చెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ విజయానంతరం గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా మోదీ గుకేశ్‌కు చెస్ బోర్డును బహుమతిగా అందించి శాలువాతో సన్మానించారు. ఈ వేడుకను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అలాగే, గుకేశ్ ప్రముఖ నటుడు రజనీకాంత్‌ను ఆయన ఆహ్వానం మేరకు తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లి కలిశారు. రజనీకాంత్‌తో గడిపిన వేళకు కృతజ్ఞతలు తెలుపుతూ గుకేశ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే, హీరో శివకార్తికేయన్ను కూడా గుకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

