Tuesday, September 8, 2026
32.2 C
Hyderabad

నేపాల్ సర్కార్ కి సోషల్ మీడియా ‘పతనశాసనం’!|ESSAY

ఇప్పటి వరకు మీడియా ప్రభుత్వాలను శాసించడం, సంస్కరించడం, కట్టడి చేయడం, కూల్చేయడం వరకే తెలుసు. కానీ, సోషల్ మీడియా ఓ దేశ అత్యున్నత అధికారాన్ని జయించడం ఇప్పటి వరకు ఎక్కడైనా చూశామా!? లేదు. కానీ, నేపాల్ ప్రభుత్వానికి ‘పతనశాసనం’ రాసింది సోషల్ మీడియా.
అసలు నేపాల్ లో ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ప్రభుత్వం ఎందుకు కూలింది? దానికి సోషల్ మీడియా ఏ విధంగా కారణమైంది? నేపాల్ లో చెలరేగిన ‘జెన్-జీ ఉద్యమం’, ‘జెన్ జెడ్ రెవెల్యూషన్’ లపై కన్నెకంటి వెంకట రమణ రాసిన ప్రత్యేక వ్యాసం నేపాల్ సర్కార్ కి ‘పతనశాసనం’ రాసిన సోషల్ మీడియా!‘

సోషల్ మీడియా… గత పదేళ్లుగా ప్రారంభమయిన ఈ విస్తృత మీడియా ప్రభావం ఎంతగావుందంటే, ఒక్క సారిగా సోషల్ మీడియాను నేపాల్ ప్రభుత్వం నిలిపి వేయడంతో కోపోద్రిక్తులైన నేపాల్ యువత ఆ దేశ పార్లమెంటును ఆక్రమించారు. దీనితో తప్పనిసరై నేపాల్ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని నియంత్రించడానికి సైన్యాన్ని రంగంలోకి దించింది. పెద్ద ఎత్తున నిరసనలు, కాల్పులు, 19 మంది మరణం, 100 మందికి పైగా గాయాలు, ఫలితంగా సోషల్ మీడియా పై నిషేధం ఎత్తివేత, ముందుగా నేపాల్ హోం మంత్రి రాజీనామా, అనంతరం ప్రధాని ఓలి రాజీనామా… ఇవి నేపాల్ లో జరిగిన పరిణామాలు.
ఒకవిధంగా, ఇది ప్రపంచంలో మొట్టమొదటి సోషల్ మీడియా ప్రభావిత విప్లవం అని చెప్పవచ్చు.
తమ దేశ నిబంధనలు పాటించడంలేదనే ఆరోపణలతో ఎక్స్, ఫేస్ బుక్, వాట్సాప్ లతో సహా 26 సోషల్ మీడియా యాప్ లను నేపాల్ నిషేధించింది. ఇప్పటికే, జెన్-జీ అనే బ్యానర్ పై నేపాల్ రాజరిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యువతకు, నేపాల్ ప్రభుత్వం చేసిన సోషల్ మీడియా బ్యాన్ ఒక ఊతంగా లభించింది. దీంతో వేలాదిగా యువత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. ‘జెన్ జెడ్ రెవెల్యూషన్’ అనే నినాదాలతో ర్యాలీలు, పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శనలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో, లాఠీచార్జీలు, మీడియా స్వేచ్చపై దాడులు వంటి చర్యలు కొనసాగాయి. యువత నిర్వహిస్తున్న ఆందోళన, ప్రదర్శనల కారణంగా ఖాట్మండు, విరాట్‌నగర్ తదితర ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ విధించారు.

నేపాల్ ‘జెన్ జెడ్ రెవెల్యూషన్’ నేపథ్యం ఇదీ…
నేపాల్‌లో ‘జెన్-జీ ఉద్యమం’ ఇటీవల ఆ దేశ యువత ప్రారంభించిన అత్యంత శక్తివంతమైన ఉద్యమం. ప్రధానంగా 1997 తర్వాత జన్మించిన “జెన్-జీ” తరానికి చెందిన యువత ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఈ ఉద్యమం అవినీతిని, ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని, సోషల్ మీడియాపై నిషేధాన్ని, ప్రజాస్వామిక హక్కులపై విధించిన ఆంక్షలను ఈ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మొత్తం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను నేపాల్ ప్రభుత్వం ఒక్కసారిగా బ్యాన్ చేయడంతో, తమ దైనందిన జీవితంలో ఒకటిగా ఉన్న సోషల్ మీడియాను బ్యాన్ చేయడంతో ఒక్కసారిగా వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చారు. ఇప్పటికే, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలలో భాగస్వామ్యమైన ఈ ‘జెన్ జెడ్ రెవెల్యూషన్’ గ్రూప్ నకు, సోషల్ మీడియాపై నిషేధం వీరి ఉద్యమానికి మరింత ఊపునిచ్చాయి. సమాజంలో మార్పు కోరుతూ పెద్ద ఎత్తున ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ఆందోళనల్లో వేల మంది యువత పాల్గొంటున్నారు. ‘జెన్ జెడ్ రెవెల్యూషన్’ అనే నినాదాలతో ర్యాలీలు, పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శనలు సాగిస్తున్నాయి. ఇది ఏ పార్టీ నాయకత్వం లేకుండా, స్వతంత్రంగా యువత ఆధ్వర్యంలో సాగుతున్న ఉద్యమం.
ప్రపంచంలో పలు దేశాలు గతంలో తాత్కాలికంగా లేదా శాశ్వతంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించాయి లేదా పరిమితం చేశాయి. చైనా, ఇరాన్, ఉత్తర కొరియాలలో కఠినంగా నిషేధంలో ఉన్నాయి. పాకిస్తాన్, శ్రీలంక, రష్యా, టర్కీ, సూడాన్ తదితర దేశాలలో ఈ మీడియా ప్లాట్ ఫార్మ్ పాళీ పరిమితులున్నాయి. ఇక మన దేశంలో, జమ్మూ & కశ్మీర్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో శాంతిభద్రతల కారణంగా ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ వంటి వాటిని పలు సార్లు బ్లాక్ చేశారు. టిక్ టాక్, పీయుబీజీ మోబైల్ లాంటి చైనా యాప్‌లను కూడా నిషేధించారు. ఏది ఏమైనా, సోషల్ మీడియా ప్రజల దైనందిన జీవితంలో ప్రధాన భాగంగా మారిందనేది సుస్పష్టం.

-కన్నెకంటి వెంకట రమణ

Latest News

రూపాయెకే వైద్గ సేవలు!?|ADUGU TRENDS

సంకల్పం ఉండాలె గనీ, యేదైనా సాధించొచ్చు. గట్లనే కొందరు ఉచిత సేవలందిత్తరు. గదానికి సరైన యిలువ ఉండదనుకున్నడో ఏమో గనీ, గీ డాస్కర్ శంకర్ దాస్ రాంచందానీ, ఒక్క రూపాయెకే వైద్గం అందిత్తాండు. గీ...

కొండా కుటుంబానికి కొత్త పరీక్ష!?|EDITORIAL

ఇప్పుడు కొండా కుటుంబం ముందున్న అసలు ప్రశ్న ‘ఎవరి మీద పోరాడాలి?’ అన్నది కాదు.. ‘ఎలా తిరిగి రాజకీయంగా బలపడాలి?’ అనేదే. మౌనం, సమన్వయం, సంస్థాగత పునర్నిర్మాణం ఈ మూడు మార్గాల్లో దేన్ని...

సెప్టెంబర్ 08, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి పగలు 01.49 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.55 వరకు ఉపరి ఆశ్లేష యోగం పరిఘ రాత్రి 01.59 వరకు ఉపరి శివ కరణం తైతుల పగలు 01.49 వరకు ఉపరి గరజి రాహుకాలం...

సెప్టెంబర్ 07, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి సాయంత్రం 04.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం పునర్వసు సాయంత్రం 06.23 వరకు ఉపరి పుష్యమి యోగం వ్యతీపాత ఉదయం 07.46 వరకు ఉపరి వరీయాన్ కరణం బాలవ సాయంత్రం 04.03 వరకు ఉపరి కౌలవ రాహుకాలం...

బర్త్ డే టు బర్తరఫ్!|KONDA FAMILY|CONGRESS|

తారుమారైన కొండా సు‘రేఖ’! 17 రోజుల్లోనే తలకిందులు? ‘చే’జేతులా...చెడిన రాజకీయం ఆగస్టు 19 నుంచి సెప్టెంబరం 3 వరకు మరి తర్వాత వారి దారెటు? కోరి కోరి పదవికి ఎసరు తెచ్చుకోవడమంటే ఇదే! అదీ లండన్ లో ఉన్న...

గుప్త సామ్రాజ్యం – ప్రారంభం మరియు అభివృద్ధి (క్రీ.శ.275-550)|ADUGU DIGITAL MEDIA|HISTORY|COMPITITIVE EXAMS|SPECIAL

గుప్తుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు తెలుసుకోవడానికి సాహిత్యం, శాసనాలు మరియు నాణాలు ఉపయోగపడుతున్నాయి. గుప్త సామ్రాజ్యంలోని తొలి రాజులు *మహారాజ* అనే బిరుదును తీసుకోవడం వల్ల వీరు సామంతులుగా పాలించారని తెలుస్తుంది. కొంతమంది...

డాక్టర్ నెట్ ఇండియా-వైద్గం ఫ్రీ!?|ADUGU TRENDS

ఏదన్నా రోగమొత్తే అయిపాయె, ఆగమాగమైతం. యాడికిపోవాల్నో తెల్వదు. ఎంత కర్సైతదో తెల్వదు. ఇగ గిదే సందని, పైసలు గుంజుడు, పానం తీసుడు గా ప్రైవేట్ దవాఖాన్లల్ల పనైపాయె. పానం పోతదో, నిలుత్తదో కనీ,...

అధ్యాపకా! అభివందనం!!|EDITORIAL

నాణ్యమైన విద్య, సమర్థవంతమైన ఉపాధ్యాయ శిక్షణ, పరిశోధనకు ప్రోత్సాహం, పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించడమే రాధాకృష్ణన్‌కు నిజమైన నివాళి. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 06 నుండి సెప్టెంబర్ 12 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త ఆలోచనలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ప్రారంభించిన పనులను మధ్యలో వదిలిపెట్టకుండా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో మీ...

అమ్మంటే గామే!?|ADUGU TRENDS

మహారాష్ట్రల బీడ్ అంబాజోగాయిల అమ్రుత్ మహోత్సవ్ వేడుకలు జర్గుతానయి. అమ్రుత్ దౌడ్ మొదలైతాంది. గండ్లకు హఠాత్తుగా ఓ 47 ఏండ్ల రమాబాయి రణవీర్ దూసుకొచ్చింది. గా మారథాన్ పరుగు పందెంల ఉరుకుడు మొదలు...

ఏఐ యుగంలో గెలిచేది మానవ నైపుణ్యమే!?|EDITORIAL

ఉద్యోగార్థులకు ఏఐ గణాంకాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. డిగ్రీ లేదా అనుభవం ఒక్కటే భవిష్యత్తుకు భద్రత ఇవ్వవు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం...

సెప్టెంబర్ 05, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి నవమి రాత్రి 08.54 వరకు ఉపరి దశమి నక్షత్రం మృగశిర రాత్రి 09.39 వరకు ఉపరి ఆరుద్ర యోగం వజ్ర పగలు 01.57 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 10.08 వరకు ఉపరి గరజి రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News