ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) శత జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ గౌరవం తెలియజేయడం పట్ల నాగార్జున ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగార్జున సోషల్ మీడియాలో స్పందిస్తూ, మోదీకి ధన్యవాదాలు తెలిపారు. “ఐకానిక్ లెజెండ్స్‌తోపాటు మా నాన్న ఏఎన్నార్ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం చాలా ఆనందకరం. ఏఎన్నార్ గారి దూరదృష్టి, భారతీయ సినిమాకి ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తి” అని నాగార్జున పేర్కొన్నారు.
ఏఎన్నార్ గారి జీవితంలో మరియు సినీ రంగంలో చేసిన అనేక సేవలు భారతీయ సినిమాను ముందుకు నడిపించాయి. ఆయన చూపిన స్ఫూర్తి, సినిమాటిక్ కృషి గురించి ప్రధాని గుర్తించడం, ఆయనను గౌరవించడంపై నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు భారతీయ సినీ రంగంలో మార్గదర్శిగా నిలిచారు. భారతీయ సినిమా పట్ల ఆయన చూపిన పట్టుదల, ప్రతిభ, మరియు ఆవిష్కరణలు అనేక కొత్త తరం నటులకు స్ఫూర్తిగా ఉన్నాయి. మోదీ గుర్తించిన ఈ గౌరవం మరింత ప్రత్యేకమని నాగార్జున అభిప్రాయపడ్డారు.

