ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మొత్తం తొమ్మిది మంది మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోయారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ కిరణ్ చౌహాన్ మీడియా సమావేశంలో ప్రకటించారు.
‘నియాద్ నెల్ల నార్’ పథకం ప్రభావం
మావోయిస్టుల లొంగుబాటుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నియాద్ నెల్ల నార్’ పునరావాస విధానం కీలకంగా మారిందని ఎస్పీ తెలిపారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో భద్రతా శిబిరాల ఏర్పాటుతో పాటు విస్తృత కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగించడంతో మావోయిస్టులు లొంగిపోతున్నట్లు వివరించారు.
సుక్మా బెటాలియన్‌కు చెందిన నక్సలైట్లు లొంగుబాటు
లొంగిపోయిన వారిలో సుక్మా ప్రాంతంలోని పీఎల్‌జీఏ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు నక్సలైట్ జంటలు సహా మొత్తం తొమ్మిది మంది హార్డ్‌కోర్ మావోయిస్టులు ఉన్నారు.
రూ. 52 లక్షల రివార్డు
లొంగుబాటుకు సంబంధించి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మొత్తం రూ. 52 లక్షల రివార్డు ప్రకటించింది. ఇద్దరు పురుషులు, నలుగురు మహిళా నక్సలైట్లకు రూ. 8 లక్షల చొప్పున రివార్డు, ఓ మహిళా మావోయిస్టుకు రూ. 2 లక్షలు, మరో ఇద్దరు మహిళా మావోయిస్టులకు రూ. 1 లక్ష చొప్పున ఈ రివార్డు మొత్తాన్ని లొంగుబడ్డ మావోయిస్టులకు ప్రభుత్వం అందజేసినట్లు అధికారులు తెలిపారు.

