Friday, September 18, 2026
26.4 C
Hyderabad

హలో!|HELLO|BRS|CONGRESS

మీ ఫోన్ ని మరెవరో వింటున్నారు!
చాటుమాటేసి మీ మాటల్ని వింటున్నారు
సాక్షాత్తు మంత్రే ఈ మాటలంటున్నారు
నాలుగ్గోడల మధ్య జరిగితే మాకేంటని..
స్వయంగా సీఎమ్మే అంటున్నారు|CM|REVANTH REDDY|PONGULETI
ప్రభుత్వ నిస్సహాయతకు నిదర్శనమా?
చేతగాని తనమా? రాజకీయ వ్యూహమా?

సంచలనంగా సీఎం, మంత్రుల వ్యాఖ్యలు

విచారణ జరుగుతుండగానే పేలిన తూటాలు
అనధికార ఫోన్ ట్యాపింగ్ పై అనుమానాలు
ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై అనేక ప్రశ్నలు

ఈ ట్యాపింగ్ కు ఫుల్ స్టాపింగ్ లేదా?

ఫోన్ ట్యాపింగ్ ఇంకా జరుగుతోందా? అధికారికంగానా? అనధికారికంగానా? ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుగుతుండగానే, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ‘నేను అధికారులతో మాట్లాడిన టెలి కాన్ఫరెన్స్ విషయాలు బయటకు వస్తున్నాయంటే, ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది. ఏ ఫామ్ హౌస్ నుండి ఇది జరుగుతుందో ఆధారాలు ఉన్నాయి.’ అని వ్యాఖ్యానించడం సంచలనమైంది. నిర్ణీత నిబంధనల ప్రకారం. పరిమితంగా అధికారిక ఫోన్ ట్యాపింగ్ ఆక్షేపణీయం కాదని, అది చట్టబద్ధమేనని తెలిసిందే. అయితే, ఆ అధికారిక ఫోన్ ట్యాపింగ్ పరిధులు దాటి అనేకమంది ఫోన్లు విని, బ్లాక్ మెయిల్ చేసి, అధికారానికి తిరిగి రావడానికి, కోట్లు కొల్లగొట్టిన ఆరోపణలపై విచారణ జరుగుతోంది? కానీ, అనధికారికంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చినా, దానిపై విచారణ జరగకపోగా, చర్చ కూడా లేకుండాపోయిన తరుణంలో మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు ఇప్పుడు అంత్యంత ప్రాధాన్యంతను సంతరించుకున్నాయి. నాలుగ్గోడల మధ్య జరిగితే మాకేంటని..స్వయంగా సీఎమ్మే ఢిల్లీలో అంటున్నారు.*
*నిజంగానే అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందా? జరిగితే ఎక్కడెక్కడి నుండి జరుగుతోంది? ఎంత కాలంగా జరుగుతోంది? ఆ పరికాలు ఇంకా భద్రంగా పని చేస్తూనే ఉన్నాయా? అది ఏ ఫాం హౌస్ నుండి జరుగుతోందో తెలుసన్న మంత్రి ప్రభుత్వ విచారణకు ఎందుకు ఆదేశించలేదు? చట్టపరంగా ఎందుకు అరికట్టలేదు? మంత్రి మాటలు ప్రభుత్వ నిస్సహాయతకు నిదర్శనమా? చేతగాని తనమా? రాజకీయ వ్యూహమా? ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ విచారణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు మరిన్ని ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.

✍🏻-డా.మార్గం లక్ష్మీనారాయణ

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత రెండున్నరేళ్ళుగా రచ్చరచ్చగా మారింది. అధికారిక ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరుగుతున్న సమయంలోనే మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలను బట్టి, ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని అర్థమవుతోంది. ఏ ఫామ్ హౌస్ నుంచి ఇది జరుగుతుందో ఆధారాలు ఉన్నాయంటున్న దాన్ని బట్టి తగిన సాక్ష్యాధారాలున్నట్లుగా తేలిపోతోంది.

జాతీయ భద్రత, తీవ్రమైన నేరాల విచారణ వంటి పరిమిత సందర్భాల్లో, చట్టబద్ధమైన అనుమతులతో మాత్రమే పోలీసు నిఘా విభాగం ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. గత కొంతకాలంగా బయటకు వచ్చిన లీకులు, రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టుల సంభాషణలు అనధికారికంగా రికార్డ్ అయ్యాయన్న ఆరోపణలు ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. దీంతో ప్రభుత్వమే విచారణకు ఆదేశించింది. ప్రత్యేకంగా సిట్ ను నియమించింది. కొంత విచారణ పూర్తయ్యాక మరో సిట్ ను వేసింది. ఇప్పటికే వందల మంది బాధితులు, కేంద్ర మంత్రి బండి సంజయ్, కేటీఆర్, హరీశ్ రావు, కేసీఆర్ ను సైతం విచారించారు.

రకరకాల పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారిక నిర్ణయాలు కూడా లీకవుతున్నాయని భావించి, అధికారుల శాఖలు సమూలంగా మార్చారు. ఏకంగా సీఎంఓనే ప్రక్షాళన చేశారు. నిర్ణయాలు తీసుకోకముందే అవి లీకవడం, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలు వాటిని పట్టుకుని నానా యాగీ చేయడం మాములైపోయింది. ఇదే విషయమై అనేక మంది మంత్రులతోపాటు సీఎం కూడా పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు, చివరకు కల్వకుంట్ల కవిత కూడా తన, తన భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. దమ్ముంటే కేసీఆర్ ను అరెస్ట్ చేయండంటూ సవాళ్ళు విసురుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ను కాపాడుతున్నారని బీజేపీ, లేదు బీజేపే కేసీఆర్ ను కాపాడుతోందని సీఎం ఆరోపించకుంటుంటే, తమనేమీ చేయలేరని బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ లు ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తిపోస్తున్నారు. విచారణాధికారులను సైతం బహాటంగానే బెదిరిస్తూనే ఉన్నారు.

విచారణ చివరి దశకు చేరిందని కూడా అంటున్న ఈ దశలో ఒక కేబినెట్ మంత్రి “ఫోన్ ట్యాపింగ్ ఆగలేదు. ఇంకా జరుగుతూనే ఉంది” అనడం, ఏ ఫాం హౌస్ నుంచో తెలుసని చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది. ఆందోళనపరుస్తోంది. ఆలోచింప చేస్తోంది. మంత్రి వ్యాఖ్యలు నిజమైతే, అనధికారంగా ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతుంటే, అది తీవ్రమైన చట్ట వ్యతిరేక చర్య. నేరం. మరి, ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? అలాంటి నేరాన్ని, నేరగాళ్ళను ఎందుకు అదుపు చేయలేకపోతోంది?
మంత్రి వ్యాఖ్యలు వ్యూహాత్మకమైనవా? ప్రత్యర్థులను కట్టడి చేసే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలైతే, అవి విచారణ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. విచారణలో ఉన్న అంశాలపై వ్యాఖ్యలు విచారణ తీరుపైనే అనుమానాలను కలిగిస్తున్నాయి.

మంత్రి ప్రస్తావించిన “ఫామ్ హౌస్” వ్యాఖ్య మరింత సంచలనాత్మకం. ఇది గత పాలనలోని ఆరోపణలను గుర్తుకు తేవడమే కాదు, తెరమీదకు తెస్తోంది. అయితే, ఏ ఆరోపణలకైనా ఆధారాలే కీలకం. మంత్రి వ్యాఖ్యలకు మంత్రే సమాధానం చెప్పాలి. లేదంటే మంత్రి వ్యాఖ్యలు మరింత రాజకీయ దుమారం రేపే ప్రమాదం ఉంది.

నాయకత్వం వహించే పాలకులే తమ ప్రభుత్వ యంత్రాంగం తమ మాటల్నే లీక్ చేస్తోందని అనుమానిస్తే, బహిరంగంగా ప్రకటిస్తే, పరిపాలన ఎలా సాగుతున్నట్లు? అది పాలనపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఫోన్ ట్యాపింగ్ విచారణ నిజంగా విశ్వసనీయంగా సాగాలంటే, రాజకీయ వ్యాఖ్యలకంటే సంస్థాగత చర్యలు ముఖ్యం. స్వతంత్ర దర్యాప్తు, కాలపరిమితిలో స్పష్టంగా జరగాలి. ఎవరైనా తప్పు చేసినట్టు తేలితే, అది ఎంతటి వ్యక్తి అయినా చట్టం ముందు సమానమేనని ప్రజలకు తెలిసేలా శిక్షించాలి.
మరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ పై విచారణ పారదర్శకంగా సాగుతుందా? లేక రాజకీయ వ్యాఖ్యల తుఫానులో కొట్టుకుపోతుందా? తేలాల్సి ఉంది.

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News