Monday, August 3, 2026
31.5 C
Hyderabad

కన్నడనాట అత్యాచార కరాళం!|EDITORIAL

‘రాతి హృదయంలో ఇమడని కన్నీటి పువ్వులా జాతి గుండెల్లో రగిలే శోక దీపంలా ఎవరమ్మా నువ్వు?’ అని ప్రశ్నించాడు అలిశెట్టి ప్రభాకర్. ఆయన కవితా వాక్యాలు నేటికీ అక్షర సత్యాలై ఆవిష్కరింప పడుతుండటం విచాకరం. విషాదకరం. కన్నడనాట వెలుగు చూస్తున్న అత్యాచార కాండ యావత్ దేశాన్ని నివ్వెపరుస్తున్నది. జాతి నిర్ఘాంతపోతున్నది.

కర్ణాటకలోని ధర్మస్థలి, ప్రజ్వల్‌ రేవణ్ణ ఈ రెండు పేర్లకు ఇప్పుడు పరిచయం అక్కరలేదు. దేశానికి బాగా తెలిసిపోయన ఈ రెండు పేర్లు జనం నోళ్ళల్లో నానుతున్నాయి. ఆడవాళ్ళపై అత్యాచారాలకు, హత్యాచారాలకు సాక్షిగా ధర్మస్థలి నిలిస్తే, వాటిలో ప్రయేయం ఉన్న దోషిగా ప్రజ్వల్ రేవణ్ణ నిలిచాడు. ధ్మస్థలిలో అమ్మాయిలపై అత్యాచారం చేసి చంపేస్తున్నారని, అదృశ్యం అయిన కేసుల్లో ఇప్పటికీ ఆచూకీ దక్కలేదని, సంబంధిత పోలీసు స్టేషన్ లో రికార్డులే గల్లతయ్యాయని గుర్తించారు. ఒకరిద్దరు ఫిర్యాదు చేసినా, వాటిపై చర్యలు తీసుకోలేదు. ధర్మస్థలి వ్యవహారంలో పెద్ద తలకాయల మాఫియా ఉందని అంటున్నారు. అందుకే అసలు నిజాలు బయటకు రావడం లేదని తెలుస్తోంది. అయితే ఈ అ(హ)త్యాచార కుంభస్థలం ఎప్పుడో ఒకప్పుడు బద్దలు కాక తప్పదు. మాజీ సానిటేషన్‌ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో డొంక కదులుతోంది.

ప్రజ్వల్‌ రేవణ్ణ సాగించిన అత్యాచారకాండ అంతాఇంతా కాదు. ప్రజ్వల్‌ రేవణ్ణపై లైంగిక దాడి కేసులు నమోదైనప్పుడు కనీస మాత్రంగా కూడా నేతలు స్పందించలేదు. ప్రజల్వల్‌ తీర్పును స్వాగతించలేదు. న్యాయస్థానం శిక్ష విధించాక కూడా ఎవరూ స్పందించలేదు. మరిన్ని కేసులు విచారణలో ఉన్నాయి. రాజకీయ పలుకుబడి, డబ్బు ఉన్న ప్రజ్వల్‌ పైకోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది.

ప్రజ్వల్‌ రేవణ్ణ ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ఇంట్లో పనిమనిషిపై పలుమార్లు అత్యాచారం జరిపిన కేసులో అభియోగాలు రుజువు కావడంతో ప్రజ్వల్‌కు బెంగళూరు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. రూ.11.35 లక్షలు జరిమానా విధించి, దానిలో రూ.11 లక్షలు బాధితురాలికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మహిళలను కట్టుబానిసలుగా, సెక్స్‌ వర్కర్లుగా చూస్తున్న ప్రస్తుత సమయంలో న్యాయస్థానం వెలువరించిన ఈ తీర్పు మహిళలకు ఆశాకిరణం. ఆత్మవిశ్వాసం పెంచేదే.

ప్రజ్వల్‌పై మూడు లైంగిక దాడి కేసులు, ఒక లైంగిక వేధింపుల కేసు నమోదుకాగా ఒక్క మొదటి కేసులోనే శిక్ష పడింది. మైసూర్‌ ఆర్‌కె నగర్‌కు చెందిన ఒక మహిళ తనపై ఫాంహౌస్‌లో ప్రజ్వల్‌ పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేయడంతో తొలికేసు నమోదైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో రెండవసారి హసన్‌ నియోజకవర్గం నుంచి ప్రజ్వల్‌ ఎంపీగా పోటీ చేశారు. పోలింగ్‌ ముగిశాక కేసు నమోదు కావడంతో జర్మనీకి పారిపోయాడు. ప్రత్యేక దర్యాప్తు బృందం అతన్ని స్వదేశానికి రప్పించి గతేడాది మే 31న అరెస్ట్‌ చేసింది. అప్పటి నుంచి రిమాండ్‌ ఖైదీగా ప్రజ్వల్‌ జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. అయితే, కేసు దర్యాప్తు సమయంలో సిట్‌ కనుగొన్న విషయాలు విస్తుగొల్పేలా ఉన్నాయి. ప్రజ్వల్‌ రేవణ్ణ ప్రజాప్రతినిధిగా సమస్యలపై తన దగ్గరకొచ్చే మహిళలపై లైంగికదాడికి ఒడిగట్టాడు. బెదిరించి, బలవంతంగా, లోబరుచుకుని లైంగిక దాడులకు బరితెగించాడు. అత్యాచారం చేసిన ప్రతిసారీ తన ఐ-ఫోన్‌లో ఆ దృశ్యాలను తానే రికార్డు చేసుకున్నాడు. అటువంటి రెండు వేలకు పైచిలుకు వీడియోలను దర్యాప్తు సందర్భంగా ప్రజ్వల్‌ ఫోన్‌లో కనుగొన్నారు. అవి మార్ఫింగ్‌ వీడియోలుగా, రాజకీయ కుట్రగా ప్రజ్వల్‌ బుకాయించి, తప్పించుకోచూశాడు. కానీ, ఆ వీడియోలను విదేశాలకు పంపించి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఫోరెన్సిక్‌ పరీక్షలు చేయించి నిజమైనవేనని నిర్ధారించారు. కేవలం 14 నెలల్లోనే కేసు ఛేదించడం వెనుక దర్యాప్తు అధికారుల కృషి, కోర్టులో వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్‌ కనబరిచిన చాకచక్యం అభినందించాల్సిందే.

అన్నింటికీ మించి న్యాయం కోసం, దోషికి శిక్ష పడాలని బాధితురాలు కనబర్చిన పట్టుదల మహిళాలోకానికి స్ఫూర్తినిస్తుంది. ప్రజ్వల్‌ రేవణ్ణ సాదాసీదా యువకుడు కాదు. కర్ణాటక రాజకీయాలను శాసిస్తున్న కుటుంబానికి చెందిన మాజీ ఎంపీ. ఆయన తాత దేవెగౌడ మాజీ ప్రధాని, పినతండ్రి కుమార స్వామి కేంద్ర మంత్రి, తండ్రి రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంఎల్‌ఎ హెచ్‌డి రేవణ్ణ, తల్లి భవానీ గతంలో కార్పొరేటర్‌, సోదరుడు సూరజ్‌ ఎంఎల్‌ఎ. ఇంతమంది రాజకీయ కుటుంబంలో ఉన్న ప్రజల్వల్‌ తనకు తిరుగులేదని భావించాడు. అత్యాచార బాధితురాలిని అపహరించిన ప్రజ్వల్‌ తల్లి భవానీపైనా కేసు నమోదైంది. ప్రజ్వల్‌ తండ్రి హెచ్‌డి రేవణ్ణపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణల కేసు నమోదయ్యాయంటే బాధితులను ప్రజ్వల్‌ కుటుంబం తమ రాజకీయ పలుకుబడితో ఏ స్థాయిలో భయబ్రాంతులకు గురి చేసిందో తెలుస్తుంది. పాపం పండింది. ప్రజ్వల్ ఎంతగా మొత్తుకున్నా సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. అత్యాచారాలు చేసి పైశాచికానందం పొంది, వాటిని సెల్‌ ఫోన్లలో వీడియోలు తీసి మురిసి పోయిన ప్రజ్వల్‌ లాంటి వాళ్ళకి ఏ శిక్ష విధించినా తక్కువే.

అలాగే ధర్మస్థలిపైనా నిజాయితీగా విచారణ జరగాలి. అప్పుడే ప్రజల్లో భరోసా వస్తుంది. కర్నాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవడానికి ఇదో మంచి అవకాశం. ప్రతిపక్ష నేత రాహుల్‌ ఈ విషయంలో తమ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ధర్మస్థలి విషయంలోనూ నిగ్గు తేలేలా చేస్తే మంచిది. లేదంటే అలిశెట్టి ప్రభాకర్ చెప్పినట్లుగానే ‘నాగరిక ప్రపంచం అంటూ అనాగరికంగా స్త్రీల పట్ల ప్రవర్తిస్తున్న లోకంలో సోయితో మహిళలు కత్తులా మెరవాలి.

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News