ఏడుగురు బృంద సారథులను ప్రకటించిన కేంద్రం
నెలాఖరున విదేశీ పర్యటనలకు సిద్ధం
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ Operation Sindhoor ద్వారా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ప్రతీకారం తీర్చుకున్న భారత్, ఇప్పుడు దౌత్యరంగంలోనూ అదే పంథాలో సాగేందుకు సన్నద్ధమైంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లి, అక్కడి మద్దతును పొందేందుకు భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున యత్నాలు ప్రారంభించింది. ఈ దిశగా ఏడు బృందాలను ఏర్పాటు చేసిన కేంద్రం, పార్లమెంటు సభ్యులు, వివిధ పార్టీల నేతలు, దౌత్యవేత్తలతో ఈ బృందాలను రూపొందించింది. ఈ నెలాఖరు నుంచి ఈ బృందాలు వివిధ దేశాల్లో పర్యటించనున్నాయి.
ప్రతి బృందానికి నాలుగు నుంచి ఐదు దేశాలు కేటాయించబడిన ఈ యాత్రలో, పాక్ విద్వేష రాజకీయాలు, ఉగ్రవాద మద్దతు, భారత్‌పై దాడులకు ప్రేరణ వంటి అంశాలను స్పష్టంగా వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐరాస భద్రతా మండలిని కూడా సంప్రదించనున్నారు.
ఈ దౌత్యబృందాలకు విపక్షం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శశి థరూర్|shashi tharoor (కాంగ్రెస్), కనిమొళి|kanimoli (డీఎంకే), సుప్రియా సూలే|Supriya Sule (ఎన్సీపీ-పవార్)లతో పాటు అధికార ఎన్డీఏ కూటమి నుంచి రవిశంకర్ ప్రసాద్|Ravi Shanker Prasad, బైజయంత్ పాండా (బీజేపీ), సంజయ్ కుమార్ ఝా (జేడీయూ), శ్రీకాంత్ షిండే (శివసేన-షిండే) నేతృత్వం వహిస్తున్నారు.
ఈ బృందాల్లో అనురాగ్ ఠాకూర్, అపరాజితా సారంగి, మనీశ్ తివారీ, అసదుద్దీన్ ఒవైసీ, అమర్ సింగ్, రాజీవ్ ప్రతాప్ రూడీ, సమిక్ భట్టాచార్య, బ్రిజ్‌లాల్, సర్ఫరాజ్ అహ్మద్, ప్రియాంక చతుర్వేది, విక్రమ్‌జిత్ సాహ్నీ, సస్మిత్ పాత్ర, భువనేశ్వర్ కలితా, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.
ప్రతి బృందానికి కేటాయించిన దేశాలు:
శశి థరూర్ నేతృత్వంలోని బృందం: అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా
సుప్రియా సూలే బృందం: ఈజిప్ట్, ఖతర్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా
కనిమొళి బృందం: రష్యా, స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాత్వియా
సంజయ్ కుమార్ ఝా బృందం: జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, మలేషియా, ఇండోనేసియా
రవిశంకర్ ప్రసాద్ బృందం: ఈయూ, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్
బైజయంత్ పండా బృందం: సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా
శ్రీకాంత్ షిండే బృందం: యూఏఈ, లైబీరియా, కాంగో, సియెర్రా లియోన్
ఈ దౌత్య యాత్రల ద్వారా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును సమకూర్చేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ప్రపంచ దేశాలకు పాక్ ఉగ్రవాద మద్దతును తెలియజేసి, భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను బహిర్గతం చేయడమే ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశ్యంగా ప్రభుత్వం పేర్కొంది.

