BRS విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైందని ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదని ఆయన విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి BRS మాత్రమే నిజమైన పోరాటం చేయగలరని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు అవసరాలు తమకే తెలుసని ప్రజల కోసం ఏదైనా కష్టం వస్తే కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు మళ్ళీ BRS అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తామని మళ్లీ అధికారం చేపడుతామని స్పష్టం చేశారు.

