వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన మహా శివరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని రావాల్సిందిగా ఆహ్వానించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పాటు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు, అధికారులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.
ఈ సందర్భంగా వేములవాడ ఆలయ అభివృద్ధి పనుల గురించి ముఖ్యమంత్రి ఆ ప్రతినిధి బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ, అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

