Tuesday, September 15, 2026
25.7 C
Hyderabad

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు గడిచినా, గత ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణల నిరూపణల్లో జాప్యం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ అజెండా నుంచి నెమ్మదిగా తప్పుకోవడం రాజకీయ వ్యూహమా? లేక పరిపాలనా లోపమా? పరిమితుల కారణమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలి పరిణామాలు అధికార కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలోకి నెట్టుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలోకి రావడానికి ముందు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకత్వం, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు గడిచినా, గత ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు, అవినీతి నిరూపణలపై స్పష్టమైన పురోగతి కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

బీఆర్ఎస్ హయాంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్, ఈ కార్ రేసు, ధరణి వంటి కీలక అంశాలపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాలు నెమ్మదిగా అజెండా నుంచి తప్పుకోవడం గమనార్హం. ఇది రాజకీయ వ్యూహమా? లేక పరిపాలనా లోపమా? పరిమితుల కారణమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరోపణలు చేయడం ఒక ఎత్తు. వాటిని నిరూపించడం మరో ఎత్తు. అయితే, అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తాత్సారమే అనేక ప్రశ్నలను సంధిస్తున్నాయి.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులపై కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఆరోపణలను ఆయన ఖండించినప్పటికీ, ప్రజల్లో నమ్మకం కలిగేలా సమగ్ర విచారణ, అనుమానాలను నివ్రుతి జరగలేదన్న అభిప్రాయం ఉంది. “నిప్పులేనిదే పొగరాదు” అన్న సామెత ఇక్కడ ప్రస్తావనకు వస్తోంది. అధికారంలో ఉన్నవారు పారదర్శకంగా స్పందించకపోతే అనుమానాలు మరింత పెరుగుతాయి.

నాదర్‌గుల్ ప్రాంతంలో భూములపై నెలకొన్న వివాదం ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారింది. దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూముల నుంచి రైతులను దూరం చేయడం, ప్రైవేట్ కంపెనీల జోక్యం పెరగడం వంటి అంశాలు తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ఆ భూములు ప్రభుత్వానివా? ప్రైవేట్‌వా? రైతుల హక్కులు ఎమయ్యాయి? ప్రభుత్వం ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు? జవాబు దొరకని పరిస్థితుల్లో రైతులు భూపోరాటానికి దిగారు. వారు కేవలం నిరసనలకే పరిమితం కాకుండా, ప్రత్యక్ష చర్యలకు దిగడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది.

రైతులు తమ భూముల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు, బౌన్సర్లు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. చివరకు పరిస్థితి అదుపుతప్పి, రైతులు గేట్లు దాటి లోపలికి వెళ్లడం, బౌన్సర్లను తరిమికొట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇది కేవలం భూమి వివాదం మాత్రమే కాదు. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతున్న సంకేతం కూడా.

ఈ ఉద్యమానికి బీఆర్ఎస్ తో పాటు వామపక్ష పార్టీలు మద్దతు తెలపడం రాజకీయ రంగును తీసుకువచ్చింది. మరోవైపు కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లి కూడా ప్రతిపక్షంపై విమర్శలు చేయడం రైతుల్లో అసహనాన్ని పెంచింది.

రైతులు సమస్య రాజకీయం కావడం కంటే పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయాలి? భూముల యాజమాన్యంపై స్పష్టత ఇవ్వాలి. స్వతంత్ర విచారణ జరపాలి. రైతుల హక్కులను రక్షించాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఇవి చేయకపోతే ప్రజల్లో అవిశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఒక కీలక దశలో ఉంది. ప్రతిపక్షాన్ని విమర్శించడం కంటే, పాలనలో పారదర్శకత చూపించడం అత్యవసరం. నాదర్‌గుల్ వంటి సంఘటనలు కేవలం స్థానిక సమస్యలు కావు. అవి ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పరీక్షించే సూచికలు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వచ్చి స్పష్టమైన సమాధానాలు ఇవ్వడం, చర్యలు తీసుకోవడం అవసరం.

Latest News

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News