పతిభకు ఆకాసం కూడా హద్దు కాదు. కళకు వయసుతో సంబంధం లేదు. సంకల్పముంటే సాధించలేనిదేదీ లేదు. ఏందీ గీ స్పూర్తి నీతి సూత్రాలనుకుంటాండ్రా? గి సిన్న పిల్ల ముందు గయన్నీ సిన్నబోయినయి మరి. గదేందో తెల్సుకుందాం పదండ్రి.

గా కర్ణాటకల ఉత్తర కన్నడ జిల్లాల ఉన్న గీ రెండేండ్ల సిన్నారి పేరు స్వరశ్రీ. గీమె సంగీతంల అద్భుతాలు సేత్తాంది. తబలా మీద 12 రకాల తాళాలను వాయిస్తూ అందర్నీ ఆశీరపరుస్తాంది. గంతేకాదుల్లా.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ల కూడా ఎక్కింది. గీ బుజ్జి స్వరశ్రీ.. మస్తు పేరున్న తబలా విద్వాంసుడు గరురాజ్ హెగ్దే, హిందుస్థానీ పాటలు పాడే శ్రీలతల బిడ్డ. గీ సిన్నారికి 12-14 నెలల వయసులోనే గీ తబలా మీద మనసు పడ్డదట. గందుకే గా స్వరశ్రీ కోసం పత్యేకంగ రెండు శిన్న తబలాలు శేయించిండ్రట గామె తల్లిదండ్రులు. ఇగ గప్పటి నుంచే గా శిన్నారి తాళాలు వాయిత్తాందట. మన పిల్లలకు కూడ గట్ల మనసుపడ్డయి నేర్పిత్తే, మస్తు ఎదుగతరు. ఏమంటరు?

