Thursday, July 30, 2026
23.7 C
Hyderabad

జీహెచ్ఎంసీ సమావేశంలో గందరగోళం

తోపులాట, నినాదాల మధ్య బడ్జెట్ ఆమోదం

జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా, ఒకరినొకరు తోసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. గురువారం ఉదయం సమావేశం ప్రారంభమైన వెంటనే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు కౌన్సిల్ నివాళులు అర్పించింది. అనంతరం మేయర్ గద్వాల విజయలక్ష్మీ బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రకటించగా, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా ప్రజా సమస్యలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.

అయితే, మేయర్ గద్వాల విజయలక్ష్మీ రూ.8,440 కోట్లతో జీహెచ్ఎంసీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై చర్చించాల్సిందిగా సభ్యులను కోరినా, విపక్ష కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై ముందుగా చర్చ జరపాలంటూ పట్టుబట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి తలెత్తింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అంతేకాదు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆరు గ్యారెంటీల అమలుపై చర్చ జరపాలని నిరసన తెలిపారు, అయితే కాంగ్రెస్ కార్పొరేటర్లు బడ్జెట్‌పై చర్చ చేపట్టాలని నినాదాలు చేశారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో మేయర్ ఐదు నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.

సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు తమ నిరసన కొనసాగించారు. కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులతో మేయర్ పోడియాన్ని చుట్టుముట్టగా, వారిని కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. ప్లకార్డులను చించివేయడంతో, ఇరువర్గాల మధ్య వాగ్వాదం మరింత తీవ్రమైంది. ఈ గందరగోళ పరిస్థితి మధ్య 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.8,440 కోట్ల బడ్జెట్‌ను చర్చలేకుండానే కౌన్సిల్ ఆమోదించింది. నిరసనలో ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను మార్షల్స్ బలవంతంగా బయటకు పంపించగా, వారు జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

ఇంకా, సమావేశానికి ముందుగా బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. గోషామహల్ స్టేడియాన్ని కూల్చకుండా, అక్కడ ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించకూడదంటూ నినాదాలు చేశారు. ఆసుపత్రి నిర్మాణాన్ని వెనుక ప్రాంతంలో చేపట్టాలని డిమాండ్ చేశారు. మొత్తం సమావేశం హంగామా, నిరసనలతో ముందుకు సాగగా, చివరికి పెద్ద చర్చలేకుండానే బడ్జెట్ ఆమోదం పొందింది.

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News