Tuesday, August 11, 2026
27.8 C
Hyderabad

మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!!|ADUGU TRENDS

గంజి నీల్లు తాగినోడు మట్టిలోనే..! బెంజి కార్ల తిరిగినోడు మట్టిలోనే..!! మనతో తెచ్చిందేమీ లేదు. తీసుకపోయేదేమీ లేదు. మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!! గీ సూత్రం తెలిసినోల్లు గీ భూమ్మీద మనుసుల్లెక్క మసులుకుంటరు. తెలవనోల్లు ఎగిరెగిరి ఎక్కడ్నో పడ్తరు. గిసొంటిది తెల్సుకున్నాయినె కాబట్టే గి హిందీ సినిమా, టీవీలల్ల అందరినీ నవ్విపిచ్చే గీ సునీల్ గ్రోవర్ సాదా సీదా మనిసి లెక్కనే బతుకుతాండు.

గీ మద్దెలనే గాయిన ఉత్తర ప్రదేస్ గంగా నది ఒడ్డున స్నానాల ఘాట్లల్ల సామాన్య జనం మద్దెల పడుకుండు. గా ఒడ్డున ఏ దిక్కూ లేనోల్లు, నిలువ నీడ లేనోల్లు, సాధువులు, గా సుట్టుపక్కల అడుక్కుతినేటోల్లే ఎక్కువ ఉంటరు. గావాల్ల మద్దెల శిన్న పంచె పరుసుకున్నడు. పక్కగోలుగ పడుకున్నడు. గిదిప్పుడు నెట్టింట్ల వైరలైతాంది. సునీల్ గ్రోవర్ మస్తు జనాదరణ పొందిన నవ్విపిచ్చే నడుటు. ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ల ‘గుత్తి’ ‘ద కపిల్ శర్మ షో’ల ‘డాక్టర్ మషూర్ గులాటి’, ‘రింకు భాభి’ పాత్రలతో దేశమంతా గుర్తింపు పొందిండు. గజిని, గబ్బర్ ఈజ్ బ్యాక్, భారత్, పటాఖా, జవాన్ వంటి హింది సినిమాల్ల కీలక పాత్రలు చేసిండు. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ల కపిల్ శర్మతో కనిపిత్తాండు. గీయినె నాటక రంగంలో మాస్టర్స్ డిగ్రీ పొంది, రేడియోల గొంతును అరువిచ్చిండు. గాన్నుంచి వచ్చిండు.

Latest News

జెరం గోలీలు బట్టలకేత్తండ్లు!?|ADUGU TRENDS

బట్టలు సర్ఫు, సబ్బుతోటి ఉతుకుతం. గా బట్టలుతికే మిషినిలైతే లిక్విడ్ పొత్తం. జెరం వత్తే, ఓ పారాసిటమాల్ గోలేత్తం. గీ జెరానికేసే గోలి గా బట్టలకెత్తే!? గా జెరం పోయినట్లే గా మురికి...

నిన్న నీట్‌! నేడు జార్ఖండ్‌!! మరి రేపు?|EDITORIAL

నిన్న నీట్‌! నేడు జార్ఖండ్‌!! మరి రేపు? మరెక్కడైనా ఇదే పరిస్థితి పునరావృతం కాకూడదు. పరీక్ష ప్రశ్నపత్రాన్ని అమ్ముకునే వ్యక్తి కేవలం విద్యార్థులను మోసం చేయడం లేదు. మెరిట్‌, కష్టం, ప్రతిభపై ఉన్న...

ఆగస్టు 11, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి చతుర్దశి రాత్రి 01.32 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం పునర్వసు ఉదయం 10.19 వరకు ఉపరి పుష్యమి యోగం సిద్ది రాత్రి 08.13 వరకు ఉపరి వ్యతీపాత కరణం భద్ర మధ్యాహ్నం 02.43...

ఆగస్టు 10, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 06.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ఆరుద్ర ఉదయం 11.53 వరకు ఉపరి పునర్వసు యోగం వజ్ర రాత్రి 11.10 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 06.13 వరకు ఉపరి...

బోనాలు – చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం|BONALU|HISTORY|CULTURE

చారిత్రక, పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాల విశ్లేషణ ప్రకారం బోనం సమర్పించే ఆచారం ఆషాఢ మాసంలో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాల్లో గ్రామదేవతారాధనలో అంతర్భాగంగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభ దశలో...

కల్లుకు శిల్లు.. సీసీ కెమెరా!?|ADUGU TRENDS

యెన్కటికి దొంగకు శెప్పే లాభమన్నరు. దోసుకుంటోనికి శెప్పైనా, తప్పైనా ఒకటే. పడదలే సూసుకుంటడు. గట్లనే గీ మద్దెల దొంగలు తమ రూటు మార్సుకున్నరు. కంటికి కనుకు లేకుండా ఇంటికి కన్నాలేసుడు అసొంటివి మానేసిండ్రు....

రాహుల్ ముందున్న మార్గాలివే!?|EDITORIAL

రాహుల్‌ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 09 నుండి ఆగస్టు 15 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశివారికి అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల...

నవ్వినోల్లే నోర్లెల్లబెట్టిండ్రు!?|ADUGU TRENDS

సంకల్పించాలె కనీ, కాని పని ఉంటదా? ఉండనే ఉండదని నిరూపించిండు గీ పెద్దాయినె. నల్గురు సూసి నవ్వినా, నా పని నేను శేసుక పోతానని, శేసి సూపిండు. గీయినె పేరు హీలియో డా సల్వా....

క్యా బోల్తే… పాలక్!?|EDITORIAL

దేశ భవిష్యత్తు యువతే. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల...

ఆగస్టు 08, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి దశమి ఉదయం 11.09 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రోహిణీ మధ్యాహ్నం 03.15 వరకు ఉపరి మృగశిర యోగం ధ్రువ ఉదయం 08.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 11.09 వరకు ఉపరి...

ఇగిప్పుడు ‘సావు’కొచ్చింది!?|ADUGU TRENDS

మన ఊర్లల్ల ఎవ్వలన్న కాలం శేసిండ్రంటేనే సూసొత్తం. కనికరం సూపి తలో సెయ్యేత్తం. దిక్కూమొక్కూలేనోల్లతై మనమే తలా ఇంతేసుకుని గాయింత ఇగ గా కట్టెల్లేసొత్తం. కానీ, తలకొరివి పెట్టాల్సిన కన్న బిడ్డలే కడసారి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News