మనిసిది పక్రుతితో యిడదీయరాని సంబంధం. మనిసే కాదు, పతి పాణి మనుగడే శెట్లతోటే ముడిపడి ఉంది. గాలి, నీడ, ప్రాణవాయువు ఆక్సీజన్ మొదలు పంచ భూతాల దాకా శెట్టుకు-మనిసికి లెంకే. మనం తినేవన్నీ దాదాపు శెట్ల నుంచే వత్తయి. పుట్టిన కాన్నుంచి, కట్టే కాలే దాకా అన్నీ మనకు శెట్లే ఇత్తయి. అసొంటి శెట్టొకటి ఛెత్రీ లెక్క ఎట్ల నీడనిత్తాందో సూద్దాం పదండ్రి.
గీ శెట్టేం శెట్టో గనీ, ఎట్లుందో సూడుండ్రి. గీ భూతల్లికి పందిరేసినట్లు, మొత్తం ఛెత్రీ లెక్కనే ఉంది గదా? మెలికలు తిరిగిన మొదలు, ఎత్తుగ పెరిగి కిందికి ఒంపులు తిరిగి భలే గుందే? యాభై మందైనా కూసునేటట్లు, రాత్రి గదాని కిందే పండుకునేటట్లు.. ఉంది. రాత్రి పూట గదాని కింద దీపాలు యెలిగిస్తే, యేదో కొత్త ట్రెండ్ లాగే ఉంది కదూ? సహజమైన పక్రుతిని గిట్ల కొత్త ట్రెండ్ గా ఇనియోగిస్తే మంచిగుంటది. ఏమంటరు?

