Thursday, September 24, 2026
24.5 C
Hyderabad

MINISTERS|‘అడుసు’తొక్కనేల!? ‘కాళ్ళు’ కడగనేల!? SEETHAKKA

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో ఇద్దరు మహిళా మంత్రులుంటే ఇద్దరూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారే. ఇద్దరికిద్దరూ ఫైర్ బ్రాండ్లే! ఒకరు మాటల్ని ‘తూటాల్లా’ పేలిస్తే, మరొకరు ‘బాంబుల్లా’ పేల్చేస్తారు. ఒకరు వివాదాల మీద వివాదాలు స్రుష్టిస్తుంటే, మరొకరు వాదాలను వివాదాలు చేసేస్తారు. ఒకరు సొంత పార్టీలోని తన సహచర తాజా మంత్రులనే ఇరుకున పెడితే, మరొకరు మాజీ మంత్రులను రఫాడిస్తారు. ఒకరు మాట అహంకారపూరితంగా అనిపిస్తే, మరొకరు ప్రత్యర్థుల అహంకారాన్ని నిలదీస్తారు? నిగ్గదీస్తారు. భాషా పద ప్రయోగ, విధి విన్యాసాలను వారి మాటల్లోనే వినాలి. కాకపోతే ఇక్కడ చదువుకోవాలి.

పిల్లలతో ఓ స్కూల్ మీటింగులో రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖల మంత్రి కొండా సురేఖ మాటలు వివాదాస్పదమయ్యాయి. వాటిని కప్పి పుచ్చడానికి మరో వివాదంలోకి వెళ్ళారు. ఫైళ్ళపై సంతకాలు చేయడానికి మంత్రులు డబ్బులు తీసుకుంటారని, తాను మాత్రం తీసుకోనని అని, నేను అలా అనలేదు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో అలా ఉండేదని ఇంకో వివాదం రేపారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ధిశాఖల మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క వ్యాఖ్యలు కూడా ఒక వివాదాన్ని సద్దు మణిగించే ప్రయత్నంలో మరో మూడు వివాదాలకు తావిచ్చాయి. ఇవాంక ట్రంపు ఇండియాకొచ్చినప్పుడు ఆమె తోక పట్టుకుని తిరిగిన నాయకుడు అంటూ కేటీఆర్ పేరును ఉటంకించకుండా చేసిన వ్యాఖ్యలు కంపులేపాయి.. అలాగే సిగ్గులేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారు. అబద్ధాలకు అంబాసిడర్ అంటూ మాజీ మంత్రి సబితపై సెటైర్లు వేశారు. కలెక్టర్లను కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకున్నారని, కాళ్ళు మొక్కించుకున్నారని చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.

‘అడుసు’తొక్కనేల!?
FOREST|‘అటవీశాఖ మంత్రిగా ఉన్నాను. కాబట్టి నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైళ్ళ క్లియరెన్స్ కోసం వస్తాయి. మమూలుగా అలాంటి ఫైళ్ళు వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకుని క్లియర్ చేస్తారు. అప్పుడు వాళ్ళతో నేను అన్నా… మాకు ఒక్క నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు సమాజ సేవ చేయండి. మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి. మీ పేరు గుర్తుండి పోతుందని చెప్పా. అప్పుడు మా చేతుల్లో లేదు. పై వాళ్ళతో మాట్లాడతామని అరబిందో ఫార్మాకుచెందిన సదానందరెడ్డి చెప్పారు. చివరకు సిఎస్ఆర్ నిధులు రూ.4.5 కోట్లతో కాలేజీ భవనం కడతామని చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగింది.’ అన్నారు.
ఆ వివాదాన్నుంచి తప్పించుకోవడానికి మరో వివాదం లోకి కూరుకుపోయారు. ‘నిన్న వరంగల్‌లో నేను చేసిన వ్యాఖ్యలపై కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. నేను గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అప్పటి మంత్రులు ఏ పని చేయాలన్నా పైసలు తీసుకునేవారని మాత్రమే అన్నాను. ఇది అక్షర సత్యం. నా ఆ వ్యాఖ్యలకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను.’

‘కాళ్ళు’ కడగనేల!?
‘గుళ్లలోకి కాళ్లు కడుక్కొని వెళ్లడం గిరిజన సంప్రదాయం.. అదే అక్కడ పాటించారు. అందులో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయి సుందరీమణుల కాళ్లకు నీళ్లు పోసింది. దాన్ని పట్టుకుని తెలంగాణ ప్రభుత్వం చేసిందని బద్నాం చేస్తున్నారు. నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కాళ్లు కడిగితే అందరి కాళ్లూ కడిగించాలి కదా?. ఇలాంటి విషయాలను ప్రభుత్వానికి అంటగట్టడం సిగ్గు అనిపించడం లేదా?. ఎమ్మెల్సీ కవిత|KAVITHA తన కాళ్ల దగ్గర కలెక్టర్‌ను కూర్చోబెట్టుకోవడం, కలెక్టర్లతో కేసీఆర్ కాళ్లు మొక్కించుకోవడం దురహంకారం కాదా? తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత మీకుందా?’
‘ఈ మధ్య సబిత MULUGU|ములుగు మీద పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఏం మానవత్వం చూపిందో తెలుసు. అబద్దాలకు అంబాసిడర్ గా సబితమ్మ మారకూడదు. అధికారం పోయాక, ప్రజల ఆత్మగౌరవం మీకు గుర్తుకు వచ్చిందా?’
‘హెరిటేజ్ వాక్ సక్సస్ కావడంతో బీఆర్ఎస్ నేతలు కళ్లలో నిప్పులు పోసుకున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాంక ట్రంప్ వచ్చినప్పుడు తోక పట్టుకుని తిరిగిన నాయకుడు, ఎలాంటి సంస్కృతి, సంప్రదాయాలు పాటించారో అందరికీ తెలుసు.’

Latest News

SIRపై CJP సమరం..|SIR|CJP

సీఈసీకి 48 గంటల డెడ్‌లైన్! న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ **(SIR)**పై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో...

తెలంగాణ వార్‌రూమ్‌ టు ఢిల్లీ వార్‌రూమ్‌|TELANGANA|WAR ROOM|DELHI|WAR ROOM

రుద్ర సంతోష్‌ కుమార్‌కు ఏఐసీసీలో కీలక బాధ్యతలు హైదరాబాద్‌: తెలంగాణలో కులగణన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకు సమన్వయం చేసిన కాంగ్రెస్‌ నాయకుడు రుద్ర సంతోష్‌ కుమార్‌కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. జాతీయ...

జింబాబ్వేలో ఘనంగా గణేష్ శోభాయాత్ర|ZIMBABWE|GANESH|SHOBHA YATRA

రూ.8 లక్షలకు లడ్డూ సొంతం చేసుకున్న బద్దం నరేష్ రెడ్డి జింబాబ్వే రాజధాని హరారేలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హరారే గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించిన వేడుకలు...

యికటి0చిన ముద్దు కటకాలు సూపింది!?|ADUGU TRENDS

ము ము ముద్దంటే చేదా?! ఆ ఉద్దేశ్యం లేదా? అన్నరు. ముద్దంటే ఎవరికి చేదు చెప్పండి. ఆ ఉద్దేశ్యం ఉందో? లేదో తెలుసుకోకపోతే, ముద్దూ, ముచ్చటా యికటిత్తయి. కటకాలు కూడా సూపిత్తయి. ముద్దుకైన, ముచ్చటకైన...

ఊగిసలాటకు ఊతం భద్రతే!|EDITORIAL

చమురు ధరల ఊగిసలాటకు తాత్కాలిక దౌత్య పరిణామాలు మాత్రమే కాకుండా యుద్ధం, రవాణా అంతరాయాలు, ఉత్పత్తి సామర్థ్యం, భద్రతా ముప్పులు కారణమవుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొని, అంతర్జాతీయ నౌకా రవాణా సాధారణ స్థితికి...

సెప్టెంబర్ 24, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 09.33 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ధనిష్ఠ ఉదయం 09.58 వరకు ఉపరి శతభిషం యోగం ధృతి సాయంత్రం 04.34 వరకు ఉపరి శూల కరణం కౌలవ ఉదయం 09.08...

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News