Friday, July 31, 2026
25.7 C
Hyderabad

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన మార్పు ఎన్నికల సంస్కరణల ద్వారానే సాధ్యం. లేకపోతే రాజ్యాంగం అదే రూపంలోనే కొనసాగుతూనే, ప్రజాస్వామ్యం తన ఆత్మను కోల్పోయే ప్రమాదం ఉంది.

దేశంలో ఎన్నికల ప్రక్రియ “మళ్ళీ మళ్ళీ వస్తున్న ఒకే నాయకత్వం”తో ఇబ్బందీ పడుతోంది. అదే వ్యక్తులు పదేపదే ఎన్నికవుతూ వస్తున్నారు. ఈ ధోరణి కొత్త నాయకత్వ ఆగమనానికి పెద్ద అడ్డంకిగా మారింది. గణాంకాల ప్రకారం, గత కొన్ని దశాబ్దాల్లో లోక్‌సభలో తిరిగి ఎన్నికయ్యే సభ్యుల శాతం 50%కు పైగా ఉండటం గమనార్హం. దీన్ని నియంత్రించేందుకు గరిష్టంగా రెండు పదవీకాలాలకే పరిమితిని విధించడం అవసరం. అలాంటి నిబంధనలు ప్రవేశపెడితే రాజకీయాల్లో కొత్త ఆలోచనలకు మార్గం సుగమం అవుతుంది.

ఎన్నికల్లో డబ్బు ప్రవాహం, కండ, మంద బలం ప్రభావం తీవ్రంగా పెరిగింది. ఒక పార్లమెంట్ ఎన్నికలో ఒక అభ్యర్థి చేసే ఖర్చు సగటు వంద కోట్లు దాటుతున్నది. అధికారికంగా ఖర్చు పరిమితి ఉన్నప్పటికీ, అనధికారిక వ్యయాలు ఎన్నికల సంఘం నియంత్రణలో లేవు. 2019 సాధారణ ఎన్నికల్లో మొత్తం ఖర్చు రూ. 60వేల కోట్లకు పైగా జరిగినట్లు అంచనాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఖర్చులను ప్రభుత్వమే భరించే విధానం లేదా పారదర్శక ఫండింగ్ విధానాలను అమలు చేయడం అత్యవసరం.

సామాజిక న్యాయం మరో ప్రధనాంశం. దళితులు, గిరిజనులు, మహిళలు కలిపి దేశ జనాభాలో 70% వరకు ఉన్నప్పటికీ, చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం తగిన స్థాయిలో లేదు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, మహిళలకు మాత్రం పరిమిత అవకాశాలే ఉన్నాయి. కనీసం 33% మహిళా రిజర్వేషన్ అమలు చేయడమే కాకుండా, వెనుకబడిన వర్గాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించే దిశగా చర్చ, చర్యలు జరగాలి.

ఒకే అభ్యర్థి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం అనే వ్యవహారం ప్రజాధనం వృథా చేయడమే కాకుండా, ఉపఎన్నికలకు దారితీస్తుంది. ఒకసారి ఎన్నికైన తర్వాత ఒక సీటును వదిలేయాల్సి రావడం వల్ల, ఆ చోట మరోసారి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. అందువల్ల ఒకే వ్యక్తి ఒకే నియోజకవర్గానికి పరిమితం కావాలని చట్టపరమైన మార్పులు చేయాలి.

“ఒకే దేశం – ఒకే ఎన్నిక” విధానం ఆవశ్యం. దేశంలో తరచూ ఎన్నికలు జరుగడం వల్ల ఖర్చు పెరగడంతో పాటు పాలనపై ప్రభావం పడుతోంది. కేంద్రం, రాష్ట్రాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం వల్ల ఖజానాపై భారం తగ్గుతుంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు, రాజకీయ విభేదాలు ఉన్నాయి. అయినప్పటికీ, దీన్ని అమలు చేసే స్పష్టమైన ప్రణాళిక అవసరం.

ఓటరు జాబితా లోపాలు, దొంగ ఓట్లు పెద్ద సమస్యగా మారాయి. దేశవ్యాప్తంగా ఓటర్ లిస్టుల్లో లోపాలు, ప్రజాస్వామ్య నిష్పాక్షికతకు తీవ్ర భంగం కలిగిస్తున్నాయి. ఓటరు జాబితాను నిరంతరం నవీకరించడం, సాంకేతికత ఆధారంగా గుర్తింపు వ్యవస్థలను బలోపేతం చేయడం అత్యవసరం. ప్రతి ఓటరు తన నివాస ప్రదేశంలోనే ఓటు వేయగల విధంగా చట్టపరమైన స్పష్టత అవసరం.

ప్రజాప్రతినిధుల జీతభత్యాలు, పెన్షన్లు కూడా సమస్యే. ప్రస్తుతం ఒక ప్రజాప్రతినిధి ఒక్కసారే ఎన్నికైనా జీవితకాలం పెన్షన్ పొందే అవకాశం ఉంది. కొందరు అసెంబ్లీ, పార్లమెంట్ రెండు స్థాయిల్లో ఎన్నికైతే, రెండు పెన్షన్లు కూడా పొందుతున్నారు. ఈ విధానాన్ని వెంటనే పన: సమీక్షించాలి. పనితీరు ఆధారంగా సౌకర్యాలు ఉండే విధంగా మార్పులు చేయాలి.

ప్రజల భాగస్వామ్యం. ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీల మధ్య పోటీగా, అదేదో నేతల వ్యవహారంగా మారిపోయాయి. సామాన్య ప్రజలకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి, రాజకీయాల్లో ప్రవేశించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అవసరమైతే ప్రత్యేక నిబంధనలు లేదా ప్రోత్సాహకాలు ప్రవేశపెట్టి వారిని ప్రోత్సహించాలి.

ఎన్నికల సంస్కరణలు కేవలం ఒక రాజకీయ పార్టీ లేదా నాయకుడి బాధ్యత కాదు. ఇది దేశవ్యాప్తంగా చర్చించాల్సిన అంశం. రాజ్యాంగ సవరణల నుంచి పరిపాలనా మార్పుల వరకు సమగ్ర చర్యలు అవసరం. ప్రజాస్వామ్యం బలపడాలంటే ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా, సమానత్వంతో ఉండాలి.

సీట్ల పెంపు వంటి పైపై మెరుగులతో కాకుండా, అసలు సమస్యలను పరిష్కరించే ఎన్నికల సంస్కరణల ద్వారానే భారత ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. కొత్త నాయకత్వానికి మార్గం కల్పించడం, ధనబలం ప్రభావాన్ని తగ్గించడం, సామాజిక న్యాయాన్ని సాధించడం వంటి లక్ష్యాలతో సాగితేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.

Latest News

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News