తెలంగాణలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం అధికారిక ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు ప్రభుత్వం అధికారికంగా సెలవులు ప్రకటించింది. స్కూళ్లకు జనవరి 11 నుంచి 17 వరకు, జూనియర్ కాలేజీలకు 11 నుంచి 16 వరకు సెలవులు ఉంటాయని ప్రకటించింది. పాఠశాలలు తిరిగి జనవరి 18న ప్రారంభం కానున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి సెలవులు ఉండగా, ఈసారి రెండు రోజులు ముందుగా సెలవులు ఇచ్చారు.

