Tuesday, September 15, 2026
22.8 C
Hyderabad

తెలంగాణ కాంగ్రెస్‌ లో విషాదం

ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి కన్నుమూత

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఉప్పల్‌ నియోజకవర్గానికి చెందిన మాజీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి గురువారం ఉదయం అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌ హబ్సిగూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు సుమారు 80 ఏళ్లు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో కన్నుమూశారు. ఆయన మృతితో కాంగ్రెస్ పార్టీ ఓ సీనియర్ నాయకుడిని కోల్పోయింది. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజిరెడ్డి నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు.

1945లో నాచారంలో జన్మించిన బండారి రాజిరెడ్డి, మల్లాపూర్‌లోని జిల్లా పరిషత్ పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేశారు. బాల్యం నుంచే సామాజిక సేవ పట్ల ఆసక్తి ఉన్న ఆయన, యువకుడిగా ఉండగానే కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వివిధ స్థాయిల్లో సేవలందించిన ఆయన, స్థానిక రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పై 28,183 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారు. రోడ్లు, డ్రైనేజీలు, బస్తీలలో బేసిక్ సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ప్రజలతో నిత్యం కలిసిమెలిసి ఉండే వ్యక్తిగా పేరుగాంచారు. ఆయన ప్రజలతో నేరుగా మమేకమయ్యే నాయకుడిగా చరిత్రలికెక్కారు. 2012లో తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) పాలక మండలి సభ్యుడిగా కూడా సేవలందించారు. ఆ హోదాలో దాదాపు ఏడాది పాటు పనిచేశారు.

2014లో జరిగిన తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో రాజిరెడ్డి పోటీ చేయకపోయినా, తన సోదరుడు బండారి లక్ష్మారెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిపారు. అయితే ఆయన ఓటమి చెందారు. అనంతరం లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరి రాజకీయంగా కొనసాగారు. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఉప్పల్ నియోజకవర్గం నుండి విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

బండారి రాజిరెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు. ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ఆయన మృతి తీరనిలోటు.

Latest News

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

సెప్టెంబర్ 11,శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి అమావాస్య ఉదయం 08.35 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పుబ్బ పగలు 02.08 వరకు ఉపరి ఉత్తర యోగం సాధ్య రాత్రి 06.54 వరకు ఉపరి శుభ కరణం నాగవ ఉదయం 08.35 వరకు ఉపరి కింస్తుంఘ్న రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News