్శనం.
చైనా స్టడీ టూర్, స్టడీపై ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవిందర్ రావు ప్రత్యేక వ్యాసం 

స్టడీ టూర్ స్టడీ

ప్రజా చైతన్యం, భాగస్వామ్యంతోనే.. ప్రగతిపథంలో చైనా

(మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, సీనియర్ సంపాదకులు టంకశాల అశోక్, ప్రపంచ పర్యావరణ శాస్త్రవేత్త బిక్షం, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావులు స్టడీ టూర్ లో భాగంగా ఇటీవలే చైనాలో 13 రోజులు పర్యటించారు. చైనాలోని బీజింగ్, షియాంగ్, షాంగై నగరాల్లో పర్యటించి, పరిశీలించిన అంశాల సంక్షిప్త సమాచారమే ఈ వ్యాసం)

సుభూభాగం, అపారమైన ఖనిజ సంపద, కష్టించి పనిచేసే ప్రజానీకం, అంతులేని దేశభక్తి, సుస్థిర ప్రభుత్వం ఉంటే, అనతికాలంలోనే అనూహ్యమైన అభివృద్ధి సాధించి, ప్రపంచంలో అగ్రపథానికి ఎదగవచ్చు అనడానికి చైనాయే నిదర్శనం. చైనా ప్రజలు స్వేచ్ఛా ప్రియులు. వాళ్ళకి రాజకీయాలతో సంబంధమే ఉండదు. బయట ప్రచారంమే తప్ప చైనాలో ఎక్కడా నిరంకుశత్వం కనిపించలేదు. భూములు, ఆస్తులన్నీ ప్రభుత్వానివే. కూడబెట్టి, దాచుకునే అవకాశమే లేదు. గ్రామాలు, పట్టణ వాతావరణంతో కలగలిసి సెమీ అర్బనైజ్డ్ గా ఉంటాయి. అంతటా విశాలమైన రోడ్లు, రైళ్లు, ఇతర రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఒక్కో మనిషికి 10 గుంటల చొప్పున భూమి ఇస్తారు. తమ భూమిని చాలామంది కంపెనీలకు లీజుకిస్తారు. ఆ కంపెనీలు ఈ భూముల్లో పండ్లు, కూరగాయలు, ఇతరత్రా పండిస్తుంటాయి. పంటలు పాడైపోకుండా, ప్రతిచోటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. దాదాపు అన్ని గ్రామాల్లో పరిశ్రమలు నెలకొల్పారు. ప్రధానంగా పారిశ్రామికీకరణకు పెద్ద పీట వేశారు. పరిశ్రమల్లో మానవ వనరులు సరిపోక, రోబోలు కూడా పనిచేస్తుంటే మాకందరికీ ఆశ్చర్యమేసింది. ప్రభుత్వానికి రాబడి ఎక్కువ. దీంతో ప్రభుత్వమే పెద్ద ఎత్తున 50 ఏళ్లకు సరిపడా మౌలిక వసతులను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయగలిగింది. చైనాలో ఎక్కడ చూసినా మాకు అందమైన గ్రామాలు, రోడ్లు, డ్రైనేజీలు, పచ్చదనం, పరిశుభ్రతతో ఆహ్లాదకరంగా కనిపించాయి.

ప్రజలు తమ సంపాదనంతా ఖర్చు పెడుతుంటారు. బ్లాక్ మనీకి ఆస్కారం లేదు. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి కనిపించలేదు. ‘పనిచేయి, సంపాదించు, అనుభవించు’ అనే సూత్రాన్నే పాటిస్తుంటారు. ఎవరి పని వారిదే, ఎవరి జీవితం, ఎవరి సౌఖ్యం వారిదే. ప్రజలందరికీ చేతినిండా పని ఉంటుంది. ప్రభుత్వం తమకేదో చేస్తుందని ప్రజలెవరూ ఎదురు చూడరు. ఉచిత పథకాలేవీ ఉండవు. విద్య, వైద్యం, నీటి సరఫరా వంటివేవీ కూడా ఉచితం కాదు. మతం, దేవుళ్లు, గుళ్లు, గోపురాలు, విగ్రహాలు లేవు. ప్రజలంతా ఒకే భాష, ఒకే జాతి సూత్రాన్ని అనుసరిస్తుంటారు.

తియాన్మెన్ స్క్వేర్ లో రోజుకు రెండుసార్లు ఆ దేశ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తుంటారు. అక్కడ ప్రెస్, మీడియా ఉండదు. ప్రభుత్వమే సమాచారం కోసం వార్తలను, ఫొటోలను విడుదల చేస్తుంటుంది. చైనాలో ప్రభుత్వ అధికార కార్యక్రమాలే వార్తలు. మరే వార్తలూ ఉండవు. రాజకీయాలు చూడొద్దు, వినొద్దు, మాట్లాడొద్దు అనే రీతిలో ప్రజలు ఉన్నారు. అన్ని పరిపాలనా విభాగాల్లో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రాతినిథ్యం ఉంటుంది. పార్టీ నుంచి ఎన్నికైన ప్రతినిధులే ఫుల్ టైమ్ వర్కర్లుగా పాలనా విభాగాల్లో సభ్యులుగా ఉంటారు. అవినీతి, అక్రమాలకు తావుండదు. పోలీసులు ఎక్కడా కనిపించరు. కానీ, కార్లు, టాక్సీలు, బస్సులు, రైల్వేల్లో మొత్తం సీసీ కెమెరాలతో మానిటరింగ్ వ్యవస్థ ఉంటుంది. అక్కడ నేరాలు చాలా తక్కువనే చెప్పాలి.

చైనాలో మాతృస్వామ్య వ్యవస్థ ఉంది. కుటుంబంలో అందరూ పనిచేస్తేనే గడుస్తుందని భావిస్తుంటారు. మహిళలెవరూ పనిచేయకుండా ఇంట్లో విశ్రాంతిగా ఉండరు. మహిళలే కుటుంబాలను నడుపుతుంటారు. ప్రజలకు సరిపోను సంపాదన ఉంది. ఒక్కో కుటుంబానికి నెలకు సగటున రూ.50 వేల ఆదాయం వస్తుంది. దీంతో వారి జీవితం సాఫీగా సాగుతుంది. ప్రజలు పాషనేట్ గా అందమైన జీవితాన్ని గడుపుతారు.
చైనా మహిళలు అలంకార ప్రియులు. ఆడపిల్లలను కన్న కుటుంబాలకు అమితమైన గౌరవం ఇస్తుంటారు. ఆశ్చర్యకరమేమిటంటే చైనాలో కన్యాశుల్కం కూడా అమల్లో ఉంది. నగరాల్లో పబ్ కల్చర్ ఉన్నప్పటికీ ఎక్కడా అశ్లీలత కనిపించదు. స్టాండర్డైజ్ హాస్పిటల్ ట్రీట్ మెంట్. ఇక్కడిలాగా భయంకరమైన ఫీజులుండవు. ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి. ఒకే దేశం చైనా, ఒకే భాష అనే చైనీస్ సూత్రాన్ని ప్రజలంతా ఆచరిస్తున్నారు.

ఇతర దేశాల్లో పర్యటించే చైనీయులు వ్యాపార పనుల్లోనే వెళ్తారు. టూరిజం ప్యాకేజీలతో రావడం అరుదు. ఇతర దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లిన చైనీయులకు కూడా అమితమైన దేశభక్తి ఉంటుంది. చైనాకు వచ్చే పర్యాటకులపై కూడా నిరంతరం ప్రభుత్వ నిఘా ఉంటుంది.

చైనా ప్రజలంతా కఠినమై క్రమశిక్షణతో చైతన్యవంతంగా ఉంటారు. మా 13 రోజుల పర్యటనలో వేలాది మందిని కలిశాం. ఎందరితోనో మాట్లాడాం, కానీ, ఒక్క క్రమశిక్షణా రాహిత్య సంఘటనను మేం చూడలేదు. ఎవరిలోనూ ఆవేశం, అసహనం, ఆగ్రహం కనిపించలేదు. చైనాలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ జీరో క్రైమ్ రేట్ నమోదవుతున్నది. ప్రభుత్వ విద్యా సంస్థలు, యూనివర్సిటీలు సకల, సౌకర్యాలతో, అద్భుతంగా తీర్చిదిద్దబడి ఉంటాయి. నిరంతరం అప్ డేటెడ్ తాజా సమాచారంతో, వినూత్న ఆవిష్కరణలతో అవి విద్యనందిస్తుంటాయి.

చైనాలో వ్యవసాయ సుక్షేత్రాలు ఎక్కువ. రిచ్ టవర్స్, రిచ్ పీపుల్ కనిపిస్తారు. ఇక్కడ 1990లో మొదలైన అభివృద్ధి 2000 లనాటికే వేగం పుంజుకుంది. 2025 నాటికి అనూహ్యమైన ప్రగతిని సాధించింది. షాంగై నగరంలో వెయ్యి కిలో మీటర్ల మెట్రోను, 500 మెట్రో స్టేషన్లతో నెలకొల్పారు. ప్రజలంతా మెట్రోలోనే ప్రయాణిస్తారు. ప్రభుత్వమే 51శాతం వాటాతో ప్రజలతో కలిసి వ్యాపారం నిర్వహిస్తుండటం మరో విశేషం. కంపెనీలు వ్యవసాయం సహా అన్ని వ్యాపారాలు నిర్వహిస్తాయి. యావత్ దేశం మీద భయంకరమైన నిఘా కనిపించకుండానే ఉంటుంది. తియాన్మెన్ స్వ్కేర్ సంఘటనను చైనా ప్రజలు ఒక పీడకలగా అభివర్ణిస్తుంటారు.

చైనాలోని షియాంగ్ నగరం 11వ శతాబ్దానికి చెందిన ప్రాచీన నగరమైతే, అభివృద్ధి చెందిన నగరం బీజింగ్. అనూహ్యంగా అభివృద్ధి చెందుతున్న షాంగై నగరాన్ని ఫ్యూచర్ సిటీగా అభివర్ణిస్తుంటారు. భౌగోళికంగా త్రిభుజాకార దిక్కుల్లో ఉండే ఈ మూడు నగరాలూ మానవ నిర్మిత అద్భుతాలు. భూగర్భ రైలు మార్గం ఉంది. దానిపైన రోడ్లు ఉన్నాయి, ఆపైన ఎటు చూసినా ఫ్లై ఓవర్లు. దీంతో ట్రాఫిక్ జామ్ అనేది ఉండదు. ఇక్కడ మేం గంటకు 350 కి. మీ. వేగంతో 1200 కి.మీ. ప్రయాణించాం. చైనా వాల్, టెర్రాకోట్ మ్యూజియం, లైవ్ షోస్, షియాంగ్ సిటీలో 14 కి. మీ. గోడ, ఇండస్ట్రీస్, ఫీల్డ్స్, బీజింగ్ ఫారెస్ట్, తియాన్ మెన్ స్వ్కేర్, యూనివర్సిటీలు, స్కూల్స్ ఇలా ఎన్నెన్నో చూశాం. ప్రజలంతా చైనా భాషలోనే మాట్లాడారు. ఒక్కరూ ఇంగ్లీష్ పదాన్ని కూడా ఉచ్ఛరించకపోవడం మాకే ఆశ్చర్యమేసింది.

చైనాలో విద్యావ్యవస్థను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. పాఠశాలలన్నీ సకల సౌకర్యాలతో ఉంటాయి. ప్రజలు, ప్రభుత్వం మార్షల్ ఆర్ట్స్ కు ప్రాధాన్యతనిస్తారు. పబ్లిక్ ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలు కూడా చాలా చోట్ల జరుగుతుంటాయి.

అత్యధిక పోషక విలువలున్న ఆరోగ్యకరమైన తిండి ఇక్కడి ప్రజల ప్రత్యేకత. చైనా పర్యటనలో మేం మూడు పూటలా 15 వంటకాలు తిన్నా మాకు ఏనాడూ కడుపు నిండినట్లుగా అనిపించలేదు. ఆకలీ కాలేదు. రకరకాల రుచులతో వండే సీ ఫుడ్స్ నోరూరిస్తాయి. స్ట్రీట్ ఫుడ్స్ కు ఆదరణ ఎక్కువ. ప్రజలు ఎక్కువగా వేడి నీళ్లు, ఆకులు, ఔషధ మొక్కల వేర్లు, నిమ్మకాయ ముక్కలు వేసుకొని మంచినీరు తాగుతారు. చైనాలో ప్రభుత్వం ఏనాడూ ఓట్ల కోసం పనిచేసేది ఉండదు, ఉచిత పథకాలు ఉండవు కాబట్టి, ఆర్థిక భారం ఉండదు. చైనా ప్రజలకు సంప్రదాయ పద్ధతులే తప్ప, భక్తి, పూజలు, పునస్కారాలు ఉండవు. ప్రతి వ్యక్తీ ఉత్పాదక రంగంలోనే పనిచేస్తారు. చైనాలో మేం చూసిన పర్యాటకుల్లో 99శాతం మంది చైనీయులే కావడం మరో విశేషం. ప్రభుత్వ విధానాలు, ప్రజల జీవనశైలికి, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించకుండానే ఉంటాయి. ప్రస్తుతం చైనా దేశ ప్రజలంతా కొత్త సంస్కరణలను ఆహ్వానించే ఆలోచనలో ఉన్నారు. 2040 నాటికి అమెరికా డాలర్ ద్రవ్య విలువను అధిగమించే లక్ష్యంతో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నది. కచ్చితంగా ఆ లక్ష్యాన్ని చైనా చేరుకుంటుంది.

వ్యాసకర్త :

–తక్కెళ్లపల్లి రవీందర్ రావు
శాసనమండలి సభ్యులు
ఫోన్: 950 580 6666

Latest News

రూపాయెకే వైద్గ సేవలు!?|ADUGU TRENDS

సంకల్పం ఉండాలె గనీ, యేదైనా సాధించొచ్చు. గట్లనే కొందరు ఉచిత సేవలందిత్తరు. గదానికి సరైన యిలువ ఉండదనుకున్నడో ఏమో గనీ, గీ డాస్కర్ శంకర్ దాస్ రాంచందానీ, ఒక్క రూపాయెకే వైద్గం అందిత్తాండు. గీ...

కొండా కుటుంబానికి కొత్త పరీక్ష!?|EDITORIAL

ఇప్పుడు కొండా కుటుంబం ముందున్న అసలు ప్రశ్న ‘ఎవరి మీద పోరాడాలి?’ అన్నది కాదు.. ‘ఎలా తిరిగి రాజకీయంగా బలపడాలి?’ అనేదే. మౌనం, సమన్వయం, సంస్థాగత పునర్నిర్మాణం ఈ మూడు మార్గాల్లో దేన్ని...

సెప్టెంబర్ 08, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి పగలు 01.49 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.55 వరకు ఉపరి ఆశ్లేష యోగం పరిఘ రాత్రి 01.59 వరకు ఉపరి శివ కరణం తైతుల పగలు 01.49 వరకు ఉపరి గరజి రాహుకాలం...

సెప్టెంబర్ 07, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి సాయంత్రం 04.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం పునర్వసు సాయంత్రం 06.23 వరకు ఉపరి పుష్యమి యోగం వ్యతీపాత ఉదయం 07.46 వరకు ఉపరి వరీయాన్ కరణం బాలవ సాయంత్రం 04.03 వరకు ఉపరి కౌలవ రాహుకాలం...

బర్త్ డే టు బర్తరఫ్!|KONDA FAMILY|CONGRESS|

తారుమారైన కొండా సు‘రేఖ’! 17 రోజుల్లోనే తలకిందులు? ‘చే’జేతులా...చెడిన రాజకీయం ఆగస్టు 19 నుంచి సెప్టెంబరం 3 వరకు మరి తర్వాత వారి దారెటు? కోరి కోరి పదవికి ఎసరు తెచ్చుకోవడమంటే ఇదే! అదీ లండన్ లో ఉన్న...

గుప్త సామ్రాజ్యం – ప్రారంభం మరియు అభివృద్ధి (క్రీ.శ.275-550)|ADUGU DIGITAL MEDIA|HISTORY|COMPITITIVE EXAMS|SPECIAL

గుప్తుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు తెలుసుకోవడానికి సాహిత్యం, శాసనాలు మరియు నాణాలు ఉపయోగపడుతున్నాయి. గుప్త సామ్రాజ్యంలోని తొలి రాజులు *మహారాజ* అనే బిరుదును తీసుకోవడం వల్ల వీరు సామంతులుగా పాలించారని తెలుస్తుంది. కొంతమంది...

డాక్టర్ నెట్ ఇండియా-వైద్గం ఫ్రీ!?|ADUGU TRENDS

ఏదన్నా రోగమొత్తే అయిపాయె, ఆగమాగమైతం. యాడికిపోవాల్నో తెల్వదు. ఎంత కర్సైతదో తెల్వదు. ఇగ గిదే సందని, పైసలు గుంజుడు, పానం తీసుడు గా ప్రైవేట్ దవాఖాన్లల్ల పనైపాయె. పానం పోతదో, నిలుత్తదో కనీ,...

అధ్యాపకా! అభివందనం!!|EDITORIAL

నాణ్యమైన విద్య, సమర్థవంతమైన ఉపాధ్యాయ శిక్షణ, పరిశోధనకు ప్రోత్సాహం, పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించడమే రాధాకృష్ణన్‌కు నిజమైన నివాళి. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 06 నుండి సెప్టెంబర్ 12 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త ఆలోచనలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ప్రారంభించిన పనులను మధ్యలో వదిలిపెట్టకుండా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో మీ...

అమ్మంటే గామే!?|ADUGU TRENDS

మహారాష్ట్రల బీడ్ అంబాజోగాయిల అమ్రుత్ మహోత్సవ్ వేడుకలు జర్గుతానయి. అమ్రుత్ దౌడ్ మొదలైతాంది. గండ్లకు హఠాత్తుగా ఓ 47 ఏండ్ల రమాబాయి రణవీర్ దూసుకొచ్చింది. గా మారథాన్ పరుగు పందెంల ఉరుకుడు మొదలు...

ఏఐ యుగంలో గెలిచేది మానవ నైపుణ్యమే!?|EDITORIAL

ఉద్యోగార్థులకు ఏఐ గణాంకాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. డిగ్రీ లేదా అనుభవం ఒక్కటే భవిష్యత్తుకు భద్రత ఇవ్వవు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం...

సెప్టెంబర్ 05, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి నవమి రాత్రి 08.54 వరకు ఉపరి దశమి నక్షత్రం మృగశిర రాత్రి 09.39 వరకు ఉపరి ఆరుద్ర యోగం వజ్ర పగలు 01.57 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 10.08 వరకు ఉపరి గరజి రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News