Thursday, September 17, 2026
30.5 C
Hyderabad

ఎల్ఐసీపై మోదీ-అదానీ ప్రై‘వేటు’!?|EDITORIAL

1956 సెప్టెంబర్ 1న 245 బీమా సంస్థలతో కలిపి భారతీయ జీవిత బీమా సంస్థగా ఏర్పడిన ఎల్ఐసి, లక్షా 14వేల మంది ఉద్యోగులతో, 38 కోట్ల పాలసీదారులతో విస్తరించింది. ఎల్ఐసీ ఆస్తుల విలువ రూ.32 లక్షల కోట్లు. నికర ఆదాయం రూ.2,700 కోట్లు. రెవిన్యూ రూ.5 లక్షల 60వేల కోట్లు. భారత దేశంలో అతి పెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ. ప్రపంచంలోనే అత్యంత బలమైన బీమా బ్రాండ్‌లలో మూడవది. బీమాను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం లక్ష్యం. ‘యోగక్షేమం వహామ్యహ’ -మీ సంక్షేమం మా బాధ్యత-నినాదం.
భారత ప్రజల స్వేదంతో నిర్మితమైన భారతీయ జీబిత బీమా సంస్థ అదానీ పరమవుతోందా? అదానీ ఆర్థిక పరిపుష్టికి ఎల్ఐసీని తాకట్టు పెడుతున్నారా? బీజేపీ మోదీ ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? మోదీలో ‘ఆదా’ –సగం- గా పేరుబడిన గౌతం అదానీ గ్రూపునకు అప్పనంగా ఎల్ఐసీని అప్పగిస్తున్నారా? ఎక్కడో అమెరికాలో ఉన్న ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ కథనం వెలువరించే వరకు, బయటకు తెలియకుండా గుట్టు గా గుటకాయ స్వాహా చేస్తున్నారా?
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్ 

భారత ప్రజల స్వేదంతో నిర్మితమైన భారతీయ జీబిత బీమా సంస్థ అదానీ పరమవుతోందా? అదానీ ఆర్థిక పరిపుష్టికి ఎల్ఐసీని తాకట్టు పెడుతున్నారా? బీజేపీ మోదీ ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? మోదీలో ‘ఆదా’ –సగం- గా పేరుబడిన గౌతం అదానీ గ్రూపునకు అప్పనంగా ఎల్ఐసీని అప్పగిస్తున్నారా? ఎక్కడో అమెరికాలో ఉన్న ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ కథనం వెలువరించే వరకు, బయటకు తెలియకుండా గుట్టు గా గుటకాయ స్వాహా చేస్తున్నారా?

1956సెప్టెంబర్ 1న దేశంలోని 245 బీమా సంస్థలతో కలిపి భారతీయ జీవిత బీమా సంస్థను ఏర్పాటు చేశారు. బీమాను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం లక్ష్యం. ‘యోగక్షేమం వహామ్యహ’ -మీ సంక్షేమం మా బాధ్యత-నినాదం. హౌసింగ్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ లి., కార్డ్స్ సర్వీసెస్ లి., మ్యూచువల్ ఫండ్ లి., పెంషన్ ఫండ్ లి., ఐడిబిఐ బ్యాంకుగా లక్షా 14వేల మంది ఉద్యోగులతో, 38 కోట్ల పాలసీదారులతో విస్తరించింది. ఎల్ఐసీ ఆస్తుల విలువ రూ.32 లక్షల కోట్లు. నికర ఆదాయం రూ.2,700 కోట్లు. రెవిన్యూ రూ.5 లక్షల 60వేల కోట్లు. భారత దేశంలో అతి పెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ. 2024లో బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం, ఎల్‌ఐసీ ప్రపంచంలోనే అత్యంత బలమైన బీమా బ్రాండ్‌లలో మూడవది. ఎస్ అండ్ పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్రకారం 2022 నాటికి నాలుగవది. ఇంత పెద్ద సంస్థ ఇప్పుడు ఓ ప్రైవేట్ వ్యక్తి పరం కాబోతోందా?

అదానీతో ప్రధాని మోదీ బంధం బలమైంది. అదానీ కంపెనీపై ఎన్ని విమర్శలు వచ్చినా, ఏ చర్యా తీసుకోలేదు. కనీసం ఖండించలేదు. అదానీ వ్యవహారంపై గతంలో పార్లమెంట్‌ స్తంభించింది. ఆర్థిక అవతవకలు, అమెరికా సంస్థ ఆరోపణలు అలా ఉండగానే తాజగా ఆ కంపెనీకి ఎల్‌ఐసి మొత్తాన్ని ధార పోశారు. ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థ ఎల్‌ఐసిని అదానీ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం బలి పెట్టడంపై వస్తున్న విమర్శలను సైతం పట్టించుకోవడం లేదు. కోట్లాదిమంది పాలసీదారుల, ఉద్యోగుల, అధికారుల ప్రయోజనాలను అదానీకి బలివ్వడం అసమంజసం.

గతంలోనే ఎల్‌ఐసిని ప్రైవేటీకరించాలని చూసినప్పుడు, దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఎల్‌ఐసి మొత్తాలను అదానికి అప్పుగా బదిలీ చేయడంపై దేశంలో మళ్ళీ నిరసనలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లెఫ్ట్‌ నేతలు కూనంనేని సాంబశివరావు, బివి రాఘవులు, మరికొందరు వ్యతిరేకతను చాటారు.

అమెరికా నుండి వెలువడే ’వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రికలో ఎల్ఐసీపై ప్రత్యేక కథనం వచ్చింది. అంతర్జాతీయంగా విత్త సంస్థలు అదానీకి అప్పులు ఇవ్వడానికి నిరాకరిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం 3.9 మిలియన్‌ డాలర్లు అంటే 33 వేల కోట్ల రూపాయలను అదానీ గ్రూపునకు మళ్లించడానికి సిద్ధమైందననే ఆ వార్త సారాంశం. ఇందులో భాగంగానే అదానీ పోర్ట్స్‌ అనుబంధ సంస్థ రుణాల రీఫైనాన్స్‌ కోసం జారీ చేసిన 585 బిలియన్‌ డాలర్ల దాదాపు రూ.5,000 కోట్ల బాండ్లను ఎల్‌ఐసి కొనుగోలు చేసింది. అదానీపై ‘లంచం, మోసం ఆరోపణలపై అమెరికా కోర్టుల్లో కేసులు నమోదైన నేపథ్యంలో అమెరికా, యూరోపియన్‌ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనుకాడాతున్న తరుణంలో భారత ప్రభుత్వం అదానీ కోసం ప్రత్యేక ఆర్థిక మద్దతు ప్రణాళికను రూపొందించిందని వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది. ఆర్థిక సేవల విభాగం (డిఎఫ్‌ఎస్‌), ఎల్‌ఐసి నుండి పొందిన అంతర్గత పత్రాలు సహా అధికారులు, బ్యాంకర్లతో ఇంటర్వ్యూల ఆధారంగా ప్రభుత్వం ఈ నిధుల మళ్లింపునకు ఏ విధంగా పాల్పడిందో గుర్తించామని ఆ పత్రిక పేర్కొంది.

రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో అదానీ పోర్ట్సు విడుదల చేసిన మొత్తం బాండ్లను 2025 మే 30న ఒక్క ఎల్‌ఐసి కొనేసింది. అదానీ గ్రూపునకు విశ్వసనీయత కల్పించడమన్నది అసలు కుట్ర. అందుకే అంతకు ముందు ససేమిరా అన్న అమెరికా ఏథెన్‌ ఇన్సూరెన్స్‌ అదానీలో జూన్‌లో 750 మిలియన్‌ డాలర్లు అంటే రూ.6,650 కోట్లు పెట్టుబడులు పెట్టింది.

ఆదానీ ఆర్థిక అక్రమాలు, అవినీతిపై 2023 జనవరిలో హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ వరుస రిపోర్టులను విడుదల చేసింది. అదానీ కృత్రిమంగా తన కంపెనీల షేర్లను పెంచుకుంటున్నారని, డొల్ల కంపెనీలతో పన్నులు ఎగ్గొడుతున్నారని విశ్లేషించింది. అదానీ కంపెనీలు ప్రమాదకర అప్పుల్లో కూరుకుపోయాయని కూడా వెల్లడించింది. ఇప్పుడు వాషింగ్టన్‌ పోస్ట్‌ రిపోర్ట్‌ ప్రభుత్వ వర్గాలు, ఇన్వెస్టర్లు, కార్పొరేట్‌ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

అయితే అదానీ గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడులపై తమపై ఎవరి ఒత్తిళ్లు లేవని ఎల్‌ఐసి పేర్కొంది. బోర్డు ఆమోదించిన విధి విధానాల మేరకే తాము పెట్టుబడులు పెడతామని, వాటిపై తమదే తుది నిర్ణయమని బుకాయించింది. ఇంతకీ ఎల్‌ఐసిలో ఏం జరుగుతుందో దేశ ప్రజలకు తెలపడం ప్రభుత్వ బాధ్యత. వెంటనే పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలి. ఇంతపెద్ద మొత్తంలో వ్యవహారం గుంభనంగా సాగడాన్ని అడ్డుకోవాలి. ఎల్‌ఐసిని ప్రైవేట్‌ పరం చేస్తున్నారా? అయితే, ప్రభుత్వంపై ప్రజల ఒత్తిడి పెంచాలి. పాలకుల కార్పొరేట్‌ అనుకూల నిర్ణయాలపై నిలదీయాలి. విపక్ష కాంగ్రెస్‌ గట్టిగా నిలబడాలి. ఎల్‌ఐసిని రక్షించే పోరాటానికి దిగాలి. అందుకు దేశంలోని ప్రజలు కూడా అవగాహనతో అడుగులు వేయాలి.

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News