Thursday, September 24, 2026
22.2 C
Hyderabad

‘మహి’లో సమున్నత ‘మహి’ళ!|EDITORIAL

అరుంధతి, సతీ అనసూయ, సీత, సావిత్రి, ద్రౌపది వంటి మహనీయ మహిళలు ధైర్యం, ధర్మం, సహనం, త్యాగం వంటి విలువలకు ప్రతీకలుగా నిలిచారు. అలాగే కాళీ, లక్ష్మీ, సరస్వతి, దుర్గాదేవి, పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, గంగమ్మ వంటి పేర్లతో అమ్మవారిని ఆరాధించడం ద్వారా మహిళను దైవత్వ స్థాయికి తీసుకెళ్లిన సంస్కృతి మనదే. భూమిని భూతల్లి, ధరిత్రి, ధరణి, భూదేవి, అవని, అనీ.. నదులను గంగా, యమున, సరస్వతి, గోదావరిలుగా, స్త్రీరూపంగా భావించి గౌరవించడం మన సంప్రదాయం.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

భారతీయ సంస్కృతిలో మహిళ స్థానం అత్యున్నతం. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” అంటే ‘‘ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, పూజింపబడతారో, అక్కడ దేవతలు కొలువుంటారు’’. అనాదిగా భారతీయ సమాజం మహిళను తల్లి రూపంలో, శక్తి స్వరూపిణిగా, కుటుంబానికి మూలస్తంభంగా భావించింది. మన ఇతిహాసాలు, పురాణాలు కూడా మహిళల గౌరవాన్ని ప్రతిబింబించే అనేక ఉదాహరణలతో నిండి ఉన్నాయి. అరుంధతి, సతీ అనసూయ, సీత, సావిత్రి, ద్రౌపది వంటి మహనీయ మహిళలు ధైర్యం, ధర్మం, సహనం, త్యాగం వంటి విలువలకు ప్రతీకలుగా నిలిచారు. అలాగే కాళీ, లక్ష్మీ, సరస్వతి, దుర్గాదేవి, పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, గంగమ్మ వంటి పేర్లతో అమ్మవారిని ఆరాధించడం ద్వారా మహిళను దైవత్వ స్థాయికి తీసుకెళ్లిన సంస్కృతి మనదే. భూమిని భూతల్లి, ధరిత్రి, ధరణి, భూదేవి, అవని, అనీ.. నదులను గంగా, యమున, సరస్వతి, గోదావరిలుగా, స్త్రీరూపంగా భావించి గౌరవించడం మన సంప్రదాయం.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం చరిత్ర కూడా మహిళల హక్కుల కోసం జరిగిన పోరాటాల నుంచే ప్రారంభమైంది. 1909 ఫిబ్రవరి 28న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అమెరికన్ సోషలిస్ట్ పార్టీ మొదటిసారిగా జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. గార్మెంట్ కార్మికులపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా కార్మిక నాయకురాలు థెరిసా మల్కెయిల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తరువాత 1910లో కోపెన్‌హేగన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా సమావేశంలో మహిళా హక్కుల కోసం ఒక ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. చివరికి 1975లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా సంవత్సరాన్ని ప్రకటించి, 1977లో మార్చి 8ను అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తించింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు మహిళల హక్కులు, సమానత్వం, సాధనలను గుర్తించే రోజుగా జరుపుకుంటున్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని ప్రత్యేక రంగులు కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఊదా, ఆకుపచ్చ, తెలుపు రంగులు ఈ దినోత్సవానికి ప్రతీకలుగా భావిస్తారు. పర్పుల్ న్యాయం, గౌరవాన్ని సూచిస్తే, ఆకుపచ్చ ఆశను సూచిస్తుంది. తెలుపు స్వచ్ఛతకు ప్రతీకగా భావిస్తారు. ఈ రంగులు మహిళల సాధికారతను, సమానత్వాన్ని ప్రతిబింబిస్తాయి.

అయితే, ఇంతటి గొప్ప సంస్కృతి కలిగిన సమాజంలోనే నేడు మహిళలపై జరుగుతున్న రకరకాల దాడులు, అన్యాయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మహిళను ఆటవస్తువుగా, భోగవస్తువుగా చూడడం బాధాకరం. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పటికీ, మహిళలపై హింస, వివక్ష పూర్తిగా తగ్గలేదనేది వాస్తవం. చట్టాలు ఉన్నప్పటికీ అవి కఠినంగా అమలుకాకపోవడం, సమాజంలో ఉన్న పాతపద్ధతుల ఆలోచనలు ఇంకా మారకపోవడం కూడా దీనికి కారణాలు.

మహిళలు సమాజంలో అనేక పాత్రలు పోషిస్తున్నారు. మొదట తల్లి రూపంలో, తరువాత అక్కగా, చెల్లిగా, భార్యగా, గురువుగా మహిళ ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తుంది. కుటుంబాన్ని సమర్థంగా నిర్వహించడమే కాకుండా సమాజంలో కూడా మహిళ తన ప్రతిభను నిరూపిస్తోంది. నేడు మహిళలు విద్య, విజ్ఞానం, వైద్యం, రాజకీయాలు, పరిపాలన, వ్యాపారం సహా అంతరిక్షం దాకా అనేక రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారు. టీచర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, పైలట్లు, సైనికులు వంటి అనేక బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. యుద్ధరంగంలో కూడా మహిళలు తమ ధైర్యం, సామర్థ్యాన్ని నిరూపిస్తున్నారు.

అభివృద్ధిలో కూడా మహిళల పాత్ర కీలకంగా మారుతోంది. ఆర్థికాభివృద్ధి, సామాజిక పురోగతిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తే వారు ఏ రంగంలోనైనా అద్భుత విజయాలు సాధించగలరని రుజువవుతూనే ఉంది. గతంతో పోలిస్తే విద్యావకాశాలు పెరగడం, ఉద్యోగాల్లో మహిళల సంఖ్య పెరగడం వంటి మార్పులు ఆశాజనకంగా ఉన్నాయి. అయినప్పటికీ పూర్తి స్థాయి లింగ సమానత్వం సాధించడానికి ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది.

అయితే మహిళల గౌరవం ఒక్కరోజు జరుపుకునే ఉత్సవంతో మాత్రమే పరిమితం కావద్దు. ప్రతిరోజూ, ప్రతిచోటా మహిళలను గౌరవించే సంస్కృతి మన సమాజంలో ఏర్పడాలి. కుటుంబం నుంచే ఈ మార్పు ప్రారంభం కావాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే లింగ సమానత్వం గురించి అవగాహన కల్పించాలి. మహిళలపై జరిగే అన్యాయాలపై సమాజం కఠినంగా స్పందించాలి. చట్టాల అమలు మరింత బలంగా ఉండాలి.

అమ్మ, గురువు, అక్క, చెల్లి, భార్య వంటి అనేక పాత్రలు పోషిస్తున్న మహిళల సేవలను గుర్తించి వారికి గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత. మహిళ లేకుండా కుటుంబం లేదు, సమాజం లేదు, సృష్టి కూడా లేదు. కాబట్టి మహిళలను గౌరవించడం అంటే మన సంస్కృతిని గౌరవించడం అన్నమాట.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News