దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీలలో ఒకరిగా పేరుపొందిన తేజస్వి సూర్య వివాహానికి ముహూర్తం ఖరారైంది. బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన ఈ యువ ఎంపీ, చెన్నైకు చెందిన శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి శివశ్రీ స్కంద ప్రసాద్‌ను వివాహం చేసుకోనున్నారు. ఈ విషయాన్ని తేజస్వి స్వయంగా మంగళవారం బెంగళూరులో ప్రకటించారు. మార్చి 24న ఈ వివాహం జరగనున్నట్లు తెలిపారు.
శివశ్రీ స్కంద ప్రసాద్ ఒక ప్రముఖ గాయని మాత్రమే కాకుండా భరతనాట్యంలోనూ నిపుణురాలు. ఆమె మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో ఎంఏ పూర్తి చేయగా, మద్రాస్ సంస్కృత కళాశాలలో సంస్కృతంలో ఎంఏ డిగ్రీ పొందారు.

