Tuesday, October 27, 2026
27.9 C
Hyderabad

ముక్కోటి ఏకదశి పర్వదిన విశిష్టత

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.[1] సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గం’ మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది.
ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. అటు తర్వాత జపం, ధ్యానం.
విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ, తమ కథ విని, వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారు. అందుజేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. తిరువతిలో కూడా ఈ రోజును వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు.
పద్మ పురాణం ప్రకారం విష్ణువునుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిని జాగురూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం.ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

గీ ఇలసే.. గా పులస!?|ADUGU TRENDS

శేపల్ల గీ శేపలకే మస్తు గిరాకీ. గందుకే పుస్తెలమ్మైనా గా పులసలు తినాలనే సామెత ఒచ్చింది. కనీ, గీ ఇలసలేందని అనుకుంటాండ్లా? గీ ఇలసలే తర్వాత పులసలైతయట.! గందుకే గీ సీజన్ల గీ...

ఆర్థిక సంక్షోభమేనా!?|EDITORIAL

వానలు ముఖం చాటేశాయి.. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.. పంటలపై కరువు పంజా విసురుతోంది! మరోవైపు పెరుగుతున్న విద్యుత్ వ్యయం, సంక్షేమ పథకాల ఖర్చులు తెలంగాణ ఖజానాపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రకృతి దెబ్బకు ఆర్థిక...

అక్టోబర్ 27, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి పాడ్యమి ఉదయం 08.05 వరకు ఉపరి విదియ నక్షత్రం భరణి సాయంత్రం 06.03 వరకు ఉపరి కృత్తిక యోగం సిద్ది పగలు 01.50 వరకు ఉపరి వ్యతీపాత కరణం కౌలవ ఉదయం 08.05 వరకు ఉపరి...

అక్టోబర్ 26, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం శుక్లపక్షం తిధి పౌర్ణమి ఉదయం 09.35 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం అశ్విని రాత్రి 07.00 వరకు ఉపరి భరణి యోగం వజ్ర సాయంత్రం 04.15 వరకు ఉపరి సిద్ది కరణం బవ ఉదయం 09.35 వరకు ఉపరి...

మధ్యయుగ భారతదేశ చరిత్ర|HISTORY|ADUGU DIGITAL MEDIA|COMPITITVE EXAMS|SPECIAL

భారతదేశ చరిత్రలో మధ్య యుగాల దశ ఎంతో కీలకమైనది. దీనిని చీకటి యుగం అని కూడా అంటారు. ఈ కాలంలో అభివృద్ధి స్తంభించిపోయి, శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగమనం పూర్తిగా నిలిచిపోయిందని చరిత్రకారులు...

తప్పించడమా? తప్పుకోవడమా?|INDIA|ELECTION COMMISSION

సీఈసీని తొలగించడం అంత ఈజీ కాదా!? భారత ప్రభుత్వం ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను నేరుగా తొలగించగలదా? అదంత సులభమా? సుప్రీం కోర్టు సీఈసీని తప్పుకోమనో, తప్పించమనో ప్రభుత్వాన్ని ఆదేశించగలదా? రాజకీయంగా కేంద్ర ప్రభుత్వమో...

తంతే రూపాల గుట్టల్ల..!?|ADUGU TRENDS

ఒక అవుడియా జీవితాన్నే మార్సేస్తే, మరి ఒక లక్కీ లాటరీ ఎంత మార్పు తేవాలె? ఎంతగా జీవితాన్ని మార్సేయాలె? ఒకటా, రెండా? లచ్చో, కోటో కూడా కాదాయె.! ఏకంగా 240 కోట్ల రూపాయెల...

అప్రమత్తతే అసలైన పరిష్కారం!?|EDITORIAL

ఎల్‌నినో ప్రభావం ఎంతకాలం కొనసాగుతుందన్నది నిరంతరం మారే అంచనాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల అధికారిక సూచనలను క్రమం తప్పకుండా పరిశీలించాలి. ప్రకృతిని నియంత్రించలేకపోయినా, నీటిని పొదుపు చేయడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వ్యవసాయాన్ని ముందస్తుగా...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

అక్టోబర్ 25 నుండి అక్టోబర్ 31 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం, పనులను వేగంగా పూర్తి చేయాలనే పట్టుదల పెరుగుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం...

ముసలోనితోటి నిచ్చితార్థం! పెనిమిటి కోసం రద్దు!?|ADUGU TRENDS

గీ మద్దెల మనుసులు యేగంగా మారుతాండ్రు. సోసల్ మీడియ చెలరేగుతాంది. ఇగ మనుసులు ఎంతకైనా దిగజారుతాండ్రు. ఇగెంతకైనా ఎగబాకుతాండ్రు. సబ్ స్క్రైబర్లు, లైకులు, శేర్ల కోసం సిగ్గు శెరం లేని పనులు కూడా...

గాలి కాదు.. గరళం!|EDITORIAL

ఊపిరి పోసే గాలే ఇప్పుడు ప్రాణాలు తీసే విషంగా మారుతోంది! హైదరాబాద్‌లో పీఎం-10 స్థాయులు జాతీయ ప్రమాణాలను 33.3 శాతం మించగా, సంగారెడ్డి, నల్గొండల్లోనూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దిల్లీలోనూ గాలి నాణ్యత...

అక్టోబర్ 24, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం శుక్లపక్షం స్వాతి కార్తె అక్టోబర్ 24 నుండి నవంబర్ 06 వరకు ఉపరి విశాఖ కార్తె తిధి త్రయోదశి ఉదయం 11.19 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 07.42 వరకు ఉపరి రేవతి యోగం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News