ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.! అవునా? గవెట్లనో సూపిత్తా పదండ్రి.

ఇంటికి టాపు పోత్తరు కదా? గప్పుడు గా టాపుల మట్టితోటి నింపిన టాపు మందం పైపులు మనకు అవుసరమైన శోట్ల పెడ్తరు. టాపు ఎండినంక గా పైపుల మట్టిని తీసేత్తరు. ఆకాశంల ఉన్నట్లే ఇంటి మీద నచ్చత్రాలు తయారైనట్లే. మరి వానొత్తే? గదానికి గూడ ఓ ఉపాయం శేసిండ్రు. గా టాపు మీద అద్దం లెక్కనే అటు, ఇటు కనబడే దొడ్డుపాటి అద్దాన్ని పెడ్తరట. ఇగ ఎండకు ఇల్లంతా యెలుతురుతోటి మెరిసిపోతది. ఇగ ఒక్క సినుకూ ఇంట్ల పడదన్నట్లు. ఇగిప్పుడు గీ రకంగా కూడా ఇండ్లు కట్టుకుంటాండ్రు. కలలాంటి నచ్చత్రాల ఇల్లు కండ్ల ముందే కావాల్నంటే.. మీరు గూడ గిట్ల కట్టుకోండ్రి మరి.!

