పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ పండ్లు కిలోకు రెండున్నర లచ్చలు పలుకుతదట. గసొంటి పండ్లను పండిచ్చిండ్రు ఆదిలాబాద్ జిల్ల ముఖరా కే ఊరు సర్పంచ్-ఎంపీటీసీ మీనాక్షి-సుభాస్ గడ్కేలు. లచ్చలు సంపాదించుడే కాదుల్లా… గా పంటలేసి లచ్చణంగ పేరు గూడ సంపాయిచిండ్రు.
గవాల్లకు ఇష్టమైన నాయకుడు కేసీఆర్, కేటీఆర్ లట. నాలుగేండ్ల కింద గవాల్ల పేరు మీద వాల్ల పుట్టిన రోజునాడు తమ సొంత తోటల 5 మియా జాకీ మామిడి శెట్లు పెట్టిండ్లట. గయిప్పుడు శేతికొచ్చినయి. మొదటి కాతను ఇచ్చినయి. ఇగ గీ ముచ్చటను గాయినె అందరికి శెప్పి తెగ మురిసి పోతాండు.

